Roza
-
Mohammed Shami: ఇలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు!
టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి అతడి చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్దిఖీ(Badaruddin Siddiqui) అండగా నిలిచాడు. షమీ సరైన దారిలోనే వెళ్తున్నాడని.. అన్నింటి కంటే దేశమే ముఖ్యమని అతడికి తెలుసునని వ్యాఖ్యానించాడు. భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ షమీ ఏకాగ్రత దెబ్బతినేలా ఎవరూ మాట్లాడవద్దని విజ్ఞప్తి చేశాడు.కాగా ఆల్ ఇండియా ముస్లి జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి షమీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవిత్ర రంజాన్ మాసంలో ‘రోజా’(Roza) పాటించకుండా షమీ పెద్ద నేరం చేశాడని ఆయన ఆరోపించారు. అతడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాల్సిందని.. షరియత్ (చట్టం) దృష్టిలో అతడొక పెద్ద నేరగాడని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో అతడు దేవుడికి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అత్యంత ముఖ్య విధి.. అతడో నేరగాడు‘రోజా’లో ఉపవాసం పాటించడమే అత్యంత ముఖ్య విధి అని.. కానీ దానిని విస్మరించడం మహిళలకైనా, పురుషులకైనా మంచిదికాదని షహబుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా ప్రఖ్యాత క్రికెటర్ అయి ఉండి.. మ్యాచ్ మధ్యలో నీళ్లు లేదంటే వేరే ఏదో డ్రింక్ తాగడం సరికాదని విమర్శించారు.ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా ఖలీద్ రషీద్ ఫరాంగి మాహిల్ మాత్రం షమీకి అండగా నిలిచారు. రోజా పాటించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు రోజా పాటించాలని ఖురాన్లో ఉందని.. అయితే, ప్రయాణాలు చేస్తున్నపుడు కొంతమందికి ఇది సాధ్యం కాదు కాబట్టి మినహాయింపు ఉంటుందని తమ పవిత్ర గ్రంథంలోనే ఉందని తెలిపారు. షమీ తప్పు చేశాడంటూ వేలెత్తి చూపే హక్కు ఎవరికీ లేదని ఖలీద్ స్పష్టం చేశారు.షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదుఈ క్రమంలో షమీ టీమిండియా బౌలర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన చిన్ననాటి కోచ్ బదరుద్దీన్ సిద్ధిఖీ సైతం అతడికి మద్దతు పలికారు. ‘‘షమీ చేసినదాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి విషయాలను అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.దేశానికే మొదటి ప్రాధాన్యం బయట నుంచి వచ్చే విమర్శలను పక్కనపెట్టి.. షమీ ఫైనల్ మ్యాచ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది. అతడు ఎలాంటి నేరమూ చేయలేదు. దేశం కోసం అతడు ఆడుతున్నాడు. వ్యక్తిగత విషయాల కంటే దేశానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సరైంది. షమీ కూడా అదే చేస్తున్నాడు. దయచేసి ఎవరూ కూడా అతడి ఏకాగ్రత దెబ్బతినేలా మాట్లాడవద్దు’’ అని బదరుద్దీన్ విజ్ఞప్తి చేశారు.చాంపియన్స్ ట్రోఫీతో బిజీకాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ ప్రస్తుతం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025తో బిజీగా ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023లో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచి భారత్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్.. తదుపరి చీలమండ గాయం వల్ల ఏడాదికి పైగా జట్టుకు దూరమయ్యాడు.ఇటీవల ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన షమీ.. చాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తున్నాడు. గ్రూప్ దశతో తొలుత బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లతో చెలరేగిన షమీ.. ఆస్ట్రేలియాతో కీలక సెమీస్ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. పది ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 48 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ మెగా వన్డే టోర్నీలో ఫైనల్‌కు చేరిన టీమిండియా ఆదివారం దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టైటిల్ పోరులో తలపడనుంది. అయితే, ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో అతడిపై విమర్శలు వచ్చాయి.చదవండి: IND vs NZ: ఇది సరికాదు!.. టీమిండియాపై కివీస్ గెలవాలి: మిల్లర్ -
షమీ పెద్ద నేరం చేశాడు.. అతనో క్రిమినల్.. ముస్లిం మత పెద్ద సంచలన వ్యాఖ్యలు
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవిత్ర రంజాన్ మాసంలో షమీ పెద్ద నేరం చేశాడని ఆరోపించాడు. షమీ ఓ క్రిమినల్ అని సంభోదించాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా దూమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగుతూ కనిపించాడు. దీనిపై ముస్లిం మత పెద్ద రజ్వీ తీవ్రంగా స్పందించాడు. #WATCH | Bareilly, UP: President of All India Muslim Jamaat, Maulana Shahabuddin Razvi Bareilvi says, "...One of the compulsory duties is 'Roza' (fasting)...If any healthy man or woman doesn't observe 'Roza', they will be a big criminal...A famous cricket personality of India,… pic.twitter.com/RE9C93Izl2— ANI (@ANI) March 6, 2025పవిత్ర రంజాన్ మాసంలో షమీ రోజా (ఉపవాసం) పాటించకుండా పెద్ద నేరం చేశాడని అన్నాడు. రంజాన్ మాసంలో ఆరోగ్యకరమైన వ్యక్తి రోజా పాటించకపోతే నేరస్థుడవుతాడని తెలిపాడు. రంజాన్ మాసంలో ముస్లింలంతా రోజా పాటిస్తుంటే షమీ ఇలా చేయడమేంటని ప్రశ్నించాడు. రోజా పాటించకుండా షమీ ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపుతున్నాడని అన్నాడు. రోజా పాటించనందుకు షమీని క్రిమినల్‌తో పోల్చాడు. ఇలా చేసినందుకు షమీ దేవునికి సమాధానం చెప్పాలని ఓ వీడియో రిలీజ్ చేశాడు. షమీపై రజ్వీ చేసిన వ్యాఖ్యలపై క్రీడాభిమానులు మండిపడుతున్నారు. మతాన్ని క్రీడలతో ముడిపెట్టకూడదని అంటున్నారు. షమీ దేశం కోసం ఆడుతూ రోజా ఉండలేకపోయాడని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ముస్లిం సమాజంతో పాటు యావత్ దేశం షమీకి మద్దతుగా నిలుస్తుంది. షమీ ఈ విషయాన్ని పక్కన పెట్టి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై దృష్టి పెట్టాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో షమీ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో షమీ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం పాకిస్తాన్, న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లో షమీ వికెట్లు తీయలేకపోయాడు. సెమీస్‌లో ఆసీస్‌పై విజయం సాధించి భారత్ ఫైనల్‌కు చేరింది. మార్చి 9న జరిగే ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. 2000 ఎడిషన్ (ఛాంపియన్స్ ట్రోఫీ) తర్వాత భారత్, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడటం ఇదే మొదటిసారి. ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌తో తలపడిన రెండు సందర్భాల్లో న్యూజిలాండే విజేతగా నిలిచింది. 2000 ఎడిషన్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2019-2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్ భారత్‌పై జయకేతనం ఎగురవేసి ఐసీసీ టైటిళ్లు ఎగరేసుకుపోయింది. -
శుభాల సరోవరం
పరమ పవిత్రమైన రంజాన్ మాసం వచ్చేసింది. ముస్లింల ఐదు విధులు– విశ్వాసం, నమాజ్, జకాత్, రోజా, హజ్‌లలో రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధితో ఆచరిస్తారు. ఉపవాసాన్ని అరబీ భాషలో ‘సౌమ్’ అని, వ్యవహారిక ఉర్దూ భాషలో ‘రోజా’ అనీ పిలుస్తారు. ఇస్లామియా క్యాలెండర్లో 9వ నెల అయిన రంజాన్lమాసంలో ఈ ఆరాధన వ్రతాన్ని పాటిస్తారు. ఇస్లాంలో ‘రోజా’ అంటే ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించకుండా సేవించకుండా మనోవాంఛలకు దూరంగా ఉండడం. ఉపవాసాల గురించి దివ్యఖురాన్లో ఆదేశాలు ఇలా తెలపబడ్డాయి. ‘ముస్లిం సోదరులారా! ఉపవాసాలు మీకు విధిగా నిర్ణయించబడ్డాయి. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం కలుగుతుంది’. దివ్యఖురాన్లో... ఉపవాస ప్రాముఖ్యత ఉపవాసం ఇతర ఆరాధనల కంటే భిన్నమైంది. నమాజ్‌లో మనిషి కూర్చొనడం... నిల్చొనడం... రుకులు.. సజ్దాలు చేయడం లాంటివి చేస్తాడు. దీనిని ప్రతి వ్యక్తి చూడగలడు. ‘జకాత్’ (దానం)lవిషయం కనీసం దానిని తీసుకునే వ్యక్తికైనా తెలిసిపోతుంది. ‘హజ్’ విధిని లక్షల మంది ఎదుట నిర్వహిస్తాడు. కాని ఉపవాసమనేది దేవుడికి, దాసుడికి మధ్యనే ఉంటుంది. మూడోవ్యక్తికి తెలియదు. ‘ఉపవాసం కేవలం నా కోసం మాత్రమే పాటించబడుతుంది. నేను దానికి పూర్తి ప్రతిఫలం ప్రసాదిస్తాన’ని దేవుడు అంటాడు. ఉపవాసం కవచం వంటిది. ఎవరైతే ఉపవాసం పాటిస్తున్నారో, వారు అశ్లీలానికి, అలజడికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా వారితో దుర్భాషలకు గాని తగాదాలకు గాని దిగితే నేను ఉపవాసం పాటిస్తున్నానని చెప్పాలి. ఫలమాసం రంజాన్ మాసంలో సత్కార్యాల పుణ్యం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఒక విధిని నెరవేరిస్తే 70 విధులు నిర్వర్తించిన దానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. ఆ విధంగా రంజాన్ మాసంలో శుభాలను పొందే మహాభాగ్యాన్ని అల్లాహ్ కలగజేశాడు. ఈ రంజాన్ చూశాం... మరో రంజాన్ చూస్తామో లేదో తెలియదు... ఇలాంటి అవకాశం మళ్లీ లభిస్తుందా...? లేదా.. తెలియదు. కనుక ఈ మాసంలో మనం చేతులు చాచి శుభాలను నింపుకోవాలి. జీవితంలో సంస్కరణలు ఎక్కడ అవసరమో గ్రహించి అక్కడ సంస్కరించుకోవాలి. దైవం మనందరికి రంజాన్lశుభాలను సమృద్ధిగా పొందేlభాగ్యాన్ని ప్రసాదించాలి. – మహమ్మద్ మంజూర్ మినహాయింపులు... మనిషి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీSకొందరికి కొన్ని మినహాయిƇపులు ఇచ్చాడు. పిల్లలకు, బాటసారులకు, రోగులకు, వృద్ధులకు, మతి స్థిమితం లేనివారికి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు మినహాయింపు ఉంది. అలాంటి వారి ఉపవాసం వ్యర్థం! ⇔ ఒకపక్క ఉపవాసం పాటిస్తూ మరోపక్క అబద్ధం చెబుతూ మోసాలు చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఉపవాసాన్ని దేవుడు ఆమోదించడు. ⇔ ఉపవాసకుడు చాడీలు చెప్పకూడదు. ఎవరి మీదనైనా చాడీలు చెప్పినప్పుడు వారికి ఆ ఉపవాస ఫలితం దక్కదు. పరమార్థమిదే.... ⇔ దైవభీతి, నైతికత, మానవత్వ విలువలున్న ఉత్తమ సమాజ నిర్మాణమే ఉపవాస లక్ష్యం. ఇంతటి ప్రాధాన్యమున్న రోజా లక్ష్యాలు, ఉద్దేశాలను గురించి దివ్యఖురాన్ ముస్లింలను ఉద్దేశించి పలు బోధనలు చేస్తుంది. ⇔ దేశ రక్షణకు పోరాడే సైనికులకు శిక్షణ ఎంత అవసరమో ప్రపంచంలో మంచిని పెంపొందించేందుకు పాటుపడే వారికి కూడా శిక్షణ అంతే అవసరం. అలాంటి తర్ఫీదు నెల రోజుల పాటు రోజాల రూపంలో ఉంటుంది. దానికి కొనసాగింపుగా ఐదు పూటలా నమాజు, దానధర్మాలు, ఖురాన్ పారాయణం వంటి దైనందిన కార్యక్రమాలు ఆ స్ఫూర్తిని ఏడాది వరకు కొనసాగిస్తాయి. ⇔ తనను ఎవరూ చూడకపోయినా దైవం చూస్తున్నాడని విశ్వసిస్తూ ఆకలిదప్పులు దహిస్తున్నా గుక్కెడు నీళ్లయినా నోట్లో పోసుకోడు ఉపవాసి. ఈ విధంగా నాయకుడు, పర్యవేక్షకుడు ఉన్నా లేకపోయినా, తనకు తానుగా కట్టుబడి పనిని నిబద్ధతతో చేసే లక్షణం అలవడుతుంది. బాధ్యత, జవాబుదారీతనంతో తన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకుంటాడు. పరుల సొమ్ముకు ఆశపడడు. -
ప్రేమించి.. పెళ్లి చేసుకుని..
ఐదు నెలలకే అనంతలోకాలకు.. చెరువులో దూకి దంపతుల ఆత్మహత్య ప్రాణాలు తీసిన క్షణికావేశం అమృతాపూర్‌లో విషాదం డిచ్పల్లి : ప్రేమించి పెళ్లి చేసుకొన్న ఐదు నెలలకే వారికి నూరేళ్లు నిండారుు. క్షణికావేశం ఆ దంపతుల ప్రాణాలు తీసింది. చిన్న గొడవ కారణంగా ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ఈ విషాదకర సంఘటన డిచ్పల్లి మండలం అమృతాపూర్‌లో చోటు చేసుకుంది. సీఐ తిరుపతి, ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ మాజీ సర్పంచ్ దువ్వ ల పెద్ద గంగారాం, అబ్వవ్వ దంపతుల చిన్న కుమారుడు చిన్న గంగారాం(25) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన తేలు బాలయ్య, చిన్నుబారుు దంపతుల కూతురు రోజా(21) బీడీలు చుడుతుంది. చిన్నగంగారాం, రోజా సుమారు ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించరనే భయంతో గత జూన్‌లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. గంగారాం కుటుంబ సభ్యులు రానివ్వకపోవ డంతో కొద్ది రోజులు పక్క గ్రామమైన గొల్లపల్లిలో, మరి కొద్ది రోజులు నిజామాబాద్ నగరంలో ఉన్నారు. మూడు నెలల క్రితం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. రోజా తల్లిదండ్రుల సహకారంతో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరు రోజా తల్లి గారింటికి వెళ్లి భోజనం చేసి తిరిగి నివాసానికి వచ్చారు. రాత్రి పది గంటల సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో చిన్న గంగారాం రోజాపై చేరుు చేసుకున్నాడు. దీంతో రోజా చనిపోతానని ఏడ్చుకుంటూ సమీపంలోని చెరువు వద్దకు పరుగెత్తిందని, వెనకే వెళ్లిన చిన్న గంగారాం చెరువుకట్టపై ఆమెను అడ్డుకున్నాడని స్థానికులు తెలిపారు. చెరువు కట్టపై తిరిగి ఇద్దరు గొడవ పడ్డారు. క్షణికావేశంలో రోజా చెరువులో దూకింది. ఆమె వెనకే చిన్న గంగారాం సైతం చెరువులో దూకాడు. ఇద్దరు నీటి లో మునిగి ప్రాణాలు విడిచారు. సోమవారం ఉదయం రోజా తల్లి చిన్నుబారుు గుడిసె వద్దకు వెళ్లి చూడగా కూతురు, అల్లుడు కనిపించలేదు. ఇంతలో చెరువు వద్దకు వెళ్లిన గ్రామస్తులకు చెరువులో గంగారాం మృతదేహం కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న డిచ్పల్లి సీఐ, ఎస్సై గ్రామానికి చేరుకున్నారు. చెరువులో నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికి తీరుుంచారు. మృతదేహాలను చూసిన రెండు కుటుంబాల సభ్యులు బోరున విలపించారు. గంగారాం, రోజాలు ఒకరిని విడిచి ఒకరు ఉండే వారు కాదని, చివరకు చావును సైతం ఇద్దరు కలిసే పంచుకున్నారని గ్రామస్తులు కంటతడిపెట్టారు. గుడిసెను పరిశీలించిన పోలీసులకు మంచంపై పగిలిన గాజులు కనిపించారుు. దీంతో దంపతులిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందని సీఐ, ఎస్సైలు ప్రశ్నించినా రెండు కుటుంబాల వారు తమకు తెలియదని సమాధానం చెప్పారు. రోజా తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రోజాపై చర్యల విషయంలో అంత తొందరెందుకు
♦ ప్రివిలేజ్ కమిటీలో ప్రశ్నించిన జ్యోతుల ♦ రోజా అభిప్రాయం తెలుసుకోవాలని కమిటీ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై చర్య తీసుకునే అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయటాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు. శుక్రవారం ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ సమావేశం చైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగింది. శీతాకాల సమావేశాల్లో పరిణామాలపై ఏర్పాటు చేసిన మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదిక ఈ సమావేశం ముందుకు వచ్చింది. ఎజెండాలో చేర్చేందుకు అసెంబ్లీ అధికారులు ప్రయత్నించగా జ్యోతుల అభ్యంతరం వ్యక్తం చేశారు.హడావిడిగా రోజా అంశాన్ని చర్చించాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఈ నెల 8న మరోసారి సమావేశమై చర్చించాలని, రోజాను సమావేశానికి పిలిచి ఆమె అభిప్రాయాన్ని తెలుసుకోవాలని కమిటీ నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెలపై గతంలో రోజా చేసిన వ్యాఖ్యల మీద నోటీస్ ఇచ్చిన చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు శుక్రవారం తన వాదన వినిపించారు. -
నవంబర్ 1న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు రోజా (నటి), కీర్తి రెడ్డి (నటి) ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజసంఖ్య కాబట్టి జన్మతః నాయకత్వ లక్షణాలు, కార్యనిర్వహణా సామర్థ్యం కలిగి ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. విదేశాలలో మీకున్న ఉద్యోగ, వ్యాపార సంబంధాల ద్వారా మంచి ఆదాయం చేకూరుతుంది. అయితే సహజసిద్ధంగా ఉండే జంకును, భ యాన్ని విడిచిపెట్టి, ఆత్మవిశ్వాసాన్ని అలవరచుకోవడం వల్ల బాగా రాణిస్తారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది. వీరి పుట్టిన తేదీ 17. ఇది వృత్తికారకుడయిన శనికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తితోపాటు వ్యాపారాలు చేయాలనుకునే వారు వారి అభీష్టానుసారం కొత్తవ్యాపారాలు చే యడం లేదా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేయడం జరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన, కోపం మూలంగా బీపీ, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల అప్రమత్తంగా ఉండి వైద్యసలహాలు తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 3, 5,6,9; లక్కీ కలర్స్: రెడ్, ఆరంజ్, బ్లూ, ఎల్లో. లక్కీడేస్: ఆది, మంగళ, శనివారాలు. సూచనలు: ఆస్తులు అమ్మే ఆలోచన విరమించుకోవడం మంచిది. వికలాంగులకు అన్నదానం, మూగ, చెవిటి వారికి తగిన సాయం చేయడం, రక్తదానం చేయడం లేదా చేయడాన్ని ప్రోత్సహించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
ఫ్రమ్ ఇరాక్ విత్ లవ్ ....!
ఎక్కడో ఇరాక్ నుంచి బయలుదేరుతుంది. ఆ తరువాత ముంబాయి తీరానికి చేరుకుంటుంది. అక్కడ నుంచి గుజరాత్ వ్యాపారుల గోడౌన్లలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మన హైదరాబాద్ లోకి బేగం బజార్ లోకి, అక్కడినుంచి పాత బస్తీ వీధులు, సందుల్లోని మసీదుల్లోకి, దుకాణాల్లోకి, ఇళ్లలోకి వస్తాయి. రంజాన్ నెల వచ్చిందంటే చాలు దానికి భలే డిమాండ్! జహేదీ, అజ్వా, మేడ్ జోల్, కలిమీ, రుక్సానా ఇలా వేర్వేరు వెరైటీల రూపంలో అవి దొరుకుతాయి. అవి లేకపోతే రంజాన్ ఉపవాస దీక్ష (రోజా) ను సాయంత్రం నమాజుకు ముందు విడిచిపెట్టలేరు. ఇంతకీ అవేమిటని అనుకుంటున్నారు కదూ. అవే ... ఖర్జూరాలు. గుండె నిండా భక్తిపూర్వక నమాజు, నోటి నిండా గుప్పెడు తియ్యతియ్యని ఖర్జూరాలు.... రంజాన్ నెలంతా కనిపించే దృశ్యాలు ఇవే. ఇరాక్ లో ప్రస్తుతం భయంకరమైన అంతర్యుద్ధం నడుస్తున్నా మన దేశానికి ఖర్జూరం దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఖర్జూరాలను గత నవంబర్ లోనే సేకరించి, కోల్డ్ స్టోరేజ్ లో భద్రపరిచారు. అంతర్యుద్ధ ప్రారంభానికి ముందే ఖర్జూరాలు గుజరాత్ చేరుకున్నాయి. అందుకే ఈ సారి పెద్దగా ఖర్జూరాల ధరలు పెరగలేదు. అయితే ఖర్జూరం వ్యాపారులు మాత్రం ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ కేటగరీ నుంచి ఫ్రూట్స్ కేటగరీలో చేరిస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం వ్యాట్ పన్ను ఉంటుంది. పండ్ల పైన అంత పన్ను ఉండదు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ లలో ఖర్జూరాలను డ్రైఫ్రూట్స్ శ్రేణి నుంచి తొలగించారు. మన రాష్ట్రంలోనూ అలా చేస్తే బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు. -
నా రూటే సపరేటు
నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త అయిన ఆర్కే తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం ఎన్‌వళి తనీవళి (నా రూటు సపరేట్) మక్కల్ పాళరై తాకంపై ఈయన సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు షాజి కైలాష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఆర్కే ఐపీఎస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర వివరాలను ఆర్కే తెలుపుతూ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ఇతివృత్తంగా తెరకెక్కుతున్న మంచి కమర్షియల్ కథా చిత్రం అని చెప్పారు. ఎక్కడ అరాచకాలు జరుగుతాయో అక్కడికి ప్రభుత్వం ఈ పోలీస్ అధికారిని పంపి పరిస్థితులను చక్కదిద్దుకుంటుందన్నారు. అలాంటి ప్రభుత్వమే చివరికి ఆ పోలీస్ అధికారికి వ్యతిరేకంగా మారుతుందన్నారు. అందుకు కారణాలేమిటి? ఆ తరువాత ఏమయ్యిందనే పలు ఆసక్తికర సంఘటనల సమాహారమే ఎన్‌వళి తనీవళి చిత్రం అన్నారు. చిత్రంలో చాలా ట్విస్ట్‌లుంటాయని చెప్పారు. పేరుకు అందరూ పోలీసులే అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారని అలా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న పోలీసు అధికారి కథ ఈ చిత్రం అని తెలిపారు. ప్రేమ, యాక్షన్, హాస్యం అన్ని అంశాలు చిత్రంలో ఉంటాయన్నారు. అమ్మపాట హైలైట్ చిత్రంలో ఇద్దరు కథానాయికలుంటారని ఆ పాత్రలను పూనం కౌర్, మీనాక్షి దీక్షిత్‌లు పోషించారని తెలిపారు. వీరిలో ఒకరు తన మేనత్త కూతురు కాగా మరొకరు తనతో పని చేసే యువతి అని వివరించారు. చిత్రంలో ప్రధాన ప్రతినాయకిగా రోజా నటించడం విశేషంగా పేర్కొన్నారు. ఒక ప్రముఖ వ్యాపార వేత్తగా ఈమె పాత్ర వైవిధ్యంగా ఉంటుందన్నారు. హీరోకు అమ్మగా సీత నటించారని చెప్పారు. ఈమె చనిపోయినప్పడు వచ్చే అమ్మపాట, చిత్రం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుందన్నారు. అంత గొప్పగా ఆ గీతం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే వైరముత్తు రాసిన టైటిల్ సాంగ్ జనరంజకంగా ఉంటుందన్నారు. షూటింగ్‌ను పాండిచ్చేరి, చెన్నై, జోడాన్ తదితర ప్రాంతాల్లో నిర్వహించినట్లు తెలిపారు. వి.ప్రభాకర్ కథనం, మాటలు రాసిన ఈ చిత్రానికి శ్రీకాంత్ దేనా సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇళవరసు, రాధారవి, ఆశిష్ విద్యార్థి తలైవాసల్ విజయ్, విసు, టి.పి.గజేంద్రన్, రాజ్‌కపూర్, సంగిలి మురుగన్, సెంథిల్ నాధన్, పయిల్ వాన్ రంగనాథన్, కరాటే రాజా, బీసెంట్ నగర్ రవి, అన్బాలయా ప్రభాకర్, అరుల్ణి, యువరాణి అంటూ భారీ తారాగణం ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆర్.కె.వెల్లడించారు. -
ప్రజల రుణం తీర్చుకుంటా : రోజా
నిండ్ర, న్యూస్‌లైన్: తనను గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి రుణం తీర్చుకుంటానని నగరి నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఆర్కే.రోజా అన్నారు. వుండలంలోని కొప్పేడులో ఆదివారం ఆమె కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అండతోనే విజయం సాధిం చినట్లు చెప్పారు. నిండ్ర మండలంలో పార్టీ ముఖ్య నాయకుడు చక్రపాణిరెడ్డి చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేగా తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా పోరా టం చేస్తామన్నారు. చక్రపాణిరెడ్డి వుట్లాడుతూ ఎమ్మెల్యేగా రోజాను గెలిపించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలి పారు. గ్రామాల్లోని సమస్యలను ఆమె దృష్టికి తీసుకొచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. పార్టీ నాయుకులు ఆర్కే.సెల్వవుణి, వునోహర్‌నాయుడు, శ్యామ్‌లాల్, మురళినాయుుడు, నాగభూషణంరాజు, అనిల్‌కువూర్, మేరి, దీప, భాస్కర్‌రెడ్డి, సుందరరామిరెడ్డి, ఎంపీటీసీలు పరందావుయ్యు, చెంచవ్ము, పవిత్ర, నాదవుునస్వామి, గోపి, దశరథనాయుడు, దామోదరం, రావుచంద్రయ్యు, రేవతి, తదితరులు పాల్గొన్నారు. రోజాకు ఘన స్వాగతం కొప్పేడు గ్రామంలో ఆర్కే.రోజాకు ప్ర జలు ఘనస్వాగతం పలికారు. కర్పూర హారతులు పట్టారు. గ్రావుంలో నిర్వహించిన రోడ్‌షోకు అపూర్వ స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాబును ప్రజలు నమ్మరు : రోజా
నిండ్ర,న్యూస్‌లైన్: నమ్మక ద్రోహానికి, వెన్నుపోట్లకు చిరునామాగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్కే.రోజా అన్నారు. శనివారం ఆమె నిండ్ర మండలం అత్తూరు గ్రామంలో పర్యటించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి, సహకరించిన టీడీపీకి ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఆ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాయన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ప్రజలకు చుక్కులు చూపించారని ధ్వజ మెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు సామాన్యులకు ఏమీ చేయని ఆయన ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తూ మరోసారి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అంటే వైఎస్. రాజశేఖరరెడ్డిలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రపంచంలో ఎవరూ చేయని విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. రాజ న్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జగన్మోహన్రెడ్డి మాత్రమే వైఎస్సార్ పథకాలను అమలు చేయగలరన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓట్లేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు చక్రపాణిరెడ్డి, వునోహర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, మురళీ నాయుడు, నాగభూషణంరాజు, సుందరరామిరెడ్డి, అరుణ, మేరి, రేవతి, సెల్వం, రాజు గోపాల్, దావుురెడ్డి తదితరులు పాల్గొన్నారు.