breaking news
redio tower
-
ఆత్మహత్య చేసుకుంటానంటూ రైతు బెదిరింపు
-
ఆత్మహత్య చేసుకుంటానంటూ రైతు బెదిరింపు
హైదరాబాద్ : అసెంబ్లీ సాక్షిగా మంగళవారం ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి పైనుంచి దూకుతానంటూ బెదిరింపులకు దిగాడు. తనకున్న రూ.2 లక్షల అప్పును ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డాడు. అతడిని వరంగల్ జిల్లా రైతు సమ్మయ్యగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతును కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయితే తనకు ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభిస్తేనే కిందకు దిగుతానంటూ రైతు స్పష్టం చేశాడు. టవర్‌పై గంట హైడ్రామా అనంతరం... రైతు తన వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగి పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు...అతన్ని కిందకి దించి ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.