అటవీశాఖ సిబ్బందిని నిర్బంధించిన ఎర్రచందనం స్మగ్లర్లు
చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందిని అరిమానిపెంట సమీపంలో ఎర్రచందనం స్మగ్లర్లు చుట్టుముట్టారు. సుమారు రెండు వందల మంది స్మగ్లర్లు అటవీ శాఖ సిబ్బదిని నిర్బంధించినట్లు సమాచారం. అయితే వారి నిర్బంధం నుంచి కొంతమంది తప్పించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎంతమంది స్మగ్లర్ల నిర్బంధంలో ఉన్నారనే దానిపై సరైన సమాచారం లేదు.
స్మగ్లర్ల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న అటవీ సిబ్బంది ... ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. స్పెషల్ పార్టీ పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా సగ్లర్లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.