breaking news
Prabhakaran
-
సంచలన ప్రకటన..! ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడు
-
రజనీకాంత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు
‘రజనీకాంత్ ‘తలైవర్’ (నాయకుడు) అయితే మరి వారంతా ఎవరు’ అని దర్శకుడు, నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధినేత సీమాన్ ప్రశ్నించారు. మహిళా పోలీసుల కథాంశంతో వి హౌస్ ప్రొడక్షన్స్ బ్యానరుపై సురేష్ కామాక్షి ‘మిగ మిగ అవసరం’ అనే సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీప్రియాంక పోలీసుగా అధికారిగా, హరీష్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలో సీమాన్ పోలీసు ఉన్నతాధికారిగా నటించారు. ఇషాన్ దేవ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. సీనియర్ దర్శకుడు భాగ్యరాజ్, దర్శకుడు చేరన్, సీమాన్, నిర్మాత జేకే రితీష్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి మాట్లాడుతూ ‘తానెప్పుడూ చర్చనీయాంశ వ్యాఖ్యలే చేస్తానంటారని, సమస్యల గురించి మాట్లాడడం చర్చనీయాంశం అంటే తాను అలానే మాట్లాతానని’ అన్నారు. ఈ చిత్రం గురించి, పని చేసిన వారి గురించి చిత్ర సక్సెస్ మీట్లో మాట్లాడతానని సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. అనంతరం సీమాన్ మాట్లాడుతూ ‘‘తలైవర్’ (అధినేత) అనే పదానికి అర్థం తెలియకుండానే ఇక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు. టీవీలో చర్చావేదికలను చూస్తే అందులో పాల్గొనేవారంతా రజనీకాంత్ గురించి మాట్లాడేటప్పుడు ‘తలైవర్’తో నటించాను, ‘తలైవర్’తో మాట్లాడాను, ‘తలైవర్’ను కలిశాను అంటున్నారు. రజనీకాంత్‌ను ‘తలైవర్’ అంటూ పొగుడుతున్నారు. ఆయన ‘తలైవర్’ అయితే.. కామరాజర్ ఎవరు.. ప్రభాకరన్ ఎవరు.. అంటే వాళ్లంతా దేశ ద్రోహులా..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పవర్ఫుల్ జర్నలిస్ట్!
ఎల్టీటీఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. పద్మజ ఫిలిమ్స్–న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ సంస్థలపై ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్లు నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ నేటితో పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఇందులో పవర్ఫుల్ జర్నలిస్ట్‌గా కీలక పాత్ర చేస్తున్న ‘అలియాస్ జానకి’ ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. నిర్మాతలు ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ మాట్లాడుతూ – ‘‘ఇందులో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన మనోజ్ ప్రభాకరన్ ఫస్ట్ లుక్కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలో మనోజ్ మరో పాత్రకు సంబంధించిన లుక్ విడుదల చేయాలనుకుంటున్నాం. 1990ల నాటి శ్రీలంక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ట్రైలర్, ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం’’ అన్నారు. మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కళ: పీఎస్ వర్మ, కెమేరా: వి. కోదండ రామరాజు, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కథనం: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ. -
‘జాఫ్నా రాణి’పై ఆశలు!
అడుగడుగునా మందుపాతరలతో, ఎటుచూసినా బంకర్లతో, ఎప్పుడు ఏవైపునుంచి తూటా దూసుకొస్తుందో తెలియని అయోమయ, భయోద్విగ్న వాతావరణంతో అట్టుడికిన శ్రీలంక ఉత్తర ప్రాంతానికి పాతికేళ్ల తర్వాత వచ్చిన ఎక్స్‌ప్రెస్ రైలు ‘జాఫ్నా రాణి’ కావలసినంత కోలాహలాన్ని తెచ్చింది. ఈ రైలుతో లంక తమిళులకు తానిచ్చిన హామీని నిలుపుకున్నానని దేశాధ్యక్షుడు మహిందా రాజపక్స సంబరపడుతూ ప్రకటించారు. అంతేకాదు... ఈ రైలు గాయపడిన హృదయాలకు సాంత్వన చేకూర్చి...ఉత్తర, దక్షిణ ప్రాంతాల ప్రజలను ఒక్కటిగా చేస్తుందన్న ఆశాభావం కూడా వ్యక్తంచేశారు. దేశ పునర్నిర్మాణంలో ‘జాఫ్నా రాణి’దే కీలకపాత్ర అన్నారు. ఏ రవాణా సాధనమైనా ప్రజలను ఒకచోటు నుంచి మరోచోటుకు చేర్చడమే కాదు... ఆ క్రమంలో భిన్న సంస్కృతులనూ, సంప్రదాయాలనూ, అలవాట్లనూ, విలువలనూ మోసుకొస్తుంది. ఒకరి గురించి మరొకరికి సదవగాహన కలిగిస్తుంది. కానీ పాలకుల్లో గూడుకట్టుకుని ఉండే ఆధిపత్య ధోరణులు, సంకుచిత విధానాలు ఇలాంటి మంచిని కూడా ఆవిరి చేస్తాయి. విద్వేషాలను మిగులుస్తాయి. లంకలో జరిగింది అదే. సింహళాన్ని అధికార భాషగా ప్రకటించి, తమిళుల కనీస హక్కులను కూడా కాలరాసి, భిన్న సందర్భాల్లో కుదిరిన ఒప్పందాలను బేఖాతరుచేసి వారిని రెచ్చగొట్టింది అక్కడి పాలకులే. ఏ సమస్యనైనా శాంతియుత పద్ధతుల్లో పరిష్కరించుకోవచ్చునన్న నాగరిక విలువకు నిలువునా పాతరేయడంవల్లనే ప్రభాకరన్ నేతృత్వంలో ఎల్టీటీఈ ఆవిర్భవించింది. అటు తర్వాత శ్రీలంక చరిత్రంతా రుధిరాధ్యాయమే! పట్టువిడుపులు తెలియని ప్రభాకరన్ మనస్తత్వం చివరకు ఆ సంస్థనే కాదు... వేలాది మంది తమిళ యువతీయువకులను అగ్నిగుండంలోకి తోసింది. 2008లో తమిళ టైగర్లను అణిచే పేరిట లంక సర్కారు ప్రారంభించిన ‘ఆఖరి పోరాటం’ అంతులేనంత విధ్వంసాన్ని, కనీవినీ ఎరుగని ప్రాణనష్టాన్ని మిగిల్చింది. తమిళ టైగర్ల సాయుధ పోరాటం ఉధృతమైన 1990 ప్రాంతంలో జాఫ్నా-కొలంబో రైల్వేట్రాక్‌ను పూర్తిగా ధ్వంసంచేశాక దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలమధ్య రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికే సింహళులకూ, తమిళులకూ ఉన్న అగాథం దీంతో మరింతగా పెరిగింది. 2009లో టైగర్లను పూర్తిగా తుడిచిపెట్టినప్పుడు రాజపక్స మన దేశానికీ, ప్రపంచానికీ విస్పష్టమైన హామీలిచ్చారు. ఉత్తర, తూర్పు ప్రాంతంనుంచి ‘సాధ్యమైనంత త్వరగా’ సైన్యాన్ని వెనక్కి రప్పిస్తామని, అక్కడ ప్రజాస్వామిక ప్రక్రియను ప్రారంభించి అభివృద్ధి పనులకు అంకురార్పణ చేస్తామని, ఆ ప్రాంతంలో మెజారిటీగా ఉన్న తమిళ జాతి ప్రజలకు స్వయంపాలనకు అవకాశమిస్తామని ఆ హామీల సారాంశం. అంతేకాదు...రాజీవ్‌గాంధీ హయాంలో కుదిరిన భారత్-శ్రీలంక ఒప్పందంలోని కీలకాంశమైన 13 వ రాజ్యాంగ సవరణను త్రికరణ శుద్ధిగా అమలుచేస్తామని కూడా రాజపక్స చెప్పారు. కానీ, అయిదేళ్లు గడిచాక వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? ఇందులో ‘అభివృద్ధి పనులు’ తప్ప ఏదీ అమలుకాలేదు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ, రహదారుల ఏర్పాటు, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటివి తప్ప ప్రభుత్వానికి రాజకీయ, సామాజిక సమస్యలే పట్టలేదు. యుద్ధకాండలో చెట్టుకొకరు, పుట్టకొకరై సర్వస్వం కోల్పోయిన తమిళుల పునరావాసానికి చేసిందేమీ లేదు. నిజానికి ఇలాంటి హామీలను విశ్వసించబట్టే టైగర్లపై రాజపక్స సర్కారు యుద్ధం ప్రకటించినప్పుడు మన ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. టైగర్ల సమస్య తీరితే అక్కడంతా చక్కబడుతుందని భావించింది. ఇప్పుడు రాజపక్స ప్రారంభించిన ‘జాఫ్నా రాణి’వల్ల ఉత్తర ప్రాంతం అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనడంలో సందేహంలేదు. అక్కడి సారవంతమైన భూముల్లో పండే పంటలను మంచి ధరకు అమ్ముకోవడానికి, ఆ ప్రాంతంలో లభ్యమయ్యే మత్స్య సంపదకు మళ్లీ గిరాకీ ఏర్పడటానికీ ఈ రైలు మార్గం ఉపయోగపడగలదని లంక తమిళులు ఆశాభావంతోనే ఉన్నారు. కానీ, ఇదొక్కటే అన్ని సమస్యలకూ పరిష్కారం కాబోదు. తమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు అవసరమో నిర్ణయించుకునే స్వేచ్ఛను తమిళులకు ఇవ్వాలి. అందుకోసం ఉత్తర ప్రాంత మండలి(ఎన్పీసీ)కి తగినన్ని అధికారాలివ్వాలి. అలా అధికారాలివ్వడానికి వీలుకల్పిస్తున్న 13వ రాజ్యాంగ సవరణ అమలుకు చర్యలు తీసుకోవాలి. ఉద్రిక్త వాతావరణం ఉపశమించింది గనుక ఆ ప్రాంతంలో ఉన్న సైన్యాన్ని కనిష్టస్థాయికి తగ్గించాలి. తమిళ భాషకూ, సంస్కృతికీ ప్రాధాన్యం కల్పించాలి. ఇవన్నీ చేస్తేనే దేశ పునర్నిర్మాణంలో తమిళులు పాలుపంచుకుంటారు. ఈ విషయంలో రాజపక్స ద్రోహం చేశారని భావించబట్టే ఎన్పీసీ శ్రీలంక క్రమేపీ చైనాకు చేరువవుతున్న సూచనలు కనిపించడంతో కొంతకాలంగా మన ప్రభుత్వం ఆ దేశాన్ని నొప్పించరాదన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి సమావేశాల్లో లంకను అభిశంసించే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల తీర్మానానికి నిరుడూ, అంతక్రితం సంవత్సరం అనుకూలంగా ఓటేసిన మన దేశం ఈ ఏడాది ఓటింగ్‌కు గైర్హాజరైంది ఇందుకే. ఇప్పుడు ‘జాఫ్నా రాణి’ని ఉత్తర ప్రాంతానికి తీసుకొచ్చిన రైల్వేట్రాక్ పనుల నిర్మాణం బాధ్యత భుజానవేసుకున్నదీ మన రైల్వే సంస్థ అనుబంధ విభాగమే. మన ప్రయోజనాల పరిరక్షణ కోసం శ్రీలంకతో సాన్నిహిత్యంగా ఉండటంలో తప్పేమీ లేదు. అదే సమయంలో అక్కడి తమిళుల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోమని లంకపై ఒత్తిడి తీసుకురావాలి. ఈ సమస్యను అపరిష్కృతంగా వదిలేస్తే అది ఎల్టీటీఈ వంటి మరో తీవ్రవాద సంస్థ ఆవిర్భావానికి దారితీస్తుందని, దాని దుష్ర్పభావం మనపై కూడా పడుతుందని కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.