breaking news
six lakh
-
35 రోజుల్లో 6 లక్షల బియ్యం కార్డులు
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు సర్కారులో అర్హులైన వారికి రేషన్ కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీలు, మండల కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాల్సి వచ్చేది. అయినా సరే కొత్తగా రేషన్ కార్డు గానీ పెన్షన్ గానీ మంజూరు అయ్యేది కాదు. ఎక్కడైనా అరకొరగా మంజూరైనా లంచాలతో పాటు అప్పటి అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దక్కేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అర్హులైన లబ్ధిదారులకు ఉన్న ఊళ్లల్లోనే బియ్యం కార్డు, పెన్షన్, ఆరోగ్య శ్రీ కార్డులను నిర్ణీత గడువులోగా ఎవరి సిఫార్సులు, లంచాలు లేకుండానే మంజూరు చేస్తున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబద్ధత, చిత్తశుద్ధేనని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తోంది. అర్హతే ప్రామాణికం ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు అంటే 35 రోజుల్లో 6,11,824 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశారు. సీఎం నిర్ధారించిన పది రోజుల గడువులోగానే ఇవన్నీ మంజూరు చేశారు. ఇందులో పెళ్లిళ్లు అయ్యి కొత్త కాపురం పెట్టుకున్న వారికి కొత్తగా బియ్యం కార్డు మంజూరుతో పాటు ఎవరైనా కార్డులో కొత్తగా కుటుంబ సభ్యులను చేర్చడం, లేదా కార్డులో నుంచి పేరును విడదీయడం వంటివి కూడా ఉన్నాయి. దరఖాస్తు చేసుకున్నాక నిర్ణీత గడువులోగా 35 రోజుల్లో 99 శాతం మందికి బియ్యం కార్డులు అందాయి. వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాటిని అందజేశారు. ఎలాంటి సిఫార్సులూ అక్కరలేదు 35 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన 78,372 మందికి కొత్తగా వైఎస్సార్ పెన్షన్ కానుక మంజూరు చేశారు. అర్హులైన 99 శాతం మందికి పది రోజుల్లోనే పెన్షన్లు మంజూరు చేశారు. గత సర్కారులో అర్హులు ఎవరైనా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ ఊరిలో ఎవరైనా మృతి చెందితేనే ఆ స్థానంలో కొత్త పెన్షన్ ఇచ్చే వారు. అది కూడా జన్మభూమి కమిటీ సిఫార్సులు మేరకు మంజూరు చేసేవారు. ఇప్పుడు అర్హత ఉంటే చాలు సంతృప్త స్థాయిలో ఎవరి సిఫార్సులు లేకుండా పెన్షన్ మంజూరు చేస్తున్నారు. 35 రోజుల్లో అర్హులైన 38,830 మందికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కార్డులను దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లోనే మంజూరు చేశారు. గడువులోగా నూరు శాతం ఇవ్వడమే లక్ష్యం ప్రస్తుతం నిర్ణీత గడువులోగా అంటే పది రోజుల్లోనే పెన్షన్, బియ్యం కార్డులను 99 శాతం మందికి మంజూరు చేస్తున్నప్పటికీ సీఎం వైఎస్ జగన్ సంతృప్తి చెందడం లేదు. నూటికి నూరు శాతం మందికి నిర్ణీత గడువులోగా మంజూరు చేయాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. గతంలో అర్హత ఉన్న వారికి కూడా సంవత్సరాల తరబడి ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా అన్నీ మంజూరు చేస్తున్నాం. ఇందుకు ముఖ్యమంత్రి నిబద్ధత, చిత్తశుద్ధే కారణం. స్వయంగా ముఖ్యమంత్రే వీటిని పర్యవేక్షిస్తున్నారు. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి -
6 లక్షల కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఖర్చయిన మొత్తం అక్షరాలా రూ. 6 లక్షల కోట్లపైనే. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ప్రగతికి బాటలు పడడం, హైదరాబాద్ విశ్వనగరంగా రూపాంతరం చెందుతుండటంతో ఆ అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల రూపంలో కలిసొచ్చాయి. దీంతో 2016–17లోనే రాష్ట్ర ప్రభుత్వ రాబడులు రూ. లక్ష కోట్లు దాటాయి. ప్రభుత్వం కూడా మిగులు బడ్జెట్ గురించి ఆలోచన చేయకుండా రాబడులను దాదాపు పూర్తిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడంతో ఇప్పటివరకు రూ. 6.35 లక్షల కోట్లకుపైగా ఖర్చయింది. సంవత్సరాలవారీగా పరిశీలిస్తే 2014–15లో రూ. 61,840 కోట్లు ఖర్చుకాగా ఆ తర్వాతి ఏడాది రూ. 90 వేల కోట్లు దాటింది. ఇక మూడో ఏడాది నుంచి రూ. లక్ష కోట్లు దాటిన ప్రభుత్వ ఖర్చు ప్రస్తుత ఏడాదికి వచ్చే సరికి రూ. 1.42 లక్షల కోట్లకు చేరింది. అంటే ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరపతి 100 శాతంకన్నా ఎక్కువకు చేరిందన్నమాట. గత ఆరేళ్లలో రూ. 6.6 లక్షల కోట్ల రాబడులు రాగా అందులో 96 శాతం మేర అంటే రూ. 6.3 లక్షల కోట్లను ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ఖర్చు ప్రతి వ్యక్తిపై రూ. 1.81 లక్షలకుపైగా కావడం విశేషం. -
ఆరు లక్షల మంది టీచర్ల కొరత: పల్లంరాజు
దేశవ్యాప్తంగా ఆరులక్షల మంది టీచర్ల కొరత ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎంఎం పల్లంరాజు చెప్పారు. శనివారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యను అందించడానికి ఖాలీలను భర్తీచేయడంతో తగిన ప్రోత్సాహాలను అందిస్తామన్నారు. నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పల్లంరాజు తెలిపారు. అలాగే విద్యార్థినులు, మైనార్టీ బాలుర హాజరు శాతం పెంచాల్సిన అవసరముందని చెప్పారు. బీహార్‌లో చాప్రాలో మధ్యాహ్న భోజనం తిని 20 మంది పిల్లలు చనిపోయిన సంఘటన గురించి ఓ పశ్నకు సమాధానంగా.. మధ్యాహ్న భోజన పథకం అమలులో అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఆన్ని రాష్ట్రాలకు సూచించామని బదులిచ్చారు. జాతీయ పర్యవేక్షణ కమిటీ ఈ పథకాన్ని సమీక్షిస్తున్నట్టు పల్లంరాజు చెప్పారు.