breaking news
Short Film Festival
-
AKA: గీతాచిత్రలహరి
బాలీవుడ్ అనే మహా సముద్రంలో ప్రతి అల అరుదైన అనుభవాలు, జ్ఞాపకాలను మోసుకు వస్తుంది. వాటిని అందుకునే వారు అరుదుగా ఉంటారు. ఈ అరుదైన కోవకు చెందిన రైటర్, ఎడిటర్, డైరెక్టర్ గీతికా నారంగ్ అబ్బాసి కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్ గెలుచుకుంది... నార్త్ దిల్లీలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన గీతికా నారంగ్ అబ్బాసికి బాల్యంలో ఏకైక వినోద మాధ్యమం సినిమా. కాస్త చమత్కారంగా చెప్పాలంటే, ఆమె బాల్యజీవితంలో బాల్య జ్ఞాపకాల కంటే బాలీవుడ్ సినిమాలే ఎక్కువ! తండ్రి నారంగ్ అబ్బాసి బిమల్‌రాయ్, గురుదత్, రాజ్కపూర్ల గురించి చెప్పడమే కాదు వారి సినిమాలు చూపించేవాడు. చిన్నప్పుడు గీతికకు ఇష్టమైన కథానాయకుడు రాజ్‌కపూర్. గీతిక మాటల్లో చెప్పాలంటే రాజ్‌కపూర్ తన హావభావాలతో గ్రేట్ చార్లి చాప్లిన్‌ను తనకు పరిచయం చేశాడు. చార్లి చాప్లిన్ సినిమాలు చూసి... ‘ఈయన రాజ్‌కపూర్‌ను బాగా కాపీ కొడుతున్నాడు’ అని అమాయకంగా అనుకునే రోజులవి! దిల్లీలోని హిందూ కాలేజి నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టా పుచ్చుకుంది గీతిక. ఆ తరువాత ఎడ్వర్టైజింగ్లో పీజి చేసింది. అయితే ఆ చదువేమి తనకు అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఒక సాయంత్రం కాఫీ సేవిస్తూ... ‘నాట్ మై కప్ ఆఫ్ టీ’ అనుకుంది ప్రకటనల రంగం గురించి. దిల్లీలోని ఒక ఫిల్మ్‌ప్రొడక్షన్ కంపెనీలో చేరడంతో ఫిల్మ్ మేకింగ్‌పై తనకు అవగాహన ఏర్పడింది. కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. ‘హాలీవుడ్‌తో పోల్చితే మన దగ్గర డాక్యుమెంటరీల సంఖ్య చాలా తక్కువ. ఎందుకు ఇలా!’ అనుకునేది చాలాసార్లు. ఆ లోటును తనవంతుగా భర్తీ చేయడానికి అన్నట్లుగా తొలిసారిగా ‘గుడ్‌నైట్’ పేరుతో మొదటి సారిగా షార్ట్ డాక్యుమెంటరీ తీసింది. నాన్న తనకు సినిమాలకు సంబంధించిన విశేషాలు చెబుతుండేవాడు. ఉదా: ఫలానా సినిమాలో నృత్య బృందంలో కనిపించే అమ్మాయి ఆ తరువాత పెద్ద హీరోయిన్ అయింది...ఈ సినిమా పేరు చెప్పగానే ఆ హీరో నటవిశ్వరూపం గుర్తుకువస్తుందిగానీ, నిజానికి ఆ సినిమా కథ వేరొక హీరో కోసం తయారు చేసింది. ఆ హీరోకి నచ్చకపోవడంతో ఈ హీరోకి అవకాశం వచ్చి ఎక్కడికో తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో గీతికకు అనిపించింది ఏమిటంటే... ‘మన సినిమాల పైనే వివిధ కోణాల్లో డాక్యుమెంటరీలు తీస్తే ఎలా ఉంటుంది? చెప్పడానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కదా!’ విడుదలకు నోచుకోని ‘అమీర్ సల్మాన్ షారుఖ్’ ఫీచర్ ఫిల్మ్ నుంచి ‘అచ్చం ఫలానా హీరోలాగే ఉంటాను’ అని మురిసిపోయే జూనియర్ ఆర్టిస్ట్‌ల వరకు ఎన్నో విషయాలను తన డాక్యుమెంటరీలలోకి తీసుకువచ్చింది గీతిక. ఫిరోజ్ ఖాన్‌ను ‘మిమ్మల్ని చూసీ చూడగానే ప్రేక్షకులు నవ్వితే మీ స్పందన ఏమిటి?’ అని అడిగిందట. ‘ఆర్టిస్ట్‌లో హీరోయే కాదు జోకర్ కూడా ఉంటాడు’ అని హాయిగా నవ్వాడట ఫిరోజ్. ఇలా హాయిగా నవ్వే వాళ్లతో పాటు ‘అది నిన్నటి అభిప్రాయం మాత్రమే. ఈరోజు నా అభిప్రాయం మార్చుకున్నాను’ అని ఏ అభిప్రాయం మీద నిలకడలేని నటులతో చిత్రమైన అనుభవాలు ఎదుర్కొవలసి వచ్చింది గీతిక. నాటి ‘గుడ్‌నైట్’ నుంచి నేటి ‘ఏ.కె.ఏ’ వరకు రైటర్, ఎడిటర్, డైరెక్టర్‌గా గీతిక ఎన్నో విషయాలు నేర్చుకుంది. తనను తాను మెరుగుపరుచుకుంది. ఇటీవల కేరళలో జరిగిన ‘ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో గీతిక నారంగ్ తీసిన ‘ఏ.కె.ఏ’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించడమే కాదు ‘బెస్ట్ లాంగ్ డాక్యుమెంటరీ అవార్డ్’ను గెలుచుకుంది. బాలీవుడ్ కథానాయకులు దేవానంద్, అమితాబ్ బచ్చన్, షారుక్ఖాన్లను పోలి ఉండే ముగ్గురు వ్యక్తులపై తీసిన డాక్యుమెంటరీ ఇది. మిమిక్రీ నుంచి స్టార్డమ్ వరకు చిత్రరంగానికి సంబంధించి అన్ని కోణాలు ఇందులో కనిపిస్తాయి. ‘నా డాక్యుమెంటరీల లక్ష్యం నవ్వించడం కాదు, సీరియస్‌గా ఆలోచింపజేయడం’ అంటుంది గీతికా నారంగ్. అలా అని నవ్వకుండా ఉండలేము, అలా అని సీరియస్‌గా ఆలోచించకుండా ఉండలేము. అదే కదా ఆమె డాక్యుమెంటరీల ప్రత్యేకత! -
అద్వితీయం
‘గ్రీన్ గ్రోత్’... ఈ థీమ్‌తో కేరళ త్రిసూర్‌లో జరిగిన విబ్జియార్ అంతర్జాతీయ డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆబాలగోపాలాన్నీ అలరించింది. ఈ నెల 16 నుంచి 22 వరకు నిర్వహించిన ఈ పండగలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిలింస్‌కు గాడ్‌ఫాదర్ ఆనంద్ పట్వర్దన్తో పాటు అనేకమంది దేశవిదేశ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన అస్మితా ఫౌండేషన్ ప్రదర్శించిన ‘అహల్య’ నృత్యరూపకం ఫెస్టివల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అహల్య అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ రూపకం నలభై నిమిషాల పాటు ఆహూతులను ఆనంద డోలికల్లో ముంచెత్తింది. అహల్య చుట్టూ ఉన్న నాటి పరిస్థితులను నేటితరం స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చుతూ వినిపించిన వాయిస్ ఓవర్ ఆలోచనాత్మకంగా ఉంది. వసంత కన్నభిరన్ రాసిన ఈ బ్యాలేకు రాజేశ్వరీ సాయినాథ్, ఆమె కుమార్తె వైష్ణవి బృందం చేసిన నాట్యానికి ముగ్ధులైన ఆహూతులు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలిపారు. లాభాపేక్ష లేకుండా, సామాజిక బాధ్యతగా చేపట్టిన ఇలాంటి ఫెస్టివల్స్ ప్రతి రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉందని, ఇది ఓ మంచి పరిణామమని నగరం నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన షార్ట్ ఫిలిం మేకర్ నవీన్‌రెడ్డి చింతల, రెయిన్బో ఆర్జే మహ్మద్ అబ్దుల్ నయీం అభిప్రాయపడ్డారు. - ఓ మధు -
ఓ మెడికో ఆకాంక్ష
షార్ట్ ఫిలిం ఫెస్టివల్ బుల్లి సినిమా మేకర్స్ కోసం మరో ‘షార్ట్ ఫిలిం ఫెస్టివల్’ ఆహ్వానం పలుకుతోంది. ఐక్లిక్ మూవీస్.కామ్ షార్ట్ ఫిలిం మేకర్స్ కోసం నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్లో మీ చిన్న సినిమాతో పెద్ద బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్‌లో సాధారణంగా థీం, జానర్ ప్రకటిస్తుంటారు. ఐక్లిక్ అలాంటి నిబంధనలేమి లేకుండా, అన్ని రకాల జానర్ చిత్రాలను ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తోంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 12 నుంచి 15 నిమిషాల నిడివితో రూపొందించిన చిత్రాలను ఈ పోటీకి పంపవచ్చు. పోటీలో గెలిచిన 3 ఉత్తమ చిత్రాలకు చక్కటి నగదు బహుమతులు అందిస్తున్నారు. మొదటి ఉత్తమ చిత్రానికి లక్ష రూపాయలు, రెండో చిత్రానికి రూ.50 వేలు, మూడో చిత్రానికి రూ.25 వేల నగదు బహుమతి అందిస్తున్నారు. ఆఖరు తేదీ నవంబర్ 23. ఎంట్రీ ఫీజు రూ.300. వివరాలకు ఐక్లిక్ మూవీస్.కామ్‌ను సందర్శించవచ్చు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ చాలావుంది నిరుపేదలు కనీస వైద్య సౌకర్యాలకు నోచుకోలేక నానా ఇక్కట్లు పడుతుండటం మెడికో విద్యార్థి అరుున కార్తీక్‌ను కలచి వేసింది. నగరంలోని గాంధీ మెడికల్ కాలేజీలో సెకండియుర్ చదువుకుంటున్న కార్తీక్, తాను కళ్లారా చూసిన కొన్ని ఉదంతాల నుంచి ప్రేరణ పొంది, ఈ సందేశాత్మక లఘుచిత్రాన్ని రూపొందించాడు. ఇందులో కౌశిక్, హర్ష ప్రధాన మిత్రులు. ఇద్దరూ భిన్న ధ్రువాలు. కౌశిక్‌ది ఇతరుల కష్టాలకు త్వరగా చలించిపోయే స్వభావం. హర్షది సగటు కుర్రాళ్ల వూదిరిగానే జీవితాన్ని వీలైనంత వరకు ఎంజాయ్ చేయూలనే స్వభావం. కొన్ని సంఘటనలతో హర్షను కూడా కౌశిక్ సేవాభావం వైపు వుళ్లిస్తాడు. వైద్యులందరూ నిరుపేదలకు తవువంతు సాయుం అందించాలనే సందేశంతో రూపొందించిన ఈ లఘుచిత్రంలో సందర్భోచితమైన పాట కూడా ఆకట్టుకుంటుంది. పూర్వానుభవం లేకపోరుునా, కార్తీక్ కథలో బిగి సడలకుండా ఈ లఘుచిత్రాన్ని రూపొందించడం విశేషం.