breaking news
rupees 5 lakhs
-
రైతుల పరిహారం రూ.5లక్షలకు పెంచుతూ జీవో
హైదరాబాద్ : తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షలకు పెంచుతూ రాష్ట్ర సర్కార్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ ప్రభుత్వం పెంచిన పరిహారం ఈ నెల 19 నుంచి వస్తుందంటూ అధికారికంగా జీవో జారీ చేశారు. పరిహారం రూ.5లక్షలు, రుణాలు తీర్చేందుకు మరో లక్ష రూపాయలు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయించింది. -
'డ్రైవర్ మరణిస్తే రూ.5 లక్షల సాయం'
విశాఖపట్నం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఘటనలో మృతిచెందిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబ పెద్ద వెంకులుకు ఇన్స్యూరెన్స్ చెక్ ను రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రమాదవశాత్తూ డ్రైవర్ మరణిస్తే బీమా కింద వారికి రూ. 5 లక్షల సాయం అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటినుంచి డ్రైవర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేలు చేపట్టాలన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ కాల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డ్రైవర్ సహజ మరణానికి గురైతే రూ. 30 వేలు, శాశ్వత వైకల్యానకి గురైతే రూ. 37,500 అందిస్తామన్నారు. డ్రైవర్ మరణిస్తే అతడి కుటుంబసభ్యుల్లో ఎవరైనా 9,10, ఇంటర్ విద్యార్థులు ఉంటే వారికి ఏడాదికి రూ. 1200 స్కాలర్షిప్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఇన్స్యూరెన్స్ చెల్లించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ రంగం వారు సాధారణంగా మరణిస్తే రూ. లక్ష ఇన్స్యూరెన్స్ ఇవ్వాలని ప్రణాళిక ఉందని, త్వరలోనే దీనిని అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.