breaking news
Raqa city
-
ఒకప్పుడు అది నరకం..ఇప్పుడు నందనవనం!
రాఖా: సిరియా రాజధాని రాఖాలోని అల్-నైమ్ స్క్వేర్(ట్రాఫిక్ సిగ్నల్) ఒకప్పుడూ బహిరంగంగా మరణశిక్షలు అమలు పరిచే భయంకరమైన వేదిక. కానీ ఇప్పడూ అది ప్రేమికులు, కుటుంబాలు, స్నేహితులు సమావేశమయ్యే అందమైన ప్రదేశం. అయితే ఈ ప్రాంతం ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ఆక్రమణతో 2014 నుంచి 2017 వరకు ఆ ప్రదేశం రక్తం చిమ్ముతూ భయనకంగా ఉండేది. (చదవండి: యాహూ! నేను పగలుగొట్టేశాను) అంతేకాదు ఆ ప్రాంతంలో జిహాదీలు స్క్వేర్‌లో తమ ఇస్లామిక్ షరియా చట్టాన్ని అమలు చేస్తున్నారని, మతభ్రష్టులు లేదా నేరస్థులుగా భావించే వారిపై ధ్వజమెత్తడం, శిలువ వేయడం, శిరచ్ఛేదం చేయడం వంటివి చేశారు. దీంతో అక్కడ స్థానికులు ఆ ప్రదేశాన్ని "రౌండబౌట్ ఆఫ్ హెల్" గా పిలిచేవారు. ఆ ప్రదేశంలోని స్థానికుడు హుస్సేన్ అనే వ్యక్తి తాను ఆ సమయంలో తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్లడానికి కూడా చాలా భయపడేవాణ్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఐఎస్ఐఎస్లు నగరాన్ని వదిలి వెళ్లిన తర్వాత మళ్లీ ఇప్పుడిప్పుడే పూర్వ కళావైభవాన్ని సంతరించుకుంది. అంతేకాదు ఇప్పుడిప్పుడే జిహాదీల చీకటియుగం నుంచి ప్రజలు బయటపడుతున్నారు. నిజానికి అల్-నైమ్ (స్వర్గం) అనేది ట్రాఫిక్ సర్కిల్‌తో చక్కగా రౌండ్ స్క్వేర్లా నిర్మించబడిన బహిరంగ ప్రదేశం. అక్కడ ఒకవైపు అందమైన పౌంటైన్లతో మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు మరోవైపు చక్కటి రెస్టారెంట్లతో సందడిగా ఉండే ఆహ్లాదకరమైన ప్రదేశం. కానీ ఇప్పటికీ సిరియావాసులకు ఆ ప్రదేశం వద్దకు రాగానే తాము అనుభవించిన నరకం, భయానక దృశ్యాలే కనిపిస్తాయి అనడంలో సందేహం లేదు. (చదవండి: సూప్ నచ్చకపోతే మరీ అలా చేస్తావా!) -
ప్రతీకారంతో రగిలిపోతున్న ఫ్రాన్స్
పారిస్/డమాస్కస్: రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడిని ఫ్రాన్స్ తీవ్రమైన అంశంగా తీసుకుంది. సిరియాలో తమ దాడులను మరింత ముమ్మరం చేసి వేగాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. రాత్రికి రాత్రి ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఫ్రెంచ్ యుద్దవిమానాలు మంగళవారం వేకువజామున తమ దాడులను ఉదృతం చేశాయి. సిరియాలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రమైన తూర్పు ప్రాంతంలో ఉన్న రఖా నగరంపై ఫ్రెంచి యుద్ద విమానాలు దాడులు చేసి ఓ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని, ఓ స్థావరాన్ని నేలమట్టం చేశాయి. ఈ విషయాన్ని ఫ్రెంచి ఆర్మీ విభాగానికి చెందిన ఓ అధికారి వెల్లడించారు. సోమవారం ఐఎస్ఐఎస్ స్థావరాలపై దాడులు నిర్వహించిన 24 గంటల్లోనే మరో బలగాన్ని సిరియాకు పంపి దేయిష్ అనే గ్రూపును ఫ్రాన్స్ ఆర్మీ కట్టుదిట్టం చేసింది. జిహాద్ అంటూ అల్లకల్లోలం సృష్టించే మరో గ్రూపు దేయిష్ అని ఫ్రెంచ్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. పారిస్ ఘటనకు ప్రతీకారం తీర్చుకునే యత్నంలో ఫ్రాన్స్ చాలా మేరకు సత్పలితాలు పొందినట్లుగా కనిపిస్తోంది. గత శుక్రవారం పారిస్‌లో సిరియా ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 129 మందికి పైగా మృతిచెందిన విషయం అందరికీ విదితమే.