breaking news
Robin Hood Army
-
ఆహార వృథాను తగ్గిస్తూ.. ఆకలి తీరుస్తూ.. స్విగ్గీ కొత్త కార్యక్రమం
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ దేశవ్యాప్తంగా ఆహార వృథాను అరికడుతూ, పేదల ఆకలిని తీర్చేందుకు కొత్తగా ‘స్విగ్గీ సర్వ్స్(Swiggy Serves)’ పేరుతో సేవలు ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఆహార వృథాను కట్టడి చేసేందుకు మిగులు ఆహారాన్ని పేదలకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకోసం రాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనే స్వచ్ఛంద సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.స్విగ్గీ సర్వీసెస్ రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాముల విస్తృత నెట్వర్క్ నుంచి మిగులు ఆహారాన్ని గుర్తించి, దాన్ని సేకరించేందుకు రాబిన్ హుడ్ ఆర్మీ సహకారం తీసుకోనున్నట్లు స్విగ్గీ పేర్కొంది. తినదగిన ఆహారం వృథా కాకుండా ఆకలితో ఉన్న పేదలకు పంపిణీ చేస్తామని చెప్పింది. పైలట్ దశలో స్విగ్గీ సర్వీసెస్ 126కి పైగా రెస్టారెంట్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ప్రాథమికంగా 33 నగరాల్లో ఈ సర్వీస్‌ను ప్రారంభించినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.ప్రతిష్టాత్మక లక్ష్యాలుఈ కార్యక్రమం ద్వారా తినదగిన ఆహారం వృథా కాకుండా 2030 నాటికి 50 మిలియన్ల మందికి భోజనం అందించాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్లు స్విగ్గీ(Swiggy), ఆర్‌హెచ్‌ఏ తెలిపాయి. ఇది సామాజిక బాధ్యత పట్ల స్విగ్గీ నిబద్ధతను, స్థిరమైన, సమ్మిళిత పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి చేసే ప్రయత్నాలకు నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.టెక్నాలజీ అండస్విగ్గీ సర్వీసెస్ విజయానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారింది. మిగులు ఆహార సేకరణ, పునఃపంపిణీని సమన్వయం చేయడంలో స్విగ్గీ ప్లాట్‌ఫామ్ కీలక పాత్ర పోషించనుంది. ఆహార మిగులును అంచనా వేయడానికి, ఆహార పునఃపంపిణీ లాజిస్టిక్స్‌ను ఆప్టిమైజ్ చేయడానికి అధునాతన అల్గారిథమ్‌లను అమలు చేయాలని కంపెనీ యోచిస్తోంది. భోజనం అవసరమైన వారికి నాణ్యత ప్రమాణాలతో సమర్థవంతంగా చేరేలా చూస్తుంది.ఈ సందర్భంగా స్విగ్గీ ఫుడ్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ..‘స్విగ్గీ సర్వ్స్తో కొత్త ప్రయత్నం చేస్తున్నాం. ఇందుకు ఆర్‌హెచ్‌ఏ సహకారం కీలకం. ఆహారం వృథాను, ఆకలి సమస్యను ఏకకాలంలో పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. మా రెస్టారెంట్ భాగస్వాముల నుంచి అవసరమైన వారికి ఆహారాన్ని పునఃపంపిణీ చేయడానికి ఆర్హెచ్ఏతో భాగస్వామ్యం ఎంతో దోహదం చేస్తుంది. ప్రస్తుతం 33 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో మరిన్ని ప్రాంతాలకు ఈ సర్వీసును విస్తరిస్తాం’ అని అన్నారు. రాబిన్ హుడ్ ఆర్మీ సహ వ్యవస్థాపకుడు నీల్ ఘోస్ మాట్లాడుతూ..‘ఆకలిని తగ్గించే ఈ భాగస్వామ్య మిషన్ కోసం రాబిన్ హుడ్ ఆర్మీ స్విగ్గీతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఆకలి సమస్యను తీర్చేందుకు ఇతరులను ప్రేరేపించడం మంచి పరిణామం’ అన్నారు.స్విగ్గీ సర్వ్స్లో ఎలా చేరాలంటే..రెస్టారెంట్ భాగస్వాములు స్విగ్గీ ఓనర్ యాప్‌లోని ఫామ్‌ను పూరించడం ద్వారా ఈ స్విగ్గీ సర్వ్స్లో చేరవచ్చని కంపెనీ తెలిపింది. తర్వాతి సమన్వయం కోసం ఆర్‌హెచ్‌ఏ రెస్టారెంట్ భాగస్వాములతో వాట్సప్ సమూహాల ద్వారా కమ్యునికేట్ అవుతుందని తెలిపింది. ఆర్‌హెచ్‌ఏ వాలంటీర్లు ఈ భాగస్వాముల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి, అవసరమైన వారికి పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటారు.తలసరి 55 కిలోల ఆహారం వృథాఐక్యరాజ్యసమితి వివరాల ప్రకారం భారతదేశంలో దాదాపు 195 మిలియన్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచంలోని పోషకాహార లోపం ఉన్న జనాభాలో నాలుగోవంతు మంది మన దేశంలోనే ఉన్నారు. 2024లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (GHI)లో 127 దేశాల్లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. దేశంలో ఏటా తలసరి 55 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నారు.ఇదీ చదవండి: రేడియో వ్యాపారం మూసివేతరాబిన్ హుడ్ ఆర్మీరాబిన్ హుడ్ ఆర్మీ (RHA) అనేది వేలకొద్దీ యువకులు, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, గృహిణులు, కళాశాల విద్యార్థులు వాలంటీర్లుగా ఉన్న స్వచ్చంద సంస్థ. ఎలాంటి లాభాపేక్ష లేని ఈ సంస్థలో వాలంటీర్లను రాబిన్స్ అని పిలుస్తారు. ఈ వాలంటీర్లు రెస్టారెంట్లు/ పెళ్లిల్లు/ ఇవత కార్యక్రమాల నుంచి మిగులు ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి పంపిణీ చేస్తారు. పదేళ్లలో RHA ప్రపంచవ్యాప్తంగా 406 నగరాల్లో 153 మిలియన్ల మందికి పైగా భోజనాన్ని అందించింది. ప్రస్తుతం 13 దేశాల్లో 2,60,000+ మంది రాబిన్స్ ఉన్నారు. -
రాబిన్ హుడ్ సైన్యం ఆకలిపై యుద్ధం!
అది ఢిల్లీలోని ఓ మురికివాడ.. రాత్రి 9 గంటలు దాటింది. ఇంతలో అక్కడికి ఓ వ్యాను వచ్చి ఆగింది.. అప్పటిదాకా ఆ వ్యాను కోసం ఎదురుచూస్తున్న కళ్లల్లో ఒక్కసారిగా ఆనందం.. వ్యానులో నుంచి ఆకుపచ్చ రంగు చొక్కాల్లో ఉన్న కొందరు యువతీ, యువకులు దిగారు. వారి చేతుల్లో ఉన్న అన్నం పొట్లాలు పిల్లలందరికీ పంచారు. వారు తృప్తిగా భోజనం చేశాక అక్కడ నుంచి కదిలారు. వారే ‘రాబిన్‌హుడ్ ఆర్మీ’ (ఆర్‌హెచ్‌ఏ).. అంటే ధనవంతుల ఆస్తులను కొల్లగొట్టి పేదలకు పంచే సైన్యం అనుకుంటున్నారా? ఎంతమాత్రం కాదు.. పేదల కడుపు నింపేందుకు కంకణం కట్టుకున్న ఆదర్శసైన్యం. ఆకలితో పేగులు మాడుతుంటే.. మంచినీళ్లతో కడుపునింపుకొనే వారు మనదేశంలో కోకొల్లలు. తాము తినకున్నా.. తమ పిల్లలకు తినిపించి.. అర్ధాకలితో నిద్రపోయే తల్లిదండ్రులకు లెక్కేలేదు. వీరి సంగతి ఇలా ఉంటే.. రెస్టారెంట్లలో బిర్యానీలు, భోజనాలు, టిఫిన్లు ఆర్డర్ చేసి సగం తిని వదిలే వారి సంఖ్య కూడా మన దేశంలో తక్కువేం లేదు. ఈ రెంటి మధ్య వ్యత్యాసాన్ని పూడ్చగలిగితే ఆకలి సమస్యకు పరిష్కారం దొరికినట్లే! అందుకే, దేశంలో ఆకలిపై కొందరు యువకులు యుద్ధం ప్రకటించారు. మిగులు ఆహారపదార్థాలతో పేదల ఆకలి కడుపులు నింపేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. తొలుత ఆరుగురితో మొదలైన ఈ సైన్యంలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు ఉన్నారు. 18 నగరాలకు తమ సేవలను విస్తరించారు. 2.5లక్షల మందికి అన్నం పెడుతున్నారు. అందరినీ ఒప్పించి.. తన సంస్థ గురించి మిగిలిన మిత్రులకు వివరించారు రాబిన్ హుడ్. వీరిలో ఎక్కువమంది ఉద్యోగులే కావడం విశేషం. వారాంతాల్లో పనిచేయడానికి అందరూ అంగీకరించారు. తర్వాత నగరాల్లోని పలు రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలతో నీల్‌ఘోష్ బృందం మాట్లాడింది. వారు కూడా మిగిలిన ఆహారపదార్థాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. అలా వారి యజ్ఞం మొదలైంది. 2014లో ప్రారంభించిన కొత్తలో ఆర్‌హెచ్‌ఏ కేవలం 150 మందికి మాత్రమే ఆహారం పెట్టగలిగింది. ప్రస్తుతం 2.5లక్షల మంది ఆకలి తీర్చగలుగుతోంది. తొలుత కేవలం ఆరుగురు సభ్యులతో మొదలైన రాబిన్‌హుడ్ ఆర్మీలో ప్రస్తుతం 1000 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ఆలోచన ఎలా వచ్చింది? నీల్‌ఘోష్ పోర్చుగల్‌లో ఉన్నపుడు అక్కడి రెస్టారెంట్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ‘రీఫుడ్’ అనే స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు సేకరించడం, దాన్ని పేదలకు సరఫరా చేయడం గమనించారు. ‘రీఫుడ్’ సంస్థ వ్యవస్థాపకులు హంటర్ హల్దర్‌తో నీల్‌ఘోష్ ఈ విషయమై మాట్లాడారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. వృథా అవుతోన్న ఆహార పదార్థాలతో ఇంత మంది కడుపు నింపవచ్చన్న ఆలోచన నీల్ని మాతృదేశం ఇండియా గురించి ఆలోచించేలా చేసింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని భారత్‌లో తలపెడితే తిండిలేని లక్షలాదిమందికి కనీసం ఒకపూట అయినా కడుపునిండా భోజనం పెట్టగలమన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా తన మిత్రుడు ఆనంద్ సిన్హాతో కలిసి ఢిల్లీ కేంద్రంగా 2014, ఆగస్టు 26న రాబిన్‌హుడ్ ఆర్మీ (ఆర్‌హెచ్‌ఏ)ని స్థాపించారు. శత్రు దేశం ఆకలి కూడా తీరుస్తున్నారు.. ఢిల్లీతోపాటు 18 నగరాలకు తన సేవలను విస్తరించగలిగింది. ప్రతినగరంలోనూ పనిని బృందాలుగా విభజిస్తారు. ప్రతి బృందానికి ఒకరు టీం లీడర్‌గా వ్యవహరిస్తారు. కేవలం ఆహారం అందించడమే కాదు, ఇళ్లు లేని పేదలకు చలికాలం దుప్పట్లను సైతం పంపిణీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ సంస్థ చేస్తున్న సేవల గురించి విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి పాకిస్తాన్‌లోని కరాచీలోనూ రాబిన్‌హుడ్ ఆర్మీ తన సేవా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆకలికి, సేవకు భౌగోళిక సరిహద్దుల్లేవని నిరూపించారు.