దేశంలో భద్రత కరువు: ఒవైసీ
చాంద్రాయణగుట్ట: బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతుం దని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఉప్పుగూడ డివిజన్ ఎంఐఎం అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్ ఆధ్వర్యంలో పూల్‌బాగ్‌లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన జల్సా (బహిరంగ సభ)లో ఎంపీ అసదుద్దీన్ పాల్గొన్నారు. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ అవమాన భారం భరించలేక మృతి చెందాడన్నారు. యూనివర్సిటీనుంచి సస్పెండ్ చేసేలా వ్యవహరించిన బీజేపీ పెద్దలపై కేసులు నమోదు చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు శక్తికి మించిన మాటలు మాట్లాడుతున్నారని, నోట్లో దంతాలు లేని వారు మజ్లీస్ పార్టీపై పంజా విసురుతామనడం హాస్యాస్పద మన్నా రు.
అసదుద్దీన్ దేశంలోనే అన్ని రాష్ట్రా ల్లో తిరుగుతాడని....ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఉప్పుగూడ డివిజన్లో జరిగిన అభివృద్ధిని గుర్తించి తమ పార్టీ అభ్యర్థి ఫహద్ అబ్దుల్ సమద్‌ను గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా టీవీల్లో వస్తున్న ‘ఆజ్ కల్ క్యా చల్రా....క్యా చల్రా...’ అడ్వర్టైజ్ను గుర్తు చేస్తూ ‘ఆజ్ కల్ మజ్లీస్ చల్రా...’ అంటూ అందరిని నవ్విం చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సమద్ బిన్ అబ్దాద్, మజ్లీస్ నాయకులు మోతిలాల్ నాయక్, రహెమాన్ తదితరులు పాల్గొన్నారు.