breaking news
RTC officers negligence
-
పల్లెకురాని వెలుగు
కమాన్‌పూర్: గ్రామగ్రామానికి పల్లె వెలుగు... పత్రి గ్రామానికి ఆర్టీసీ సేవలు అందిస్తామని చెబుతున్న ఆర్టీసీ అధికారులు పల్లెవెలుగు సేవలను గ్రామ ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారు. కోట్ల రూపాయాలతో ప్రభుత్వం తారురోడ్లు వేసిన ఆ రూట్లలో ఆర్టీసీ బస్సులు నడవక పోవడంతో ప్రజలు, విద్యార్థులు, చిరువ్యాపారులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం ఆ గ్రామాల నుంచి విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని, ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, జిల్లా కేంద్రం పెద్దపల్లికి వివిధ పనుల నిమిత్తం వెళుతుంటారు. గతంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాం ఉన్న కొద్ది నెలల నుంచి బస్సు సర్వీస్‌ను నిలిపివేయడంతో ప్రజలు, విద్యార్థులు అధిక చార్జీలతో ప్రయివేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి నెలకొంది. గోదవరిఖని టూ పెద్దపల్లి గోదావరిఖని డిపో నుంచి పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యాం ఏర్పాటు చేశారు. గత నెల రోజుల నుంచి ఆ గ్రామాలకు పల్లెవెలుగు సేవలు నిలిచిపోవడంతో విద్యార్థులు, చిరువ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక చార్జీలతో ప్రవేటు వాహనాల్లో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ప్రజలు వాపోతున్నారు.. గతంలో గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు ప్రవేటు బస్సు సౌకర్యాం ఉండేది. రొంపికుంట మీదుగా పెద్దపల్లి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని పలు మార్లు డిపో మేనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. రూట్ సర్వే చేసిన ఆర్టీసీ ఆధికారులు గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎఫ్‌సీఐ, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా బస్సు నడిపించారు. నాగారం గ్రామంలో పోలీసులు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో నాగారం లింగాల మీదుగా ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరగా ప్రతి గోదావరిఖని నుంచి వచ్చే బస్సును ఎల్కలపల్లి, రేపల్లెవాడ నాగారం, లింగాల, రొంపికుంట, పేరపల్లి గ్రామాల మీదుగా ప్రతి ,రోజు ఉదయం, సాయంత్రం రోజుకు రెండు ట్రిప్పుల బస్సు సౌకర్యాం కల్పించారు. బస్సు సౌకర్యంతో విద్యార్థులు, చిరు వ్యాపారులకు సైతం ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకున్నారు. పలు కారణాలతో గత నెల రోజుల నుంచి ఆర్టీసీ బస్సును రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులకు, చిరువ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రవేటు వాహనాలే దిక్కు.. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు సౌకర్యం రద్దు కావడంతో విద్యార్థులు, ప్రజలు గోదావరిఖని, పెద్దపల్లి పట్టణాలకు వెళ్లాలంటే వారికి ప్రవేటు వాహనాల్లోను ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. భద్రత లేని ప్రవేటు వాహనాల్లో అధిక చార్జీలతో ప్రయాణం చేయాల్సి వస్తుందని ఆవేదన చెందున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని పునర్థిరించాలని విద్యార్థులు, ప్రజలు కోరతున్నారు.గోదావరిఖని నుంచి పెద్దపల్లి వరకు నడిచే బస్సు నెల రోజుల నుంచి బందు కావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బస్సు రాకపోవడంతో ప్రజలు కాలినడకన ప్రధాన రహదారి వరకు నడిచి వెళ్లీ అక్కడి నుంచి ఆటోల్లో ప్రయాణం చేస్తున్నారు. -
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం : మెకానిక్ మృతి
విజయవాడ : ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిధిలోని గ్యారేజ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న దుర్గారావు ఆదివారం బస్ నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ మెకానిక్ సత్యనారాయణను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్పర్ చేతికి బస్ ఎవరిచ్చారో తెలియదంటూ ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హెల్పర్‌కి నిబంధనలకు విరుద్ధంగా బస్‌ను ఇచ్చిన ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హెల్పర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు.