breaking news
Raviteja brother arrest
-
బెయిల్‌పై విడుదలైన భరత్
హైదరాబాద్ : మద్యం మత్తులో పోలీసులపై దాడికి యత్నించిన హీరో రవితేజ సోదరుడు భరత్ బెయిల్‌పై విడుదలయ్యారు. రూ.5వేల పూచికత్తు, వ్యక్తిగత హామీతో కోర్టు అతడిని విడుదల చేసింది. గత రాత్రి మద్యం సేవించి మాదాపూర్‌లో కారును అడ్డంగా నిలిపి హంగామా సృష్టించిన భరత్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై దాడికి యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం మియాపూర్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చగా బెయిల్‌పై కోర్టు భరత్ విడుదలకు ఆదేశించింది. కాగా అంతకు ముందు భరత్ తరపు న్యాయవాది మాట్లాడుతూ పోలీసులపై భరత్ దాడి చేయలేదన్నారు. పోలీసులే అనవసరంగా ఈ కేసులో ఇరికించి కేసు నమోదు చేశారని ఆరోపించారు. రోడ్డుపై అడ్డంగా ఉన్న కానిస్టేబుల్‌ను భరత్ పక్కకు తప్పుకోమన్నాడని తెలిపారు. భరత్‌పై పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయవాది అన్నారు. -
హీరో రవితేజ సోదరుడు భరత్ అరెస్ట్
-
హీరో రవితేజ సోదరుడు భరత్ అరెస్ట్
హైదరాబాద్ : ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్‌ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజామున అతను మద్యం మత్తులో పోలీసులపై విరుచుపడ్డాడు. అరగంటపాటు రోడ్డుపై హంగామా సృష్టించటంతో భరత్‌ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గతంలో భరత్ మాదక ద్రవ్యాల కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణకు హాజరైన అతడు అప్పట్లో మీడియా పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.