breaking news
Rishang Keishing
-
తొలి లోక్‌సభ సభ్యుని వానప్రస్థం!
న్యూఢిల్లీ: ఆయనది ఏడు దశాబ్దాల రాజకీయ జీవితం. స్వాతంత్య్రానంతరం 1952లో కొలువుదీరిన తొట్టతొలి లోక్‌సభకు ఎంపికై, ఇప్పుడు కూడా పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్న అరుదైన రికార్డు ఆయన సొంతం. అంతేనా... నెహ్రూ మొదలుకుని, ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ... ఇలా ఆ కుటుంబంలోని అన్ని తరాల నేతలతోనూ కలిసి పని చేసిన ఘనత ఆయనది. ఆయనే రాజ్యసభ సభ్యుడు రిషాంగ్ కీషింగ్ (95). ప్రస్తుత పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో అత్యంత వృద్ధుడు కూడా అయిన కీషింగ్, రాజకీయాల నుంచి ఇక రిటైరవనున్నట్టు తాజాగా ప్రకటించారు. దేశ రాజకీయాల్లో చాలా ఉత్థాన పతనాలను చూశానని, ఇక తప్పుకోవాలని అనుకుంటున్నానని అన్నారు. రిటైరయ్యాక తోట పనికి సమయం కేటాయించాలనుకుంటున్నారట! ఆయన రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. సోషలిస్ట్ పార్టీ టికెట్‌పై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, నెహ్రూ ఆహ్వానం మేరకు 1962లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఆయన మణిపూర్ సీఎంగా కూడా పనిచేశారు. -
రాజకీయాల నుంచి తప్పుకుంటా
న్యూఢిల్లీ: రాజకీయాల నుంచి రిటైర్ కానున్నట్లు కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి రిషాంగ్ కీషింగ్ (95) ప్రకటించారు. రాజ్యసభలో ఆయన పదవీకాలం ఏప్రిల్ నాటితో ముగియనుంది. పార్లమెంటులో అత్యంత వద్ధుడైన కీషింగ్ మొదటి లోక్‌సభకు 1952లో ఎన్నికయ్యారు. ఏడు దశాబ్దాల ప్రజాజీవితం తర్వాత ఇక క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన భావిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమం నాటి నుంచి దేశ రాజకీయాల్లో చాలా ఉత్థాన పతనాలను చూశానని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నానని ఆయన చెప్పారు. తొలుత సోషలిస్ట్ పార్టీపై 1952లో లోక్‌సభకు ఎన్నికైన కీషింగ్, తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానంపై 1962లో కాంగ్రెస్‌లో చేరారు. అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలతో కలసి పనిచేసిన ఘనత కీషింగ్ సొంతం. మణిపూర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985లో మిలిటెంట్ల హత్యాయత్నం నుంచి కీషింగ్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఆ దాడిలో ఆయన అంగరక్షకులు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లోని నాగాల జనాభా ఎక్కువగా ఉఖ్రుల్ జిల్లాకు చెందిన కీషింగ్, తొలుత ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రిటైరయ్యాక తోటపని, వ్యవసాయానికి సమయం కేటాయించాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.