breaking news
Saudi Arabian government
-
అర్జెంటీనాపై గెలుపుతో సౌదీలో సంబరాలు.. బుధవారం సెలవు ప్రకటన
రియాద్: ఖతర్ వేదికగా జరుగుతోన్న ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై చారిత్రక విజయం సాధించింది సౌదీ అరేబియా. పటిష్టమైన డిఫెన్స్‌కు తోకముడిచిన మెస్సీ బృందం 1-2 తేడాతో ఓటమి పాలైంది. అర్జెంటీనా జైత్రయాత్రకు సౌదీ బ్రేకులు వేసింది. దీంతో సౌదీలో సంబరాలు మిన్నంటాయి. ఈ క్రమంలో బుధవారం సెలవు ప్రకటించింది సౌదీ. ఈ చారిత్రక విజయంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు ఇచ్చింది. సౌదీ జాతీయ జట్టు ఘన విజయం సాధించిన క్రమంలో విక్టరీ హాలీడేను ప్రకటించాలని యువరాజు మొహమ్మెద్ బిన్ సల్మాన్ సూచించారు. ఆయన సూచనకు రాజు సల్మాన్ ఆమోదం తెలిపారు. అన్ని రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులకు బుధవారం సెలవు దినంగా ప్రకటించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది. ఇదీ చదవండి: FIFA WC 2022: ఒక్క ఓటమి.. అరుదైన రికార్డు మిస్ చేసుకున్న అర్జెంటీనా -
గడువుకు ముందే.. ఇంటికి!
ఎన్నో ఆశలతో సౌదీలో అడుగుపెట్టిన మన కార్మికులు వారి కలలు నెరవేరక ముందే అక్కడి బల్దియా అధికారుల తీరుతో ఇంటిదారి పడుతున్నారు. సౌదీ అరేబియాలోని బల్దియా (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ)ల్లో ఉద్యోగ అవకాశాలను దక్కించుకున్న భారతీయ కార్మికులను అక్కడి అధికారులు పనుల నుంచి అకారణంగా తొలగిస్తున్నారు. సౌదీలో పనిచేస్తున్న మన దేశ కార్మికులకు నెలకు కనీసం 1,500 రియాళ్ల వేతనం చెల్లించాలని మన కేంద్ర ప్రభుత్వం షరతు విధించింది. అయితే షరతు ప్రకారం అంత మొత్తంలో వేతనం చెల్లించలేమని బల్దియా అధికారులు చెప్పకుండా.. కార్మికులను పనుల నుంచి తొలగిస్తూ ఇంటిబాట పట్టిస్తున్నారు. కార్మికులకు వీసా, వర్క్ పర్మిట్‌కు గడువు ఉన్నా ముందుగానే స్వదేశానికి పంపిస్తున్నారు. బల్దియాల్లో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 150 మంది కార్మికులు వీసా, వర్క్ పర్మిట్ గడువు ముగిసిపోక ముందుగానే ఇళ్లకు చేరుకున్నారు. మరికొంతమంది కార్మికులను ఇంటికి పంపించడానికి సౌదీ బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారంఅందుతోంది. కార్మికుల సంక్షేమం కోసంవేతన ఒప్పందం గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా సౌదీ అరేబియాలో పనిచేస్తున్న మన దేశ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని విదేశాంగ శాఖ షరతు విధించింది. సౌదీలో ఏ కంపెనీలోనైనా, ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే కార్మికులకు నెలకు కనీసం 1,500 రియాళ్ల వేతనం మన కరెన్సీలో (రూ.25వేలు) చెల్లించాలని విదేశాంగ శాఖ షరతు విధించగా ఇందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. విదేశాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతన విధానం అమలు జరిగితే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని మన కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ ఒప్పందంలో భాగంగా గడిచిన జనవరి నుంచి ఈ విధానం అమలు కావాల్సి ఉంది. ముఖ్యంగా సౌదీ ప్రభుత్వరంగ సంస్థల్లోనే కనీస వేతన విధానం మొదట అమలు చేయాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వం విధించిన షరతు ప్రకారం వేతనం చెల్లిస్తే తమపై ఆర్థిక భారం పడుతుందని భావించిన బల్దియా అధికారులు మన కార్మికులను ముందస్తుగానే పనుల నుంచి తొలగిస్తున్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్కార్మికులకు అవకాశం! మన దేశానికి చెందిన కార్మికులకు నెలకు 1,500 రియాళ్ల వేతనం చెల్లించడం కంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలకు చెందిన కార్మికులకు తక్కువ వేతనం చెల్లించవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మన కార్మికులను పనుల నుంచి తొలగించి వారి స్థానంలో ఇతర దేశాల కార్మికులను నియమించుకుంటున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కార్మికులు 700 రియాళ్ల నుంచి 800 రియాళ్ల వేతనానికి పనిచేయడానికి ముందుకు వస్తుండటంతో మన కార్మికులకు నష్టం కలుగుతోంది. విదేశాంగ శాఖ స్పందిస్తేనే మన కార్మికులకు ప్రయోజనం మన కార్మికులకు కనీస వేతనం చెల్లించాలని షరతు విధించిన విదేశాంగ శాఖ ఇప్పుడు కార్మికుల తొలగింపుపై స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బల్దియాలో పని చేస్తున్న కార్మికుల వీసా, వర్క్ పర్మిట్‌కు గడువు ముగిసిపోకున్నా ఎగ్జిట్ వీసా ఇచ్చి ఇంటికి పంపిస్తున్న ఆంశంపై కొందరు కార్మికులు రియాద్‌లోని మన విదేశాంగ శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ, అక్కడ అధికారులు పట్టించుకోలేదని పలువురు కార్మికులు ఆరోపించారు. విదేశాంగ శాఖ అధికారులే పట్టించుకోక పోవడంతో నిరాశతో ఇంటికి చేరుకున్నామని పలువురు కార్మికులు తెలిపారు. మానసికంగా కృంగిపోతున్న కార్మికులు సౌదీ బల్దియాలో పని కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి వీసాలు పొందితే అక్కడి అధికారుల నిర్ణయంతో ఇంటిదారి పట్టడం వల్ల కార్మికులు ఎక్కువ మొత్తంలో నష్టపోతున్నారు. సౌదీ వెళ్లడానికి చేసిన అప్పులు తీరక ముందే ఇంటికి చేరుకోవడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదని కార్మికులు వాపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఇంటికి చేరుకున్న కార్మికులు మానసికంగా కృంగిపోతున్నారు. సౌదీ నుంచి ఇంటికి చేరుకున్న కార్మికులకు పునరావాసం కల్పించాలని పలువురు కోరుతున్నారు. తెలంగాణ వారే ఎక్కువ... సౌదీ అరేబియా బల్దియాల్లో పనిచేసే వారిలో తెలంగాణ జిల్లాలకు చెందిన కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. రోడ్ల పక్కన చెత్తా చెదారం ఎత్తిపోయడం, పార్కుల్లో మొక్కలకు నీరు పట్టడం తదితర పనులు చేస్తుంటారు. నిర్మాణ రంగంలో కంటే బల్దియాలో పనులు తేలికగా ఉంటుండటంతో కార్మికులు అందులో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక్కో కార్మికుడు దాదాపు రూ.1.50లక్షల వరకు ఏజెంట్లకు చెల్లించి వీసాలు పొందుతున్నారు. వీరికి గతంలో నెలకు మన కరెన్సీలో రూ.18వేల వరకు వేతనం చెల్లించేవారు. ఈ వేతనం సరిపోదనే ఉద్దేశంతో కనీస వేతన విధానం అమలు చేయాలని విదేశాంగ శాఖ సౌదీ అరేబియా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చింది. మొదట్లో అక్కడి ప్రభుత్వంఅంగీకరించినా ఇప్పుడు మాత్రం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. జూలై వరకు వీసా ఉంది నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం, తాళ్లరాంపూర్‌కు చెందిన గుండ సురేష్‌కు సౌదీ బల్దియాలో పనిచేయడానికి జూలై వరకు వీసా, వర్క్ పర్మిట్ ఉంది. మూడేళ్ల కింద బల్దియాలో చేరగా అతనికి జూలై తరువాత వీసాను రెన్యూవల్ చేయాల్సి ఉంది. కానీ, సురేష్‌కు ఎక్కువ వేతనం చెల్లించడం ఇష్టంలేక బల్దియా అధికారులు ఎగ్జిట్ వీసా ఇచ్చి జనవరిలోనే ఇంటికి పంపించారు. తాను ఇంకా పని చేస్తానని చెప్పినా బల్దియా అధికారులు పట్టించుకోలేదు. విదేశాంగ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనమూ లేక పోయింది. మరో ఏడాది వరకు అవకాశం ఉన్నా.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందికి చెందిన దర్శన్ రెండున్నర సంవత్సరాల కింద సౌదీ బల్దియాలో పని చేయడానికి వీసా పొందాడు. ఆరు నెలల కిందనే సెలవుపై ఇంటికి వచ్చి మళ్లి సౌదీకి వెళ్లాడు. ఇప్పుడిప్పుడే అప్పులు తీరుతున్నాయని ఎంతో కొంత సంపాదించి దాచుకోవచ్చని భావించిన దర్శన్‌కు బల్దియా అధికారులు తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరాశకు గురి చేసింది. మరో ఏడాది పాటు బల్దియాలో పనిచేయడానికి దర్శన్‌కు అవకాశం ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో పాలుపోవడం లేదని దర్శన్ చెబుతున్నాడు. ప్రభుత్వం మాకుఉపాధి చూపాలి సౌదీ బల్దియాలో పనిచేయడానికి నాకు మరో ఆరు నెలల అవకాశం ఉంది. కానీ, అక్కడి అధికారులు ఎగ్జిట్ వీసా ఇచ్చి ఇంటికి పంపించారు. నాతో పాటు ఎంతో మంది ఇంటికి చేరారు. ప్రభుత్వం స్పందించి మాకు ఉపాధి చూపాలి. మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.– రాంపల్లి జనార్దన్, తాళ్లరాంపూర్ -
హజ్ యాత్రికుల ఎంపిక పూర్తి
మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్ హైదరాబాద్: ఈ ఏడాది మన దేశం నుంచి హజ్ వెళ్లేందుకు లక్షా 72 వేలమందికి సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. శనివారం నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2017 హజ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 20,601 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో సాధారణ క్యాటగిరీలో 17,564, ఏ క్యాటగిరీలో 743, బీ క్యాటగిరీలో 2294 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం ఏ,బీ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకున్న 3,037 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికైయ్యారన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ..ఈ ఏడాది హజ్ యాత్రికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2017 హజ్ యాత్రకు ఎంపికైన వారు ఏప్రిల్ 5 లోపు మొదటి విడత రూ. 81 వేలు హజ్ రుసుమును కేంద్ర హజ్ కమిటీ పేరున డీడీ తీసి జమచేయాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీ లోపు ఎంపికైన యాత్రికులు తమ పాస్‌పోర్టును రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో అందించాలని కోరారు.