breaking news
Shabbir Shah
-
ఆ ఉగ్రవాదితో షబ్బీర్ టచ్‌లోనే ఉన్నాడు
న్యూఢిల్లీ: కశ్మీర్ వేర్పాటు వాది షబ్బీర్ షా పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో టచ్‌లోనే ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) చార్జీషీట్లో పేర్కొంది. ఉగ్రసంస్థకు ఆర్థిక సాయం అందించిన కేసుకు సంబంధించి 2005లో హఫీజ్ సయిద్‌పై ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణను పూర్తి చేసిన ఈడీ ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి సిద్ధార్థ నాథ్ శర్మకు చార్జిషీట్‌ను అందించింది. ఇప్పటికే ఈ కేసులో షబ్బీర్ షాతో పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మహమ్మద్ అస్లాం వనీ పేరును కూడా చార్జిషీట్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసులో నిందితులను ఈ నెల 27న కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. -
గృహనిర్బంధంలో వేర్పాటు నేతలు
ఢిల్లీలో అదుపులోకి.. న్యూఢిల్లీ: పాక్ జాతీయ భద్రతా సలహాదారు అజీజ్‌ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న కశ్మీరీ వేర్పాటువాద నేతలు బిలాల్ లోన్, షబ్బీర్ షా, షా అనుచరులు ఇద్దరిని శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని గృహనిర్బంధంలో ఉంచాయి. మరో రెండు రోజుల్లో భారత్-పాక్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల(ఎన్ఎస్ఏ) మధ్య చర్చలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. శ్రీనగర్ నుంచి వచ్చిన షబ్బీర్ షా విమానం దిగగానే ఢిల్లీ పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థల అధికారులు ఆయన వద్దకు వెళ్లి ఢిల్లీలో ఎక్కడ బసచేస్తున్నారో తెలుసుకుని ఆ గెస్ట్‌హౌస్‌కు తీసుకెళ్లి, బయటకు రావద్దంటూ గృహనిర్బంధంలో ఉంచారు. షాతోపాటు వచ్చిన మరో ఇద్దరు వేర్పాటువాద నేతలు మహమ్మద్ అబ్దుల్లా తరీ, జమీర్ అహ్మద్ షేక్‌లను కూడా హోటల్ నుంచి బయటకు రావద్దని పోలీసులు సూచించారు. బిలాల్ లోన్‌ను సైతం విమానాశ్రయంలో అరెస్టుచేసి దక్షిణ ఢిల్లీలోని అతని అద్దె గృహంలోనే పోలీసులు నిర్బంధించారు. కాగా, తమ బృందం తిరిగి శ్రీనగర్ వెళ్లాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని భత్రదా సిబ్బంది చెప్పారని షా అనుచరుడు జమీర్ మీడియాకు తెలిపారు.