మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం
మేడ్చల్: మేడ్చల్‌లోని ఓ ఫ్రిజ్‌ల తయారీ కంపెనీలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న రాక్వెల్ రిఫ్రిజిరేషన్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో లక్షల్లో ఆస్తి నష్టం సంభవించిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.