breaking news
Public Park
-
పబ్లిక్ పార్క్ బయట బోర్డుతో ఖంగుతిన్న ప్రజలు
వైరల్: పబ్లిక్ పార్క్‌లు ఉండేది ఎందుకు? ‘ఇదేం ప్రశ్న.. ప్రజల అవసరాల కోసం.. కాలక్షేపం చేసేందుకు’ అనేగా మీ సమాధానం. కానీ, కొన్ని పార్కుల నిర్వాహకులు మాత్రం ప్రాంగణంలో ఫలానా పనులు చేయకూడదంటూ నిషేధం విధిస్తుంటాయి. కానీ, ఇక్కడో పార్క్ చిత్రవిచిత్రంగా సైన్ బోర్డు ఉంచింది. అది చూసి ఖంగుతినడం ప్రజల వంతు అవుతోంది. ఈ పార్క్‌లో జాగింగ్ చేయకూడదు, రన్నింగ్ చేయకూడదు.. అంతెందుకు యాంటీ క్లాక్ వైజ్‌గా(రివర్స్‌లో) వాకింగ్ కూడా చేయకూడదు అంటూ బోర్డు ఉంచింది బీబీఎంపీ. బీబీఎంపీ అంటే బృహత్ బెంగళూరు మహానగర పాలికె. అంటే బెంగళూరులో ఈ పార్క్, సైన్ బోర్డు పెట్టారన్నమాట. ప్రముఖ కంటెంట్ సైట్ రెడ్డిట్‌లో ఓ యూజర్ దీనిని షేర్ చేశారు. ఇవాళే ఈ బోర్డును చూశా అంటూ ఓ యూజర్ దీనిని రెడ్డిట్‌లో వదిలాడు. ఈ బోర్డును ఏ ఏరియాలో ఏర్పాటు చేశారో తెలియదుగానీ.. ఇంటర్నెట్లో నవ్వులు పూయిస్తోంది ఈ బోర్డు. అలాంటప్పుడు ఆ పార్క్‌లో ఏం చేయాలని ఆ బోర్డు ఏర్పాటు చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు పలువురు. ఇంకొందరైతే వాకింగ్, జాగింగ్ కాకపోతే నాగిని డ్యాన్స్ చేయాలా? ఏంటి ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పాకాలని, ఇంకొందరు రివర్స్‌లో పాకితే సరిపోతుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి డౌటనుమానాలతో వాళ్లు నవ్వులు పంచుతున్నారు నెటిజన్స్. ఇదిలా ఉంటే.. బెంగళూరు నుంచి ఇలా సైన్ బోర్డు వైరల్ కావడం తొలిసారేం కాదు. గతంలో ఓ ఇంటి ముందు నో పార్కింగ్ బోర్డు కూడా ఇలాగే వైరల్ అయ్యింది. -
మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరురాలైంది!!
అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపుతడుతుందో చెప్పలేం! ఒక్కొసారి వారి జీవితం అనూహ్య మలుపు తిరగడం కూడా జరుగుతుంది. అలాంటి అనూహ్య సంఘటనే జరిగింది. ఎప్పటిలాగే మార్నింగ్ వాక్‌కి వెళ్లిన ఓ మహిళకు అదృష్టం 4 క్యారెట్ల డైమండ్ రూపంలో కలిసిసొచ్చింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నొరీన్ రిడ్ బెర్గ్ అనే మహిళ ప్రతిరోజూ మాదిరిగానే సమీపంలోని అర్కన్సాస్ స్టేట్ పార్క్‌కు మార్నింగ్ వాక్కు వెళ్లింది. సడెన్‌గా ఆమెకు పసుపు రంగులో ఉన్న 4.38 క్యారెట్ డైమండ్ దొరికింది. ఆ వజ్రం విలువ దాదాపు 2 వేల నుంచి 20,000 డాలర్లు (సుమారు రూ. 15 లక్షలు) ఉంటుందట. పసుపు రంగులో తళతళ మెరిసిపోతున్న డైమండ్ ఆమె జీవితాన్ని అనూహ్యమలుపు తిప్పింది. 1972 తర్వాత ఇటువంటి డైమండ్ మళ్లీ ఇన్నాళ్లకి దొరికిందని పార్క్ నిర్వాహకులు తెలిపారు. 1972 నుంచి ఇప్పటివరకు దాదాపుగా 75 వేల డైమాండ్లు దొరికాయట. ఈ యేడాది 258 వజ్రాలు అక్కడి ప్రజలకు దొరికాయని స్థానిక మీడియా తెల్పింది. ఈ పార్కును సందర్శించే వారికి రోజుకు కనీసం ఒకటి రెండైన వజ్రాలు దొరకుతాయట. చదవండి: డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..! కాగా ప్రపంచవ్యాప్తంగా అర్కన్సాస్ స్టేట్ పార్క్ డైమండ్లకు ఫేమస్. ఈ పార్క్ ఉన్న ప్రదేశంలో అగ్నిపర్వతం నుంచి పైకి ఉబికి వచ్చిన శిలాద్రవం అంతా విస్తరించి ఉంటుంది.అందువల్ల ఈ పబ్లిక్ పార్కులో తరచుగా విలువైన వజ్రాలు దొకుతాయట. ఇక్కడ ఎవరైనా డైమండ్ల కోసం వెతకొచ్చట. అంతేకాకుండా దొరికిన డైమండ్ వాళ్లదగ్గరే ఉంచుకోవచ్చు లేదా అమ్ముకొవచ్చు. ప్రపంచంలోనే వజ్రాలు దొరికే ఏకైక పబ్లిక్ పార్క్ ఇదేనట..!! చదవండి: టీవీ చూస్తూ.. హాయిగా నిద్రపోతే చాలు.. నెల జీతం రూ.25 లక్షలు!! -
పచ్చదనంలో దేశానికే ఆదర్శం
చౌటుప్పల్: పచ్చదనంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి రాష్ట్రాన్ని సాధించిన మాదిరిగానే సీఎం కేసీఆర్ హరిత ఉద్యమాన్ని సైతం విజయవంతం చేస్తారని ఆకాంక్షించారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లక్కారంలో రూ.3.45 కోట్ల వ్యయంతో నిర్మించిన తంగేడువనం పార్కును మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ (మియావాకీ) విధానంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మంత్రులు పార్కు అంతా కలియతిరిగారు. అలాగే ధర్మోజిగూడెంలోని లక్కారం –1 బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని, అర్బన్ పార్కులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో ఇప్పటికే 60 అర్బన్ పార్కులు ఉన్నాయని తెలిపారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. అడవులకు పునర్జీవం పోసేందు కు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌ను ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలకు విస్తరిస్తామన్నారు. హైదరాబాద్–విజయ వాడ 65వ నంబర్ జాతీయ రహదారి వెంట నాటిన విధంగానే గ్రామాలకు వెళ్లే రహదారుల వెంట సైతం మొక్కలు నాటాలని నిర్ణయించామన్నారు. అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్.శోభ, రాజ్యసభ సభ్యుడు లింగయ్యయాదవ్, శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, కలెక్టర్ అనితారామచంద్రన్, అటవీశాఖ సీసీఎఫ్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్కులో...
కథ సాయంకాలం అవుతూనే బూడిదరంగు దుస్తులు ధరించిన ఆ యువతి ఠంచనుగా ఆ పార్కులోని అంతగా సందడిలేని ఆ మూల బెంచీ మీద కూర్చుంది. రోజులాగే పుస్తకం చదవడం ప్రారంభించింది. కాని ఇంకో అరగంటలో చీకటి పడుతుంది. చదవడం కుదరదు. ఆ బూడిద రంగు దుస్తులు ఆమె శరీరానికి చక్కగా అమరి ఉన్నాయి. ఆమె తల మీద హేట్ ఉంది. దానినుండి రంధ్రాలతో ఉన్న ఒక జాలీ లాంటి పరదా (వెయిల్) ఆమె ముఖం మీదకు వేలాడుతూంది. ఆ పరదా వెనుక ప్రశాంతమైన అందమైన ముఖం ఉంది. ఆ పార్కులో ఆమె అదే సమయానికి, అదే చోటుకు అంతకు ముందు రోజు, అంతకంటే ముందు రోజు, ఇంకా అంతకంటే ముందు రోజు వచ్చింది. ఆ సంగతి ఒక ప్రాణికి తెలుసు. ఆ ప్రాణి ఒక యువకుడు. గత మూడు రోజులుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటూ, నమ్ముకుంటూ ఆ చుట్టుపక్కలే తిరుగుతున్నాడు. హమ్మయ్య! అతని తపస్సు ఫలించింది. చదువుతున్న పుస్తకంలోని పేజీ తిప్పబోతుంటే ఆ యువతి చేతిలో నుండి పుస్తకం జారి ఒక గజం దూరంలో పడింది. అంతే, ఆ యువకుడు ఒక్క ఉరుకులో ఆ పుస్తకాన్ని తీసి దాని యజమానికి అందిస్తుంటే అతని ముఖంలో, పోలీసును ప్రసన్నుడిని చేసుకోవడానికి పట్టుబడ్డ దొంగలో కనిపించే వినయం, మంచి పని చేసాను కరుణించు అనే అభ్యర్ధన కనిపించాయి. ఇలాంటి దృశ్యాలు పబ్లిక్పార్కుల్లో తరచూ కనిపిస్తూనే ఉంటాయి. ఆ యువతి అతనివైపు, శుభ్రంగా ఉన్నా చాలా సాదాసీదాగా ఉన్న అతని దుస్తులవైపు నిరాసక్తిగా ఒక చూపు విసిరింది. ‘‘కూర్చోవాలనుకుంటే నీవిక్కడ కూర్చోవచ్చు’’ ఆమె చాలా మామూలుగా అంది. అతను కాస్త తటపటాయించినట్టు కనిపించాడు. ‘‘నిజంగానే నిన్ను ఇక్కడ కూర్చోమంటున్నా. ఎలాగూ చీకటి పడుతోంది. చదువుసాగదు. కాస్సేపు మాట్లాడడమే నయమనిపిస్తోంది’’ మళ్ళీ ఆమే అంది. అదృష్టం వరించినట్టు ఆ అభాగ్యుడు బెంచీ మీద ఆమె ప్రక్కన చాలా జాగ్రత్తగా ఒదిగి కూర్చున్నాడు. సమావేశాల్లో నాయకుడు ఉపన్యాసం ప్రారంభించినట్టు ఆ యువకుడు ‘‘మీకు తెలుసా! మీరు చాలా అందంగా ఉన్నారు. ఇంత అద్భుతమైన అందాన్ని నేనీ మధ్యకాలంలో చూడలేదు. నిన్నటినుండే నేను మీ అందాన్ని చూస్తున్నాను. ఒక అభాగ్యుడు మీ అందమైన కళ్ళకు దాసోహమైపోయాడు తేనెకళ్ళసుందరీ’’ అన్నాడు. ‘‘నువ్వు ఎవరివైనా కావొచ్చు. నేను ఒక గౌరవ ప్రదమైన మహిళను అని గుర్తుంచుకో. నీ మాటలను నేను క్షమిస్తాను. ఎందుకంటే నీ స్థాయి వాళ్ళు అలా మాట్లాడ్డం సహజం. నిన్ను ఇక్కడ కూర్చోవడానికి నేను ఆహ్వానించాను, అంత మాత్రం చేత నీవు సుందరీ గిందరీ అని కూస్తే నేను నా ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటాన్నాను’’ ఆ యువతి చాలా ఘాటుగా హెచ్చరించింది. ‘‘నన్ను క్షమించమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను’’ ఆ యువకుడు బతిమాలుతున్నట్టన్నాడు. అంతకుముందు అతని ముఖంలోని సంతృప్తి స్థానంలో ఇప్పుడు అవమానం, పశ్చాత్తాపం చోటు చేసుకున్నాయి. ‘‘నాదే తప్పు, ఈ పార్కుల్లో రకరకాల స్త్రీలు... మీకు తెలుసనుకుంటాను...’’ అతను అర్థోక్తిలో ఆగిపోయాడు. అవుననుకో, కాని ప్రేమలో పడవచ్చునేమో అన్నట్టు గుర్తు. అయినా ఆ జర్మన్ రాజకుమారుడు, ఆ ఇంగ్లీషు ప్రభువు ఉన్నారు కదా! అయినా నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎంత సామాన్యుడైనా నాకభ్యంతరం ఉండదు. నిన్ను ఇక్కడ కూర్చోవడానికి నేను ఆహ్వానించాను, అంత మాత్రం చేత నీవు సుందరీ గిందరీ అని కూస్తే నేను నా ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటాన్నాను’’ ఆ యువతి చాలా ఘాటుగా హెచ్చరించింది. ‘‘ఇంక ఆ సంగతి వదిలెయ్. మన చుట్టూ ఉన్న మనుష్యుల గురించి చెప్పు. వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు. వాళ్ళందరూ ఎందుకంత తొందర్లో ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారంటావా?’’ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది.ఆ యువకుడు అంతకు ముందు ప్రదర్శించిన చిలిపితనాన్ని వదిలేసాడు. కానీ అతను ఇప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. ఆమె ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు చెప్పాలి. ఆమెను ప్రసన్నురాలని చేసుకోవడానికి ఆమె ముందు ఎటువంటి పాత్ర పోషించాలి. ఇదీ అతని అవస్థ. ‘‘అవునవును, మన చుట్టుపక్కల జనాల్ని గమనించడం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఇది జీవన్నాటకం. కొందరు రాత్రి భోజనానికి వెళుతుండొచ్చు. ఇంకొందరు ఇంకొన్ని చోట్లకు... వాళ్ళ జీవిత చరిత్రలేమిటో తెలుసుకోవాలనిపిస్తుంది కదూ!’’ ఆ యువకుడు, ఆమె ధోరణిలోనే ఆలోచిస్తున్నట్టు జవాబిచ్చాడు. ‘‘అలా నాకేమీ అనిపించడం లేదు. నాకంత ఉత్సుకతలేదు. నేనిక్కడికొచ్చి ఎందుకు కూర్చుంటానంటే, చుట్టుపక్కల ఈ మనుషులు, నా జీవితంలో ఇటువంటి మామూలు మనుషులు లేరు. నేను నీతో ఎందుకు మాటలు కలిపానో నీవు ఊహించగలవా మిస్టర్...’’ పార్కెన్ స్టేకర్, ఆ యువకుడు ఆమెకు తన పేరు చెప్పాడు. ఆమె తన పేరడగడంతో, ఆమె కూడా తన పేరు చెపుతుందనే ఆశతో, ఉద్విగ్నతతో అతను ఆమె వైపు చూశాడు. అతని ఆశను తెలుసుకున్నట్టు ఆమె తన సన్నని చూపుడువేలును ఆడిస్తూ చిన్నగానవ్వి ‘‘లేదు లేదు నా పేరు చెప్పగానే నేనెవరో నువ్వు గుర్తు పట్టేస్తావు. పత్రికల్లో ఫొటోలు, పబ్లిసిటీ ఇవ్వన్నీ నాకిష్టం లేదు. అందుకే నేను నా పనికత్తె హేట్‌ను, పరదాను ధరించి తిరుగుతుంటాను. నేను గమనించడం లేదనుకొని నా కారు డ్రైవర్ నా హేట్వైపు, పరదా వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు. నిజాయితీగా చెప్పాలంటే చాలా ప్రసిద్ధమైన కుటుంబాల్లో నాదీ ఒకటి. మన చేతుల్లో లేని జన్మ కారణంగా నేను పేరు ప్రతిష్టలున్న ఒక ప్రసిద్ధ కుటుంబంలో పుట్టవలసి వచ్చింది. నేను నీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే మిస్టర్ స్టీకెన్ పాట్...’’ పార్కెన్ స్టేకర్, ఆ యువకుడు సరిదిద్దాడు. ‘ఆ అదే మిస్టర్ పార్కెన్ స్టేకర్! నేను నీతో ఎందుకు మాటలు కలిపానంటే, ఐశ్వర్యం, హోదాతో చెడిపోని ఒక మామూలు సహజమైన మనిషితో మాట్లాడాలనిపించింది, అందుకు. డబ్బు, డబ్బు, డబ్బు దానితో నేనెంత విసిగిపోయానో నీకు తెలియదు. నా డబ్బు కోసం, నా కుటుంబ హోదా కోసం నా చుట్టూ తోలుబొమ్మల్లా తిరిగే ఒకే రకం మగాళ్ళతో విసిగిపోయాను. విందులు, వినోదాలు, నగలు, ప్రయాణాలు, విలాసాలు వాటితో నాకు మొహం మొత్తిపోయింది’’. ‘‘డబ్బు కలిగి ఉండడం చాలా గొప్ప విషయమని నేను అనుకుంటూ ఉంటాను’’ ఆ యువకుడు కొంచెం సంకోచిస్తూ, వినయంగా చెప్పాడు. ఏదో మనం సుఖంగా జీవించడానికి కొంత ఉంటే పర్వాలేదు. కాని మిలియన్ల కొద్దీ డబ్బు, దానితో వచ్చే విలాసాలు, విందులు, వినోదాలు, డాన్స్ పార్టీలు, కార్లలో విహారాలు, నిజంగానే పిచ్చెక్కుతుంది. ఒక్కోసారి షాంపేన్ గ్లాసులోని అయిసు ముక్కలు చేసే టింక్ టింక్ శబ్దం కూడ నాకు పిచ్చెక్కిస్తుంది’’. మిస్టర్ పార్కెన్ స్టేకర్ ఆశ్చర్యంగా వింటున్నాడు. ‘‘ఐశ్వర్యవంతుల గురించి చదవడం, తెలుసుకోవడం నాకిష్టం. నాకంతగా తెలియకపోవచ్చు గాని, నాకు తెలిసినంత వరకు షాంపేన్‌ను కూల్ చెయ్యడానికి సీసాలనే అయిసులో పెడతారని విన్నాను, కాని షాంపేన్ గ్లాసుల్లో అయిసు ముక్కలు వేస్తారని నేనెక్కడా చదవలేదు’’ ఆ యువకుడు వినమ్రంగా చెప్పాడు. ఆమె ‘వెర్రివాడా’ అన్నట్టు చాలా అందంగా నవ్వింది. ‘‘పనిపాటూ లేకుండా మాలాగ విలాసవంత జీవితం గడిపేవారు సరదా కోసం రొటీన్ జీవితంలోని పాత పద్ధతులను మార్చి ఏవో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టి ఆనందిస్తారు. ఇప్పుడు మా విందుల్లో షాంపేన్ గ్లాసుల్లో అయిసు ముక్కలు వేసుకోవడం పెద్ద విశేషంగా మారింది. ఈ మధ్యనే ఒక టార్టారీ దేశపు రాజకుమారుడు తాను ఇచ్చిన విందులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇంకొన్నాళ్ళకు ఇంకో కొత్త వికారం. ఈ మధ్యనే జరిగిన ఒక విందులో పచ్చ చేతి తొడుగులు వేసుకుని మాత్రమే అతిథులు ఆలివ్ పళ్ళు తినాలని ఒక క్రొత్త పద్ధతి ప్రవేశపెట్టారు’’. ‘‘అవునా! ఇలా మీ ప్రత్యేక విందుల్లో ప్రవేశపెట్టబడే ప్రత్యేక పద్ధతులు సామాన్య జనాలకి తెలిసే అవకాశం లేదులెండి’’ యువకుడు ఒప్పుకున్నాడు.తన అజ్ఞానం గురించి ఆ యువకుడి ఒప్పుకోలును అంగీకరిస్తున్నట్టు ఆమె ఒకసారి తల పంకించి మళ్ళీ మాట్లాడ్డం ప్రారంభించింది. ‘‘నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, పని చేసుకుని బ్రతికే ఒక సాదాసీదా వ్యక్తితో ప్రేమలో పడాలనిపిస్తుంది. కాని నా ఉన్నత కుటుంబ హోదా, సమాజంలో నా స్థాయి ముందు నా ఆలోచనలు, ఆశలు ఓడిపోక తప్పవని నాకు తెలుసు. ప్రస్తుతం రెండు పెళ్ళి ప్రస్తావనలు నా ముందున్నాయి. ఒకరు జర్మన్ రాజ కుటుంబానికి చెందినవాడు. అతని క్రూరత్వాన్ని భరించలేక అతని మొదటిభార్య పిచ్చిదయిపోయిందని చెప్పుకుంటారు. ఇంక రెండవ వ్యక్తి ఇంగ్లాండు ప్రభువర్గానికి చెందినవాడు. మహాసోదిగా ఉలుకూ పలుకూ లేకుండా ఉంటాడు. అవునా! నేనిదంతా నీకెందుకు చెపుతున్నాను మిస్టర్ పేకన్ స్టేకర్’’ ‘‘పార్కెన్ స్టేకర్’’ ఆ యువకుడు మళ్ళీ సరిదిద్దాడు. ‘‘మీ ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని నేను అభినందిస్తున్నాను’’ అన్నాడు. ఆ యువతి అతనివైపు కాస్సేపు పరిశీలనగా చూసింది. ఆ చూపులో తన స్థాయిని అతనికి గుర్తు చేస్తూ తన స్థాయి ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుంది. ‘‘నువ్వు బ్రతుకు తెరువు కోసం ఏం చేస్తుంటావు మిస్టర్ పార్కెన్ స్టేకర్’’ ఆమె అడిగింది. ‘‘చాలా సామాన్యమైన పని. కాని నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను. మీరు ఇంతకు ముందు ఒక మామూలు స్థాయి వ్యక్తితో ప్రేమలో పడాలనుకుంటున్నాను అన్నారు. నిజంగా అన్నారా?’’ ఆ యువకుడు ఆశగా అన్నాడు. ‘‘అవుననుకో, కాని ప్రేమలో పడవచ్చునేమో అన్నట్టు గుర్తు. అయినా ఆ జర్మన్ రాజకుమారుడు, ఆ ఇంగ్లీషు ప్రభువు ఉన్నారు కదా! అయినా నేను మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఎంత సామాన్యుడైనా నాకభ్యంతరం ఉండదు.’’ ‘‘నేను రెస్టారెంట్లో పని చేస్తాను’’ ఆ యువకుడు చెప్పాడు. ఈ మాట వింటూనే ఆ యువతి కొంచెం ముడుచుకు పోయినట్టు ఆమె శరీర కదలికల్లో కనిపించింది. వెయిటర్‌గా కాదు కదా! శ్రమ ఏదయినా గౌరవించదగ్గదే అనుకో, కాని మరీ బల్లల దగ్గరకెళ్ళి వెయిటర్‌లా... ఆమె అర్థోక్తిలో ఆగిపోయింది. ‘‘నేను వెయిటర్‌ను కాదు, కాషియర్ను, ఏ రెస్టారెంట్ అంటే...’’ ఆ పార్క్ పక్కనున్న రోడ్డు కవతల రెస్టారెంట్’’ అని ‘‘ఆ రెస్టారెంట్లో నేను కాషియర్ను’’ అంటూ ఆ యువకుడు అటువైపు చెయ్యిచూపుతూ అన్నాడు. ఆ యువతి తన ఎడమ చేతికున్న అందమైన గడియారం వైపు ఒకసారి చూసి లేచి నిలబడింది. ఆమె నడుముకు వేలాడుతున్న చిన్న పర్సులో పుస్తకాన్ని కుక్కింది. ఆ చిన్న పర్సులో ఆ పుస్తకం సరిగ్గా ఇమడలేదు. ‘‘అయితే ఈ రోజు నువ్వు పనికి ఎందుకు వెళ్ళలేదు’’ ఆమె అడిగింది. ‘‘ఈరోజు నాది రాత్రి షిఫ్టు. ఇంకా ఒక గంట టైముంది. నేను మిమ్ములను మళ్ళీ కలవగలనని ఆశించవచ్చా?’’ అతను అడిగాడు. ‘‘ఏమో నాకు తెలియదు. కలవొచ్చేమో. నాకు మళ్ళీ ఇలా ఎవరితోనైనా మాట్లాడే మూడ్ వస్తుందనుకోను. ఇప్పుడైతే నేను త్వరగా వెళ్ళిపోవాలి. ఒక విందుకు హాజరయి, తర్వాత ఒక నాటక ప్రదర్శనకు వెళ్ళాలి. మళ్ళీ విసుగు కలిగించే అవే కార్యక్రమాలు, వినోదాలు. నువ్వు పార్క్ లోపలికి వచ్చేటప్పుడు రోడ్డుకు ఒక వైపున ఒక తెల్లకారు నిలిచి ఉండడం గమనించే ఉంటావుగా!’’ ఆ యువతి అడిగింది. ‘‘ఆ ఎర్ర గేర్‌తో’’ ఆ యువకుడు తన కనుబొమలు ముడిచి గుర్తుతెచ్చుకుంటున్నట్టు అన్నాడు. ‘‘ఆ ఆకారే. నేనెప్పుడూ దాన్లోనే వస్తాను. పియరీ, అదే నా డ్రైవర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను పార్క్‌కు అవతల ఉన్న డిపార్ట్మెంట్ స్టోర్‌లో షాపింగ్ చేస్తున్నాననుకుంటున్నాడు. నాలాంటి జీవితాల్లోని బంధనాలు చూడు, డ్రైవర్లకు కూడా అబద్ధాలు చెప్పవలసివస్తుంది. సరే గుడ్‌నైట్!’’ ‘‘చీకటి పడుతోంది. ఈ పార్క్‌లో ఈ సమయంలో అన్నిరకాల అల్లరి చిల్లర మనుషులు తిరుగుతుంటారు. నేను మీకు తోడుగా...’’ ఆ యువకుడు అర్ధోక్తిలో ఆగిపోయాడు. ‘‘నీకు నా గౌరవ ప్రతిష్టల పట్ల ఎలాంటి శ్రద్ధ ఉన్నా నేను వెళ్ళిపోయిన పది నిమిషాల వరకు ఈ బెంచ్ మీద నుండి కదలకు. నిన్ను నిందించాలని కాదు. నీకు తెలుసుగా గొప్ప కుటుంబాల వారి కార్ల మీద ఆ కుటుంబ గుర్తుగా లోగోలు ముద్రించబడి ఉంటాయని. నేనా తెల్లకారులో ఎక్కుతుంటే నువ్వు పక్కన నిలబడడం, అదేమీ వద్దు. సరే ఇక గుడ్‌బై’’. ఆ సంజె వెలుగులో ఆమె హుందాగా చకచకా నడుచుకుంటూ వెళ్ళింది. ఆమె పార్క్ ద్వారం దగ్గరకు వెళ్ళి తెల్లకారు నిలిచివున్న వైపు వెళ్ళడం అతను చూశాడు. ఆమె వెనక్కు తిరిగి చూసినా కనిపించకుండా ఉండేలా ఆ యువకుడు యుక్తిగా పార్క్‌లో ఏపుగా పెరిగిన చెట్ల మధ్యలో నడుస్తూ ఆమె కదలికలను గమనించసాగాడు. ఆమె ఆ తెల్లకారు వద్దకు వెళ్ళి, దానివైపొకసారి చూసి, కారును దాటి ముందుకెళ్ళిపోయింది. రోడ్డు మీద ఆపి ఉన్న ఒక టాక్సీ వెనక దాక్కొని, ఆ యువకుడు ఆమెను గమనిస్తున్నాడు. ఆమె రోడ్డు దాటి రెస్టారెంట్ పక్క ద్వారం నుండి లోనికి ప్రవేశించింది. అది ముదురురంగు అలంకరణలతో, మిరుమిట్లు గొలిపే దీపాలతో, అన్నిరకాల ప్రజలకు చవుకగా ఆహారం అందించే మామూలు రెస్టారెంట్. కొంతసేపటికి ఆ యువతి తలమీద హేట్, ముఖం మీద పరదా లేకుండా రెస్టారెంట్ ముందు భాగంలో ప్రత్యక్షమయ్యింది. అక్కడున్న కాషియర్ సీటులో అంతవరకు కూర్చున్న వేరొక యువతి గోడ గడియారం వైపు చూస్తూ సీటులో నుండి లేచింది. బూడిద రంగు దుస్తులు ధరించిన ఈ యువతి ఆ ఖాళీ అయిన సీటులో కూర్చుంది. ఇదంతా చూసిన ఆ యువకుడు జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని నెమ్మదిగా పార్క్ గేటు వద్దకు నడిచాడు. అతని కాలికేదో తగిలింది. ఆ గడ్డిలో ఒక పుస్తకం పడి ఉంది. ఆ పుస్తకం మీది బొమ్మలను చూసి అతను వెంటనే గుర్తుపట్టాడు. అది ఆ యువతి చదువుతూ ఉండిన పుస్తకం. అతను వంగి ఆ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ పుస్తకం పేరు ‘న్యూ అరేబియన్ నైట్స్’. రచయిత ఎవరో స్టీవెన్సన్. ఆ యువకుడు ఆ పుస్తకాన్ని తిరిగి గడ్డిలోకి జారవిడిచాడు. సందిగ్ధంగా ఒక నిమిషం అటూ ఇటూ తిరిగాడు. తర్వాత అతను అక్కడ ఆగి ఉన్న తెల్లకారు వెనక తలుపు తెరిచి, లోపల మెత్తని దిళ్ళు అమర్చిన సీటు మీద కూర్చుని, ముందు సీటులో కూర్చున్న డ్రైవరునుద్దేశించి- ‘హెన్రీ! క్లబ్బుకు’ అన్నాడు. (మూలకథ పేరు: వైల్ ది ఆటో వెయిట్స్) -
పార్కులా ? ప్రేమ కలాపాలకు వేదికలా ?