breaking news
Rainbow Childrens Hospitals
-
రెయిన్బో చిల్డ్రన్స్ లాభం రూ. 63 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ (ఆర్‌సీఎంఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో సుమారు రూ. 63 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ2లో ఇది రూ. 61 కోట్లు. ఆదాయం రూ. 313 కోట్ల నుంచి రూ. 333 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కోవిడ్ అనంతరం అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, దానితో పోలిస్తే ప్రస్తుత క్యూ2లో కంపెనీ పటిష్టమైన పనితీరే కనపర్చిందని ఆర్‌సీఎంఎల్ సీఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్‌లో కొత్తగా ప్రారంభించిన శాఖ.. అంచనాలకు అనుగుణంగానే రాణిస్తోందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మిగతా అయిదు నెలల్లో మూడు కొత్త ఆస్పత్రులను నెలకొల్పడంతో పాటు ప్రస్తుత ఆస్పత్రిలో అదనంగా మరో బ్లాకును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంపెనీ చేతిలో నగదు, తత్సమాన నిల్వలు రూ. 472 కోట్ల మేర ఉన్నట్లు, ఆ నిధులను పెట్టుబడి ప్రణాళిక కోసం వెచి్చంచనున్నట్లు సంస్థ తెలిపింది. క్యూ2లో పెట్టుబడి వ్యయాల కింద రూ. 55 కోట్లు వెచి్చంచనున్నట్లు పేర్కొంది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ పడకల సంఖ్య 1,555 నుంచి 1,655కి పెరిగింది. -
రెయిన్బో ఐపీవో @ రూ. 517–542
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూకి సంబంధించి షేరు ధర శ్రేణిని రూ. 517–542గా నిర్ణయించినట్లు పిల్లల ఆస్పత్రుల చెయిన్ రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ వెల్లడించింది. ఐపీవో ద్వారా రూ. 1,581 కోట్లు సమీకరిస్తున్నట్లు సంస్థ సీఎండీ రమేష్ కంచర్ల శుక్రవారమిక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు పరిస్థితులను బట్టి ఇతర పొరుగు దేశాలకు కూడా కార్యకలాపాలు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐపీవో కింద కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా రూ. 280 కోట్లు సమీకరించనుండగా .. ప్రమోటర్లు, ఇతర ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో 2.4 కోట్ల వరకూ షేర్లను విక్రయించనున్నారు. ఇన్వెస్టర్లు కనీసం 27 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 1,500గా ఉన్న పడకల సంఖ్యను వచ్చే మూడేళ్లలో మరో 500 మేర పెంచుకోనున్నట్లు సీఎఫ్‌వో ఆర్ గౌరీశంకర్ పేర్కొన్నారు. రెయిన్బో ఐపీవో ఏప్రిల్ 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఇష్యూలో 35 శాతం భాగాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు అర్హత కలిగిన ఉద్యోగుల కోసం 3 లక్షల షేర్లు కంపెనీ కేటాయిస్తోంది. వారికి ఇష్యూ తుది ధరపై రూ. 20 డిస్కౌంటు లభిస్తుంది. -
ఐపీవో.. స్ట్రీట్‌పబ్లిక్ ఇష్యూలకు పోటాపోటీ
న్యూఢిల్లీ: ఏడాది కాలంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్న ప్రైమరీ మార్కెట్ ఇకపై మరింత కళకళలాడనుంది. తాజాగా పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రెండు కంపెనీలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐపీవోల కోసం సెప్టెంబర్‌లో ఈ కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ బాటలో ప్రస్తుతం మరో మూడు సంస్థలు నిధుల సమీకరణకు అనుమతించమంటూ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. ఐపీవో బాట పట్టిన సంస్థలలో హైదరాబాద్‌కు చెందిన రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ సైతం ఉంది. వివరాలు చూద్దాం.. గ్లోబల్ హెల్త్ రెడీ మేడాంటా బ్రాండ్ ఆసుపత్రుల నిర్వాహక కంపెనీ గ్లోబల్ హెల్త్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ ఓకే చెప్పింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. దీనికి జతగా మరో 4.84 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ప్రధానంగా పీఈ దిగ్గజం కార్లయిల్ గ్రూప్ 4.33 కోట్ల షేర్లను ఆఫర్ చేయనుంది. కంపెనీ సహవ్యవస్థాపకులు సునీల్ సచ్దేవ, సుమన్ సచ్దేవ 51 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. వీడా క్లినికల్‌కు సై క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వీడా.. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు సెబీ తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో రూ. 832 కోట్లవరకూ సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఐపీవోలో భాగంగా వీడా క్లినికల్ రీసెర్చ్ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని విక్రయానికి ఉంచనున్నారు. అంతేకాకుండా దాదాపు మరో రూ. 332 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రధానంగా బాండ్వే ఇన్వెస్ట్మెంట్ రూ. 260 కోట్లు, బసిల్ ప్రయివేట్ రూ. 142 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నాయి. తాజా ఈక్విటీ నిధులను రుణ చెల్లింపులు, విస్తరణకు వినియోగించనుంది. రెయిన్బో చిల్డ్రన్స్ పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా చిన్నపిల్లల మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల చైన్ రెయిన్బో సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా ఈ హైదరాబాద్ సంస్థ రూ. 2,000 కోట్లకుపైగా సమీకరించే ప్రణాళికలు వేసింది. ఐపీవోలో భాగంగా రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్ రూ. 280 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.4 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఆర్హతగల ఉద్యోగులకు సైతం షేర్లను ఆఫర్ చేయనుంది. తాజా ఈక్విటీ నిధులను ఎన్సీడీల చెల్లింపులకు, కొత్త ఆసుపత్రుల ఏర్పాటు, మెడికల్ పరికరాల కొనుగోలుకి వెచ్చించనుంది. 1999లో యూకే ఫైనాన్స్ కంపెనీ సీడీసీ గ్రూప్ హైదరాబాద్‌లో 50 పడకల పిడియాట్రిక్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నెలకొల్పింది. తదుపరి దేశవ్యాప్తంగా 14 ఆసుపత్రులకు విస్తరించింది. 1500 పడకల సదుపాయాలతో హెల్త్‌కేర్ సేవలు అందిస్తోంది. వీనస్ పైప్స్ ట్యూబ్స్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, ట్యూబుల తయారీ కంపెనీ వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఐపీవో చేపట్టేందుకు సెబీకి దరఖాస్తు చేసింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 50.74 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఈ నిధులను సామర్థ్య విస్తరణతోపాటు.. సొంత అవసరాలకు వినియోగించే హాలో పైపుల తయారీ ప్రాజెక్టుకు వినియోగించనుంది. కంపెనీ వీనస్ బ్రాండుతో ప్రొడక్టులను దేశ, విదేశాలలో విక్రయిస్తోంది. కెమికల్స్, ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్, పవర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, పేపర్ తదితర పలు రంగాలకు ప్రొడక్టులను అందిస్తోంది. క్యాపిల్లరీ టెక్నాలజీస్ క్లౌడ్ దన్నుతో సాఫ్ట్‌వేర్‌నే సొల్యూషన్(శాస్)గా సేవలందించే క్యాపిల్లరీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఏఐ ఆధారిత సేవలందించే ఈ కంపెనీ ఇందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 850 కోట్లు సమీకరించాలని ఆశిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 650 కోట్ల విలువైన షేర్లను క్యాపిల్లరీ టెక్నాలజీస్ ఇంటర్నేషనల్ విక్రయానికి ఉంచనుంది. వార్బర్గ్ పింకస్, సీక్వోయా క్యాపిటల్, క్వాల్కామ్ తదితరాలకు పెట్టుబడులున్నప్పటికీ వాటాలను ఆఫర్ చేయకపోవడం గమనార్హం! ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, ప్రొడక్ట్ డెవలప్మెంట్, టెక్నాలజీ అభివృద్ధి, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది. -
వ్యాధితోనే కాదు...ప్రకృతితోనూ పోరాటం
నేడు డాక్టర్స్ డే డాక్టర్ ప్రీతమ్ కుమార్ రెడ్డి, పీడియాట్రీషియన్ రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఓ చిన్నారిని రక్షించడానికి డాక్టర్‌గా నేను వ్యాధితోనే కాదు... కాసేపు ప్రకృతితోనూ పోరాడాల్సి వచ్చింది. అది 2006 వ సంవత్సరం. గుంటూరులోని పెద్ద పీడియాట్రీషియన్లలో ఒకరి నుంచి ఆ కాల్. ఏడాది వయసు చిన్నారి వెంటిలేటర్‌పై ఉన్నాడు. సివియర్ నిమోనియా విత్ ఏఆర్డీఎస్ అనే కండిషన్‌తో బాధపడుతున్నాడు. పిల్లాడిని తరలించడానికి ఏడు గంటల సమయం అవసరం. అంతసేపూ ప్రాణాలు కాపాడుతూ ఉండటం కష్టమే. కాల్ రాగానే రాత్రి 9 గంటలకు బయల్దేరిపోయాను. పొద్దున్నే 4 గంటలకు అక్కడికి చేరి పిల్లాడ్ని పరీక్షించాను. అతడికి అన్ని వసతులూ ఉన్న కేంద్రంలో చికిత్స అవసరం. మా డ్రైవర్‌నూ, మిగతా సిబ్బందినీ కాసేపు విశ్రాంతి తీసుకొమ్మని ఉదయం 9 గంటలకు గుంటూరు నుంచి ప్రయాణం ప్రారంభించాం. మధ్య దారిలో భోరున వర్షం. కనపడని రోడ్లు. ఎక్కడ గుంట ఉందో, మరెక్కడ రోడ్డు ఉందో, ఇంకెక్కడ వాగు ఉందో తెలియనంతగా మింటికీ మంటికీ ఏకధారగా వర్షం. పెద్ద హాస్పిటల్‌కు చేర్చి వెంటనే అతడిని ‘హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్’ పై ఉంచాం. అలా వరసగా ఏడురోజుల పాటు ఆ వెంటిలేటర్‌పై చికిత్స చేశాం. పన్నెండో రోజున అతడు ప్రమాదం నుంచి బయట పడ్డట్లుగా ప్రకటించాం. ఇప్పుడా పిల్లాడి వయసు తొమ్మిదేళ్లు. చక్కగా స్కూలుకెళ్తున్నాడు.