అమెరికా నేపథ్యంలో..!
జీవితం గురించి అందమైన కలలు కంటుంది ఆ అమ్మాయి. పెద్దలు కుదిర్చిన అమెరికా అబ్బాయిని మనువాడుతుంది. ఎన్నో కలలతో భర్త చెయ్యి పట్టుకుని అమెరికా వెళుతుంది. అక్కడికెళ్లిన తర్వాత భర్తకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి మానసిక సంఘర్షణకు గురైంది? అనే కథాంశంతో ఆళ్ల రాంబాబు ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
స్ఫూర్తి సమర్పణలో తటవర్తి మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల రికార్డింగ్ మొదలైంది. మహేశ్ శ్రీరామ్, శిల్పాధావన్ జంటగా నటించనున్నారు. నిర్మాత కందుకూరి జగదీశ్వర్ మాట్లాడుతూ-‘‘ఎవరూ టచ్ చేయని కొత్త కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది. మంచి సైకలాజికల్ రొమాంటిక్ మూవీ. షూటింగ్ మొత్తం అమెరికాలోనే చేయనున్నాం.
హీరో, హీరోయిన్లు అమెరికాకు చెందినవారే. ఇంకా అమెరికాకు చెందిన పలువుర్ని ఈ చిత్రంలో నటింపజేయనున్నాం’’ అని చెప్పారు. అమెరికాలోని సుందరమైన లొకేషన్స్‌లో దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని తీస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: భోలే మహతి, స్క్రీన్‌ప్లే-మాటలు: ఘటికాచలం.