breaking news
salman rashdhi
-
‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’
వాషింగ్టన్: సామాజిక అంశాల పట్ల గళమెత్తే ఉదారవాదులను అణచివేసేందుకు ప్రయత్నించే కొన్ని వర్గాలకు అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఉన్న శక్తిమంతమైన వ్యక్తులు తోడయ్యారని పలువురు రచయితలు, విద్యావేత్తలు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శించారు. అలాంటి వారితో ప్రజాస్వామ్యానికి పెను ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించకూడదని.. అయితే ఏకాభిప్రాయం కుదరనంత మాత్రాన లిబరల్స్ మధ్య విభేదాలు తలెత్తడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జేకే రౌలింగ్, సల్మాన్ రష్దీ, మార్గరెట్ అట్వుడ్ వంటి దాదాపు 150 మంది రచయితలు సంతకం చేసిన లేఖను ప్రఖ్యాత ‘హార్పర్స్ మ్యాగజీన్’ మంగళవారం ప్రచురించింది.(మెలానియా విగ్రహం ధ్వంసం) ఆఫ్రో- అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురైన నేపథ్యంలో అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు, పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్లు సహా ఇతర సామాజిక అంశాలపై ధైర్యంగా పోరాడుతున్న వారిపై అణచివేత ధోరణి అధికమవుతున్న వేళ ఈ మేరకు పలువురు తమ అభిప్రాయాలను లేఖలో పంచుకున్నారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు వెల్లడిస్తున్న వారిపై పెరిగిపోతున్న అసహనం, సెన్సారియస్నెస్(పదే పదే విమర్శించడం) పై ఆందోళన వ్యక్తం చేశారు. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!) ‘‘అభివృద్ధి జరిగినపుడు ప్రశంసించే మేము.. అలా జరగని పక్షంలో గొంతెత్తేందుకు సిద్ధంగా ఉంటాం. ఉదారవాదులపై అక్కసు వెళ్లగక్కే కొన్ని శక్తులకు డొనాల్డ్ ట్రంప్ వంటి వ్యక్తులు తోడయ్యారు. ప్రస్తుత సమాజంలో స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరచడం సహా ఆలోచనలు పంచుకోవడం కష్టంగా మారింది. కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. రైట్‌వింగ్ రాడికల్ శక్తులు నైతిక హక్కులు కాలరాసేలా ప్రవర్తిస్తున్నాయి. వాటి కారణంగా మీడియా, కళారంగం వారు స్వేచ్చగా భావాలు వెల్లడించలేకపోతున్నారు. జీవనోపాధి కోల్పోతామనే భయం, కొన్ని ఒప్పందాల కారణంగా జర్నలిస్టులు భయపడాల్సి వస్తోంది. ఇక రచయితలు, ఆర్టిస్టులు ఇప్పటికే అనేక రకాలుగా మూల్యం చెల్లించి ఉన్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ లేఖపై కూడా సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన రావడం గమనార్హం. ముఖ్యంగా ట్రాన్స్జెండర్ల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన జేకే రౌలింగ్ కూడా ఈ లెటర్‌పై సంతకం చేయడం విశేషమంటూ పలువురు విమర్శిస్తున్నారు.(హిజ్రాలంటే నాకిష్టం: నటి) -
‘ప్రేమలో పడుతున్నాం.. నిబంధనలు ఉల్లంఘించాం’
లండన్ : ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ చరిత్రలో తొలిసారిగా ఇద్దరు రచయిత్రులకు అరుదైన గౌరవం దక్కింది. మహిళలకు సంబంధించిన అంశాలే ప్రధాన కథావస్తువుగా ఎంచుకున్న మార్గరెట్ ఎట్వుడ్, బెర్నార్డైన్ ఎవరిస్టో సంయుక్తంగా బుకర్ ప్రైజ్-2019ను సొంతం చేసుకున్నారు. 1984లో లింగసమానత్వంపై తాను రాసిన ‘ద హ్యాండ్‌మేడ్’ టేల్‌తో ప్రాచుర్యం పొందిన కెనడియన్ రచయిత్రి ఎట్వుడ్... తన తాజా నవల ‘ద టెస్టామెంట్’కు గానూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకోగా.... ‘గర్ల్, వుమన్, అదర్’ నవలతో బుకర్ ప్రైజ్ సాధించిన తొలి నల్లజాతి మహిళగా ఎవరిస్టో నిలిచారు. కాగా కాల్పనిక సాహిత్యానికి ఇచ్చే ఈ అత్యున్నత అవార్డు చరిత్ర(1969లో ప్రారంభమైంది)లో 1992 తర్వాత తొలిసారి ఇద్దరు విజేతలను ప్రకటించడం విశేషం. ఈ విషయం గురించి న్యాయ నిర్ణేతల మండలి చైర్మన్ పీటర్ ఫ్లోరెన్స్ మాట్లాడుతూ.. దాదాపు ఐదు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా.. ‘మేము తీసుకున్నది నిబంధనలను ఉల్లంఘించే నిర్ణయం. వారి గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే... అంత ఎక్కువగా వారితో ప్రేమలో పడిపోతున్నాం. కాబట్టి వారిద్దరూ గెలవాలని కోరుకున్నాం’ అని ఎట్వుడ్, ఎవరిస్టోను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక ఎవరిస్టోతో కలిసి సంయుక్తంగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం తనకు ఆనందంగా ఉందని 79ఏళ్ల ఎట్వుడ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ నేను తొందరగా ముసలిదాన్ని అయ్యానని అనిపిస్తోంది. కాబట్టి నాకు ఎవరి అటెన్షన్ అక్కర్లేదు. అయితే నీకు అవార్డు రావడం వల్ల అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంటుంది(తన కంటే వయసులో చిన్నవారనే ఉద్దేశంతో). నేను ఒక్కదాన్నే అవార్డు తీసుకుని ఉంటే కాస్త ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు నువ్వు నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ గిల్్డహాల్లో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఎవరిస్టోతో ఎట్వుడ్ సరాదాగా వ్యాఖ్యానించారు. కాగా ఆమె రాసిన ‘ద హ్యాండ్మేడ్స్ టేల్’ కూడా 1986లో బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయింది. మేము రాయకపోతే... బుకర్ ప్రైజ్ సొంతం చేసుకున్న సందర్భంగా ఎవరిస్టో(60) మాట్లాడుతూ.. ‘నల్లజాతి బ్రిటీష్ మహిళలమైన మా గురించి మేము రాయకపోతే ఇంకెవరూ సాహిత్యంలో మాకు చోటివ్వరు. లెజెండ్, దయా హృదయురాలైన మార్గరెట్ ఎట్వుడ్తో కలిసి ఈ అవార్డు పంచుకోవడం అసమానమైనది’ అని ఉద్వేగానికి గురయ్యారు. నల్లజాతికి చెందిన భిన్న మనస్తత్వాలు కలిగిన పన్నెండు మంది మహిళలు తమ కుటుంబం, స్నేహితులు, ప్రేమికుల గురించి పంచుకునే భావాలే.. ‘గర్ల్, వుమన్, అదర్’ నవల సమాహారం. కాగా భారత్‌కు చెందిన సల్మాన్ రష్దీ నవల ‘క్విచోటే’ కూడా బుకర్ ప్రైజ్‌కు షార్ట్‌లిస్ట్ అయిన ఆరు నవలల్లో ఒకటిగా నిలిచింది. సమకాలీన అమెరికాలోని క్రేజీనెస్‌ను రష్దీ తన నవలలో అద్భుతంగా వర్ణించారని జ్యూరీ పేర్కొంది. ఇక ముంబైలో జన్మించిన రష్దీ.. నవలలు ప్రతిష్టాత్మక అవార్డు తుదిజాబితాలో చోటు దక్కించుకోవడం ఇది ఐదోసారి. 1981లో ఆయన రాసిన ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ నవలకు బుకర్ ప్రైజ్ లభించిన విషయం తెలిసిందే. -
ఛాందసవాదుల తిరోగమనం!
ఎమర్జెన్సీని, 1984లో సిక్కులపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీసుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది. ‘దేశంలో మతపరమైన ఒంటెత్తు పోకడ విధానానికి సంస్కృతి గురించి ఏర్పరుచుకున్న కృత్రిమమైన వేర్పాటు ధోరణితో సంబంధముంది. ఈ సంకరమైన వంకర వైఖరికి సమాధానం యావత్తు భారతదేశం అందరి దీనన్న భావన దీప్తిమంతం కావడమే.’ భారతదేశంలో సాంస్కృతిక వేర్పాటువాదం, మతపరమైన ఒంటెత్తు పోకడల గురించి కలతపడిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చెప్పిన మాట.బీజేపీ, ఆరెస్సెస్, ఎన్డీఏ హయాంలో ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల జరుగుతున్న పరిణామాల పట్ల సంస్కృతీ పరమైన వైవిధ్యం, భిన్న దృక్పథాలు కలిగిన శక్తులు ఆందోళన చెందుతున్నాయి. భిన్న సంస్కృతు లతో, విశ్వాసాలతో, బడుగు బలహీన వర్గాలతో, జాతీయ మైనారిటీలతో, విభిన్న భాషలతో ఇంద్రధనుస్సులా విలసిల్లే ‘ఇండియా, దటీజ్ భారత్’లో ఇవాళ ఇంతగా ప్రజలు ఆందోళనకు గురికావలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు అర్థం చేసుకోవాలని రాష్ట్రపతి వరసగా ప్రకటనలు విజ్ఞా పనలు ఎందుకు చేయవలసి వచ్చింది? వెంటనే యోచించాలి ఈ అంశాన్ని కాలహరణం లేకుండా అందరూ గుర్తించాలి. దేశవ్యాప్తంగా పాలకపక్షాలు, లేదా రహస్యంగా పనిచేసే వాటి అనుబంధ సంస్థలు సమా జంలో కృత్రిమంగా అనేక రూపాలలో సృష్టిస్తున్న అలజడులనూ, సాగిస్తున్న హత్యాకాండనూ గమనిస్తున్న రచయితలు, కవులు, చరిత్రకారులు, సామా జిక శాస్త్రవేత్తలు, కళాకారులు, నటులు, చిత్రకారులు, ప్రొఫెసర్లు, ఆర్థిక వేత్తలు ఎన్నడూ లేని స్థాయిలో ఎందుకు తమ బిరుదులను త్యాగం చేయ వలసి వచ్చిందో కూడా పాలకులు గమనించాలి. 250 మందికి పైగా మేధా వులు దశలవారీగానే అయినా, పెద్ద ఎత్తున దేశ అత్యున్నత పురస్కారాలను, అకాడమీ పురస్కారాలను తిప్పి పంపడం స్వతంత్ర భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలోనే బాధాకరమైన పరిణామం. 1919లో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్య్ర సమర యోధుల మీద జనరల్ డయ్యర్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినందుకు రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహోన్నతులు తమకు ఉన్న బిరుదులను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ముఖాన కొట్టవలసి వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ-ఎన్డీఏ పాలకులు హరించి వేసే క్రమంలో ఈ బిరుదులను మేధావులు ప్రభుత్వానికి నిరసనగా వాపసు చేయడం ఇదే మొదటిసారి. ఇందుకు దోహదం చేసిన పూర్వరంగం ఎలాం టిది? ప్రగతివాదులు, ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన హేతువాదులైన రచయితలు, ప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు, సామాజిక దురన్యాయాల పట్ల ధ్వజమెత్తిన చైతన్య మూర్తులు దభోల్కర్, పన్సారే (మహారాష్ట్ర), కల్బుర్గీ (కర్ణాటక)లను 2014-15 మధ్యకాలంలో బీజేపీ పాలనలో ‘గుర్తు తెలియని’ వ్యక్తులు మట్టుపెట్టారు. ఈ దుర్ఘటనలకు ప్రధానమంత్రి సహా, పలువురు మంత్రులు చెప్పవలసిన రీతిలో ఆత్మీయంగా క్షమాపణలు తెలిపి, హంతకు లను శిక్షించకపోవడం ఒక వైపు జరుగుతూ ఉండగా, మరో వైపు రకరకాల వ్యంగ్యార్థాలతో భాష్యాలు చెప్పడమో, సీబీఐ విచారణ తతంగం పేరిట కేసులు ఒక కొలిక్కి రాకుండా కాలయాపన చేయడం జరుగుతోంది. లేదా కంటితుడుపుగా ఎవరో ఒకరిని ‘బుక్’ చేయడం జరుగుతోంది. ఎక్కడైనా ఇలాంటి చర్యలు గర్హనీయమే ఇలాంటి కిరాకత చర్యలకు పాకిస్తాన్లో మలాలా వంటి వారినీ, బంగ్లాదేశ్‌లో తస్లీమా నస్రీన్ వంటి భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారిని, సెక్యులర్ భావా లతో పుస్తకాలు ప్రచురించిన అరిఫీన్ దీవన్, అహ్మదూర్ రషీద్ టూతుల్ వంటి వారిని హతమార్చే ప్రయత్నం జరిగినా కూడా ఖండించవలసిందే. భావ ప్రకటనా స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని హరించడానికి పాలకులు ఎక్కడ కుట్ర పన్నినా నిరసించవలసిందే. దేశాభివృద్ధి ధ్యేయమన్న నినాదంతో ఊదరగొట్టి ఓట్లు దండుకున్న మోదీ బృందం అధికారం సాధించిన తరువాత తమ ఎజెండా రూపురేఖలను మార్చుకోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తు న్నారు. చివరికి వాణిజ్య, పరిశ్రమల వ్యవహారాల మీద ప్రధాని సలహా మండలి సభ్యుడు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సయితం ‘ఈ రోజున దేశంలోని మైనారిటీలలో భయాందోళనలు నెలకొన్నాయ’ని ప్రకటించవలసిరావడం గమనించాలి. ఈ విపరిణామం ఎంతవరకు పోయిందంటే, మూడీస్ , స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ గుత్త మదింపు సంస్థలు ఆరెస్సెస్, బీజేపీ పాలకులను తీవ్ర పదజాలంతో హెచ్చ రించవలసి వచ్చింది. ఇప్పుడు దేశంలో జాతీయ మైనారిటీలలో అభద్రతా భావం పెరిగిపోతోంది. భారతీయ జనతా పార్టీలోని వ్యక్తుల నుంచి, సభ్యుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను వింటున్నాం. ఈ పరిస్థితులలో తన పార్టీ సభ్యులను అదుపు చేయనైనా చేసుకోవాలి, లేదా అటు దేశంలోనూ ఇటు ప్రపంచ వ్యాపితంగానూ పరువు ప్రతిష్టలను కోల్పోవలసి వస్తుంద’ని ‘మూడీస్’ రేటింగ్ సంస్థ హెచ్చరించింది! ఈ హెచ్చరిక (అక్టోబర్ 30) రెండు రోజులకే బీజేపీ మాతృసంస్థలలో ఒకటైన ఆర్ఎస్ఎస్ ‘అఖిల భారతీయ కార్యకారిణి మండల్’ రాంచీ సమావేశంలో ప్రసిద్ధ కర్ణాటక రచయిత కల్బుర్గి హత్య పట్ల ఇన్ని రోజుల తరవాత సంతాపం ప్రకటించటం ఒక వింత! అంత కన్నా పెద్ద జోకు - తనకన్నా ‘ఛాందసవర్గం’ వేరే ఎవరో ఉన్నట్టుగా ఒకే తానులోని పీలికలుగా ‘స్టాండ్ బై’గా పెంచుతూ వచ్చిన చిల్లర మల్లర గ్రూపు లుగా ఉంటూ ‘హిందూత్వ’ పేరిట, ‘వైదిక సంస్కృతి’ పేరిట చెలామణి కావ డానికి ప్రయత్నిస్తున్న సంస్థల్ని ‘ఛాందస వర్గీయులు’గా పేర్కొనడం విశేషం. కొందరు వేదాల్ని గురించి, సంస్కృతం గురించి, పురాణ కాలపు సంస్కృతి గురించి తరచుగా ప్రస్తావనలు చేస్తున్నారు. నిజానికి భారతీయ భావనా స్రవంతిలో, సంస్కృతిలో భౌతికవాదం, హేతువాదం కూడా అంతర్భాగంగా కొనసాగాయని మూఢమతులు గుర్తించాలి. ‘హిందూ మెటీరియలిజం’ గ్రంథంలో సుప్రసిద్ధ తాత్వికులు, సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కెబీ కృష్ణ ఈ విషయాన్ని సహేతుకంగా నిరూపించారు: బుద్ధుడు వర్ణవ్యవస్థను ఖండిం చి, విగ్రహారాధనను నిరసించి, కులవ్యవస్థపై ఆధారపడే సమాజానికి విరు ద్ధంగా వృత్తులపై ఆధారపడే సమాజాన్ని పెంచిపోషించిన మహనీయుడని స్వామి వివేకానంద నివాళులర్పించాడు! బ్రాహ్మణ్యం నుంచి దూసుకు వచ్చిన మహాకవి అశ్వఘోషుడు కులవ్యవస్థపై ప్రత్యక్ష దాడికి దిగిన భౌతిక, హేతువాది. ఆ మాటకొస్తే రుగ్వేద కాలం నాటికే చైతన్యవంతమైన భారతీయ భౌతికవాదం వెలుగు చూసిందని అదే వేదంలోని ‘నాసదీయ సూక్తం’ (రుగ్వే దం: మండలం 10, సూక్తం 129) ఛాందస వర్గాలు సహా నేటి మనం కూడా మరవరాని జిజ్ఞాసను రేకెత్తించే ఒక మహాసత్యాన్ని రెండే రెండు ప్రశ్నలు సంధించడం ద్వారా ప్రకటించింది: 1. ‘భగవంతుడే ఈ సృష్టికి మూలమా?’ 2. ‘ఇదే నిజమైతే ఈ సృష్టి జరిగిన తర్వాత వచ్చిన ‘భగవంతుడి’కి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా?’ ఈ రెండు ప్రశ్నల ‘నాసదీయ సూక్తం’ చెప్పిన సమాధానం 2,500 సంవత్సరాల తర్వాత కూడా మందబుద్ధులకు సమాధానంగా మిగిలిపో యింది: ‘సృష్టి జరిగిన తరవాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి అతను సృష్టికర్త కాడు, కాజాలడు’ అని తెగేసి చెప్పింది ఆసూక్తం! అంటే సృష్టి రహ స్యం జీవరసాయన క్రియ, ప్రతిక్రియల్లో ఉందన్నమాట! భగవంతుడి గురిం చిన పేరుకుపోయిన ఊహలకు, అపోహలకు రామాయణంలోని జాబాలి వృత్తాంతం తెరదించేసింది! ఉపనిషత్తుల తర్వాతి కాలానికి చెందిన భౌతిక వాద, హేతువాద దార్శనికులు - అజితకేశ, కంబాలిక, పురాణ కాశ్యప, కాత్సాయన, మబాలి గోసాల, సంజయ బెలాతపుట్ట వంటి భౌతికవాదులు వేదకాలంలోనే ఉన్నారని మరచిపోరాదు! వీరంతా నాటి ఛాందసులు సాంఘిక పురోగతికి కల్పిస్తున్న అడ్డంకులను, ప్రతిఘటనా కుడ్యాలను అధిగ మించడానికి భౌతిక, హేతువాద వర్గాలు అనుసరించిన మధ్యే మార్గమే లౌకికవాదం. అందుకే నాటి భౌతిక, హేతువాదుల్ని, ప్రగతివాదుల్ని ‘నాస్తి కులు’ అన్న అపవాదును రుద్దడానికి పునాది అంతా అప్పుడే అక్కడ పడిం దన్నమాట! ఇప్పుడూ అదే తంతు - ‘సర్వజనులూ సుఖంగా ఉండాల’న్న ఆర్యోక్తికి అర్థం మారిపోయింది? పైగా ‘హిందువులు, ముస్లింలు పోట్లా డుకొనే కంటే, దారిద్య్రంపై పోరాటం చేయండని’ పాలకులు బోధిస్తూనే, దారిద్య్ర నిర్మూలన బాధ్యతను ప్రభుత్వం చేపట్టకుండా ఆ బాధ్యత పౌర సమాజానిదేనని చెప్పి తప్పించుకో జూడటం! ఎమర్జెన్సీని, 1984లో సిక్కు లపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీ సుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది! ఆశయాలు సంఘర్షిస్తున్న వేళ - అభ్యు దయ భారతం కోసం అభివృద్ధి భారతం కోసం ఈ వెంపర్లాట అనివార్యం! abkprasad2006@yahoo.com.in - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు