breaking news
poverty ratio
-
అట్టడుగు వర్గాల ముందడుగు
సాక్షి, అమరావతి: ఏపీలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూత నిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యా దీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకు సింహ భాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రు లు నాటి మాయావతి నుంచి నేటి సిద్ధరామయ్య వరకు ఎవరూ చేయని రీతిలో ఆ వర్గాలకు సీఎం జగన్ సమున్నత గౌరవం ఇచ్చి సామాజిక సాధికారత సాధన దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయ సాధనలో దేశానికే టార్చ్బే రర్ (మార్గ దర్శకుడు)గా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. దేశానికే ఆదర్శం నాలుగేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా సీఎం జగన్ రూ.2.11 లక్షల కోట్లను నేరుగా లబ్దిదారుల ఖా తాల్లో (డీబీటీ) జమ చేశారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల ఖాతాల్లోకే రూ. 1,56,987.64 కోట్లు వేశారు. తద్వారా ఆ వర్గాల్లో పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ బాటలు వేశారు. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు ♦ నామినేటెడ్ పదవుల్లో 50% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు సీఎం జగన్ పదవులిచ్చారు. ఇలా చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ♦ 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ♦ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ ప దవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇ చ్చా రు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు (58 శాతం) ఆ వ ర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి.. 484 నామినేటెడ్ డైరెక్టర్ పద వులుంటే అందులో 201 పదవులు బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు (58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. ♦ బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే చైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులుంటే అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ చైర్మన్ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపు 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో సగభాగం 3,503 పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికే ఇచ్చారు. చేతల్లో సామాజిక న్యాయం ♦ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్.. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి, రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ♦ ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురి(80 శాతం)ని ఆ వర్గాల నుంచే నియమించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం ఇచ్చారు. ♦ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70%) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. మండలిలో వైఎస్సార్సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది (68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థల్లో.. ♦ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే.. వాటికి వ్యతిరేకంగా హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీ పరంగా 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులు ఇచ్చారు. ♦ 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులలో బీసీలకు 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 9 జడ్పీ చైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. ♦ రాష్ట్రంలో 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. సీఎం వైఎస్ జగన్ 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగాను 12 పదవులు (86 శాతం) ఇచ్చారు. -
పురుషుల కంటే స్త్రీలే అధికంగా..
ఐక్యరాజ్యసమితి: మహమ్మారి కోవిడ్ కారణంగా, 2021లో దక్షిణాసియాలో మహిళల పేదరికం మరింత పెరగనున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రానున్న దశాబ్దంలో 25 –34 ఏళ్ల వయస్సుల వారిలో పురుషుల కంటే అధికంగా స్త్రీలే పేదరికం బారిన పడతారని ఆ సంస్థ వెల్లడించింది. గత దశాబ్దాలలో మహిళలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి చేసిన కృషి, ఇప్పటి వరకు జరిగిన మహిళల అభివృద్ధి కోవిడ్ మహమ్మారి కారణంగా, తిరోగమనంవైపు మళ్లుతోందని తెలిపింది. ఫలితంగా 2021 నాటికి 4 కోట్ల 70 లక్షల మంది అదనంగా పేదరికం బారిన పడనున్నారని యుఎన్ వుమెన్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంస్థలు వెల్లడించాయి. (చదవండి: కరోనా వల్ల మహిళలకే ఎక్కువ రిస్క్: యూఎన్) కోవిడ్ కారణంగా దక్షిణాసియాలో స్త్రీ-పురుష అంతరాలు తీవ్రంగా పెరిగిపోయి, మహిళలు మరింత పేదరికంలోకి కూరుకుపోనున్నారని ‘‘ఫ్రం ఇన్సైట్స్ టు యాక్షన్.. జెండర్ ఈక్వాలిటీ ఇన్ ది వేక్ ఆఫ్ కోవిడ్–19’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టులో పేర్కొన్నాయి. కోవిడ్‌కి ముందు దక్షిణాసియాలో మహిళల పేదరికం రేటు 2021లో 10 శాతంగా అంచనావేయగా, ప్రస్తుతం అది 13 శాతంగా మారనుంది. 2021లో యావత్ ప్రపంచంలో, ప్రతి వంద మంది పేద పురుషులకు 118 మంది స్త్రీలు దారిద్య్రంలో ఉంటారని రిపోర్టు తెలిపింది. (చదవండి: ఆ ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం) ఈ అంతరం 2030 నాటికి ప్రతి వంద మంది పురుషులకు 121 మంది స్త్రీల నిష్పత్తికి చేరనున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ మహమ్మారి 2021 నాటికి 9.6 కోట్ల మందిని దుర్బర దారిద్య్రంలోకి నెడుతుండగా, అందులో 4.7 కోట్ల మంది స్త్రీలు, బాలికలే ఉంటారని ఈ రిపోర్టులో స్పష్టం అయ్యింది. మన సమాజం, ఆర్థిక వ్యవస్థల నిర్మాణంలో ఉన్న తప్పుడు విధానాల వల్ల ఈ అంతరాలు పెరుగుతున్నట్టు యుఎన్ వుమెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫుంజిలే లాంబో నెకూకా తెలిపారు. మధ్య, దక్షిణ ఆసియా, సహారా ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా 87 శాతం పేదరికం ఉండగా, ఇప్పుడు అదనంగా మధ్య ఆసియాలో 5.4 కోట్లు, దక్షిణాసియాలో 2.4 కోట్ల మంది ప్రజలు అంతర్జాతీయ దారిద్య్ర రేఖ దిగువకు పడిపోనున్నట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. -
చుక్కల్లో సంపన్నుడు.. పాతాళంలో పేదోడు.. ఇదే ఇండియా!
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, చైనా దేశాల తర్వాత భారత దేశం ప్రపంచంలో మూడో బలమైన ఆర్థిక వ్యవస్థగా బలపడుతోంది. గడచిన మూడున్నర దశాబ్దాల కాలంలో సరాసరి ఏడు శాతం ఆర్థిక వృద్ధిరేటును సాధించడమే అందుకు కారణం. దీన్ని మనకు ఆర్థిక నిపుణులు గొప్పగా చెబుతారు. మన నాయకులు కూడా తమ విజయంగా ఈ విషయాన్నే వల్లె వేస్తుంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. భారత్ మూడవ బలమైన ఆర్థిక శక్తిగా బలపడిందంటే కొనుగోలు శక్తిలో మాత్రమే. దీన్ని కూడా గర్వించతగ్గ పరిణామంగానే పరిణమించినా ప్రపంచంలోనే ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాల్లో రష్యా తర్వాత స్థానాన్ని భారతదేశం ఆక్రమించి ఉందన్న అపకీర్తిని ఎలా జీర్ణించుకోవాలి? క్రెడిట్ సూస్స్ రీసర్చ్ ఇనిస్టిట్యూట్ అంచనాల ప్రకారం భారత దేశంలోని 60 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. అదే రష్యాలోనైతే 74 శాతం ఆస్తి కేవలం ఒక్క శాతం ప్రజల వద్దనే పేరుకుపోయింది. ఇక 80 శాతం భారత్ ఆస్తి 10 శాతం ప్రజల వద్దనే పోగుబడిపోయింది. మన జాతీయ స్థూల ఉత్పత్తి తలసరి సరాసరి సగటు 1990 నుంచి ఇప్పటివరకు ఆరు రెట్లు పెరిగింది. అంటే, 1,130 డాలర్ల నుంచి 6, 576 డాలర్లకు పెరిగింది. దీంతో మౌలిక సౌకర్యాలతోపాటు పరిశుభ్రత, మహిళల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రసవ సమయంలో తల్లుల మృతి, అదే సమయంలో పిల్లల మృతి తగ్గుముఖం పట్టి ఆయు: ప్రమాణం పెరిగింది. దేశ జనాభా 130 కోట్లకు చేరుకుంది. మొత్తంగా జీవన ప్రమాణాల్లో భారత్, బంగ్లా, పాకిస్థాన్ లాంటి దేశాలను అధిగమించింది. అయితే ఈ అభివృద్ధి దేశంలోని ఉన్నత వర్గాలకే పరిమితం అయింది. హిందువుల్లోని అగ్రకులాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ వర్గాల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో పెరిగింది. ఈ వర్గాలకు చెందిన 28 శాతం ప్రజలు, అంటే 36 కోట్ల మంది కటిక దారిద్య్రంలో బతుకుతున్నారు. ప్రపంచ ధనిక దేశాల్లో ఒకటిగా భాసిల్లుతున్న భారత్‌లో సగటు భారతీయులు దారిద్య్రంలోనే జీవిస్తున్నారు. భారత ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం ఆర్థిక వృద్ధి రేటుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆ ఆర్థికాభివృద్ధిని ప్రజలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూసినప్పుడు మాత్రమే ఆ ఆర్థిక ఫలాలు పేదలకు కూడా చేరుతాయి. దాన్నే సామాజిక అభివృద్ధిగా నిపుణులు చెబుతారు. 2000 సంవత్సరం నుంచి 2016 వరకు భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందినా.. సంపన్నులే ఎక్కువగా లబ్ధి పొందారు. 2000 సంవత్సరంలో 1 శాతం ధనికుల వద్ద 36.8 శాతం ఆస్తులుండగా, నేటికి అవి 60 శాతానికి చేరుకున్నాయి. మొత్తం దేశం ఆస్తిలో 4.1 శాతం వాటానే పేదలు అనుభవిస్తున్నారంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. క్రెడిట్ సూస్స్, ఆక్స్‌ఫామ్ సంస్థల అంచనా ప్రకారం 1988 నుంచి 2011 మధ్య కాలంలో పేదవారిలో పది శాతం పేద వారి ఆదాయం సగటున రెండు వేల రూపాయలకు చేరుకోగా, పదిశాతం సంపన్నుల ఆదాయం సగటున 40వేల రూపాయలకు పెరిగింది. పేదవారి ఆదాయం ఏటా ఒకశాతం పెరగ్గా, సంపన్నుల ఆదాయం ఏటా 25 శాతం చొప్పున పెరుగుతూ వచ్చింది. క్రోని క్యాపిటలిజం, కార్పొరేషన్ సంస్థలు తమ ఎగ్జిక్యూటివ్‌లకు, వాటాదారులకు డివిడెండ్లు ఎక్కువగా ఇవ్వడం, ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తూ రావడం వల్ల ప్రజల మధ్య ఈ ఆదాయ అంతరాలు తీవ్రంగా పెరిగాయి. మధ్య తరగతి కూడా పెద్ద దెబ్బ ప్రజాస్వామ్య వ్యవస్థలు, సంస్కృతి సంరక్షణలో కీలక పాత్ర పోషించే మధ్య తరగతిపై కూడా ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ అంచనాల ప్రకారం 2011లో భారత్‌లోని మధ్య తరగతి ఆదాయం రోజుకు పది డాలర్ల నుంచి 20 డాలర్ల వరకు ఉంది. అంతకుముందు నుంచి వారి ఆదాయం పురోగతిని పరిశీలిస్తే ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, చైనా దేశాలకన్నా భారత్ వెనుకబడింది. -
జిల్లా ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేది?
Civils Prelims Paper - I భారత్‌లో ప్రాంతీయ ప్రణాళికా విధానం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో ప్రాంతీయ అసమానతలు ఎక్కువగా ఉన్నాయి. ప్రాంతీయ అసమానతలను కచ్చితంగా అంచనా వేయడం క్లిష్టతరమైన అంశం. వివిధ రాష్ట్రాల మధ్య అసమానతలను తలసరి ఆదాయం ఆధారంగా అంచనా వేస్తా రు. ఈ అంచనాలు రాష్ట్రాల మధ్య ఆదాయ స్థాయిల్లో తేడాలను వెల్లడిస్తున్నప్పటికీ వివిధ ప్రాంతాల మధ్య లేదా ఒకే రాష్ర్టంలోని అనేక ప్రాంతాల మధ్య ఆదాయపరమైన అసమానతలను స్పష్టపరచడం లేదు. అభివృద్ధికి తలసరి ఆదాయం లేదా రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తిని కచ్చితమైన సూచీగా పరిగణించలేం. పారిశ్రామికాభివృద్ధిలో తేడా, వ్యవసాయాభివృద్ధిలో వ్యత్యాసం, వివిధ రాష్ట్రాల మధ్య అక్షరాస్యతలో తేడా, మొత్తం శ్రామికుల్లో తయారీ రంగ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న శ్రామికుల శాతం, మొత్తం రోడ్ల విస్తీర్ణం, శిశు మరణాల రేటు లాంటి అంశాలను ప్రాంతీయాభివృద్ధిలో అసమానతలను కొలవడానికి సూచీలుగా పరిగణించాలి. ఆర్థికవేత్తలు వీటి సాయంతో వివిధ రాష్ట్రాల మధ్య Composite indices of developmentను రూపొందించడం ద్వారా ప్రాంతీయ అసమానతలను అంచనా వేయడానికి ప్రయత్నించారు. ఒకే రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలను కొలవడానికి కింద పేర్కొన్న సూచీలు దోహదపడతాయి. 1. తలసరి ఆదాయంలో వ్యత్యాసాలు 2. వృద్ధిరేట్లలో వ్యత్యాసాలు 3. పేదరిక నిష్పత్తిలో వ్యత్యాసాలు 4. భౌతిక జీవన నాణ్యతలో వ్యత్యాసాలు 5. పారిశ్రామికాభివృద్ధిలో వ్యత్యాసాలు 6. వ్యవసాయాభివృద్ధిలో వ్యత్యాసాలు 7. మొత్తం జనాభాలో పట్టణ జనాభా 8. తలసరి విద్యుత్ వినియోగం సూచికల విషయంలో అసమానతలు స్వాతంత్య్రానంతరం అధిక తలసరి ఆదాయం లో పంజాబ్, మహారాష్ర్ట, హర్యానా రాష్ట్రాలు ముందువరుసలో ఉండేవి. 1960-61లో పంజాబ్ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 25.6 శాతం, 1971-72 లో 69.8 శాతం, 2004-05లో 32.1 శాతం ఎక్కువ. 2005-06 తర్వాత తలసరి ఆదాయంలో హర్యానా ప్రధాన స్థానం పొందింది. 2011-12లో అధిక రాష్ర్ట స్థూల దేశీయోత్పత్తి కారణంగా తలసరి ఆదాయంలో వృద్ధి పరంగా బీహార్ ప్రథమ స్థానాన్ని, మధ్యప్రదేశ్, మహారాష్ర్ట తర్వాతి స్థానాలను పొందాయి. 2004-05లో దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మొత్తం జనాభాలో బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 48.2 శాతంగా నమోదైంది. ఆర్థికంగా వెనుకబడిన పెద్ద రాష్ట్రాల్లో పేదరికం కేంద్రీకృతమై ఉందని దీని ఆధారంగా అవగతం చేసుకోవచ్చు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలైన మహారాష్ర్ట, గుజరాత్, తమిళనాడులో పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి. ఫ్యాక్టరీలకు సంబంధించి మొత్తం ఉత్పత్తిలో 2/5వ వంతు కంటే ఎక్కువ, మొత్తం ఉద్యోగితలో 2/5 వంతు కంటే కొంత తక్కువ ఈ మూడు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమైంది. వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ఇతర రాష్ట్రాల కంటే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు ముందంజలో ఉన్నాయి. 2011 లెక్కల ప్రకారం దేశ జనాభాలో 4.4 శాతం వాటాను కలిగి ఉన్న పంజాబ్, హర్యానా దేశం లో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తిలో సుమారు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అభివృద్ధి ప్రక్రియలో అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోని మొత్తం జనాభాలో పట్టణ జనాభా అధికంగా ఉండటాన్ని గమనించవచ్చు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభాలో పట్టణ జనాభా మహారాష్ర్టలో 45.2 శాతం, తమిళనాడులో 48.4 శాతం, గుజరాత్లో 42.6 శాతం, కర్ణాటకలో 38.6 శాతం, పంజాబ్‌లో 37.5 శాతంగా నమోదైంది. బీహార్, ఒడిశా, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పట్టణ జనాభా శాతం తక్కువ. 2009-10లో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగం గోవాలో నమోదు కాగా, పాండిచ్చేరి, పంజాబ్, గుజరాత్ తర్వాతి స్థానాలు పొందాయి. మరోవైపు తలసరి విద్యుత్ వినియోగం అసోం, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్‌లో తక్కువ. జాతీయ సగటు తలసరి విద్యుత్ వినియోగం కంటే ఆయా రాష్ట్రాల్లో తలసరి విద్యుత్ వినియోగం తక్కువ. 2011 మార్చిలో జాతీయ సగటు బ్యాంకింగ్ రంగ డిపాజిట్లు * 33,174 కోట్లు కాగా ఢిల్లీలో తలసరి బ్యాంకింగ్ రంగ డిపాజిట్ల సగటు *2,85,400 కోట్లుగా, మహారాష్ర్టలో *82,380 కోట్లుగా నమోదయ్యాయి. బీహార్, అసోంలో తలసరి డిపాజిట్లు తక్కువగా ఉండటాన్ని బట్టి ప్రాంతీయ అసమానతల తీవ్రతను తెలుసుకోవచ్చు. ప్రాంతీయ ప్రణాళిక 1930వ దశకంలో ఆర్థికాభివృద్ధి మొదటి దశలో ప్రాంతీయ ప్రణాళికను సహజవనరుల ప్రణాళికగానే భావించారు. తర్వాతి కాలంలో సహజ వనరుల ప్రణాళికకు ప్రాధాన్యం తగ్గి సమస్యాత్మక రంగాల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికపై శ్రద్ధ పెరిగింది. గ్రామీణ జనాభా అధికంగా ఉన్న భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గ్రామాల మధ్య సంధానాన్ని (లింకేజ్) పెంచడం,సర్వీసు కేంద్రాల ఏర్పాటు, వృద్ధి కేంద్రాలను గుర్తించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతీయ ప్రణాళికలు రూపొందించి అమలుపరచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి రేటును ఇతర ప్రాంతాల కంటే మెరుగుపరిచే విధంగా ప్రాంతీ య ప్రణాళికలు అవసరం. వెనుకబడిన దేశాల్లో ప్రాంతీయ ప్రణాళికల లక్ష్యాల సాధన కొంత క్లిష్టతరమైంది. పేదరిక తీవ్రత అధికంగా ఉండే ఆయా దేశాల్లో ప్రజల జీవన నాణ్యత పెంపునకు ప్రాధాన్యమివ్వాలి. జాతీయాదాయం, సంపద పేద వర్గాల ప్రజల మధ్య పునఃపంపిణీ చేసే కార్యక్రమాల రూపకల్పనతోపాటు ఉపాధి వ్యూహాన్ని రూపొందించే విధంగా ప్రాంతీయ ప్రణాళికలు తోడ్పాటును అందించాలి. భారత్‌లో ప్రాంతీయ ప్రణాళికా విధానం ప్రణాళికా ప్రక్రియ ప్రారంభమైన తర్వాత భారత్‌లో ప్రాంతీయ అసమానతలను దృష్టిలో ఉం చుకొని ప్రణాళికా రచయితలు ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని గుర్తించారు. రెండో ప్రణాళిక ముసాయిదాలో అల్పాభివృద్ధి ప్రాంతాల ప్రత్యే క అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి లక్ష్యసాధనకు అనుగుణంగా పెట్టుబడుల ప్రక్రియ ఉండాలని ముసాయిదాలో పేర్కొన్నారు. మూడో ప్రణాళిక డాక్యుమెంట్లో చాప్టర్ ఐగీను ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి కేటాయించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమతౌల్య అభివృద్ధితోపాటు ఆర్థిక ప్రగతి ఫలితాలను వెనుకబడిన ప్రాంతాలు పొందే విధంగా ప్రణాళికా రచనకు ప్రాధాన్యమిచ్చారు. 3వ ప్రణాళిక అప్రోచ్ పేపర్లో రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు తొలగించే విధంగా రాష్ర్ట ప్రభుత్వాలకు తగిన చేయూతనివ్వాలని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పత్తి పెంపు, ఆదాయం, ఉపాధి పెంపునకు చర్యలు, సాంఘిక సేవల్లో భాగంగా ప్రాథమిక విద్య, వాటర్ సప్లయ్, పారిశుధ్యం, సమాచారం, విద్యుత్ సౌకర్యాల అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణం పెంపు లాంటి అంశాలను పేర్కొన్నారు. ఇదివరకే అ మల్లో ఉన్న కార్యక్రమాలతోపాటు కొత్త కార్యక్రమాల రూపకల్పన ద్వారా ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిని అప్రోచ్ పేపర్లో పేర్కొన్నారు. నాలుగో ప్రణాళికలో చిన్న రైతుల అభివృద్ధి; ఏజెన్సీ, ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి; ఏజెన్సీ, దుర్భిక్ష పీడిత ప్రాంతాల కార్యక్రమం, క్రాష్ స్కీం ఫర్ రూరల్ ఎంప్లాయ్మెంట్, పైలట్ ఇంటెన్సివ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రాజెక్ట్‌లను అమలుపరిచారు. 4వ ప్రణాళికలో ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధిలో భాగంగా అవలంభించిన విధానాలు, కార్యక్రమాలను అయిదో ప్రణాళికలోనూ కొనసాగించారు. 5వ ప్రణాళికలో ఏరియా డెవలప్మెంట్కు ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగం గా వనరుల ఆధారిత లేదా సమస్యాత్మక ఆధారిత అభివృద్ధి దృక్పథం, లక్షిత వర్గాల అప్రోచ్, ఇన్సెంటివ్ అప్రోచ్, సమగ్ర ప్రాంతాల అభివృద్ధి లాంటి దృక్పథాలను అవలంభించారు. ప్రాంతీ య అసమానతలను రూపుమాపే క్రమంలో ఆరో ప్రణాళిక Area Planning, Subplan Approach ను ప్రోత్సహించడం ద్వారా ప్రాం తీయ ప్రణాళికను జాతీయ అభివృద్ధి ప్రణాళికతో సంఘటితపరచవచ్చని భావించారు. ఏడో ప్రణాళిక వ్యవసాయ ఉత్పాదకత, మానవ వనరుల సామర్థ్యం లాంటి రెండు అంశాల్లో ప్రాం తీయ అసమానతల తొలగింపును గుర్తించింది. ఎనిమిదో ప్రణాళిక కొండ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం, ఈశాన్య రాష్ట్రాల కౌన్సిల్, బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ కౌన్సిల్ లాంటి కార్యక్రమాలను ప్రకటించింది. ఈ కార్యక్రమాలను తప్పనిసరిగా ప్రాంతీయ ప్రణాళికలో భాగంగా పరిగణించవచ్చు. తొమ్మిదో ప్రణాళికలో ప్రత్యే క ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించాలని భావించారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులు ప్రాంతీయ అసమానతల తొలగింపునకు సహకరించవని ఈ ప్రణాళిక డాక్యుమెంట్లో ప్రణాళిక రచయితలు భావించారు. వెనుకబడిన రాష్ట్రాల్లో అవస్థాపనా రంగంలో ప్రభుత్వ రంగ పెట్టుబడుల పెంపు ఆవశ్యకతను డాక్యుమెంటులో పొందుపరిచారు. పదో ప్రణాళిక పెరుగుతున్న ప్రాంతీయ అసమానతల పట్ల ఆందోళన వెలిబుచ్చింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రణాళికలో రాష్ట్రాలకు విడిగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించారు. సాంఘిక అభివృద్ధి, వృద్ధిరేట్లను ఈ లక్ష్యాల్లో భాగంగా పొందుపరిచారు. పదకొండో ప్రణాళికలో వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధిని పటిష్టపరచాలని భావించారు. అవస్థాపనా సౌకర్యాల కల్పన, గుడ్ గవర్నెన్‌సను ప్రోత్సహించడం, వ్యవసాయ రంగ సంస్కరణల లాంటి అంశాలకు ఈ నిధి నుంచి గ్రాంట్లు ఇస్తారు. వీటితో పాటు కొండ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం, Western Ghats Development Programme, బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ కార్యక్రమాలను పటిష్టపరచాలని భావించారు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి అనేక ప్రోత్సాహకాలను ఈ ప్రణాళికలో ప్రతిపాదించారు. ప్రణాళికా యుగం మొత్తాన్ని పరిశీలించినప్పుడు ప్రాంతీయ ప్రణాళికలకు సంబంధించి ప్రభుత్వ విధానాలు కిందివిధంగా ఉన్నాయి. 1. వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామికీకరణ లక్ష్యంగా అవలంభించిన విధానాలు. 2. నీటిపారుదల, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల అభివృద్ధికి సంబంధించిన విధానాలు. 3. ముఖ్య అవస్థాపనా సౌకర్యాలైన రవాణా, సమాచార రంగాలను వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి నిమిత్తం అవలంభించిన విధానాలు. 4. {పాంతీయ అసమానతల నివారణలో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు వనరుల బదిలీ. 5. వెనుకబడిన, అల్పాభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం ప్రత్యేక కార్యక్రమాలు. మాదిరి ప్రశ్నలు 1. బోర్డర్ ఏరియా అభివృద్ధి కార్యక్రమాన్ని ఎన్నో ప్రణాళికలో ప్రారంభించారు? 1) 5 2) 6 3) 7 4) 8 2. జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమానికి ఇంతకు ముందున్న పేరేమిటి? 1) పనికి ఆహార పథకం 2) జాతీయాభివృద్ధి పథకం 3) గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం 4) ఏదీకాదు 3. రాష్ట్రాలకు, ప్రణాళికా సంఘానికి మధ్య సహకారం పెంపొందించడానికి ఏర్పరిచిన సంస్థ ఏది? 1) జాతీయ అభివృద్ధి మండలి 2) జాతీయ సమన్వయ మండలి 3) జాతీయ సహకార మండలి 4) ఏదీకాదు 4. Rural Infrastructure Develo-pment Fund ఏర్పాటైన సంవత్సరం? 1) 1994-95 2) 1995-96 3) 1996-97 4) 1997-98 5. జిల్లా ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేది? 1) ముఖ్యమంత్రి నియమించిన వ్యక్తి 2) జిల్లా మంత్రి 3) జిల్లా పరిషత్ చైర్మన్ 4) జిల్లా కలెక్టర్ 6. అభివృద్ధికి కచ్చితమైన సూచీలుగా వేటిని పరిగణించలేం? 1) తలసరి ఆదాయం 2) రాష్ర్ట మొత్తం స్థూల దేశీయోత్పత్తి 3) 1, 2 4) ఏదీకాదు 7. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తిలో సుమా రు 20 శాతం వాటా కలిగిన రాష్ట్రాలు? 1) పంజాబ్, హర్యానా 2) పంజాబ్, గుజరాత్ 3) హర్యానా, పశ్చిమబెంగాల్ 4) తమిళనాడు, కర్ణాటక 8. తలసరి విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న రాష్ట్రం? 1) అసోం 2) బీహార్ 3) ఉత్తరప్రదేశ్ 4) పైవన్నీ 9. వాణిజ్య బ్యాంకింగ్ రంగ డిపాజిట్లలో తల సరి డిపాజిట్లు తక్కువగా ఉన్న రాష్ట్రం? 1) బీహార్ 2) అసోం 3) 1, 2 4) ఏదీకాదు 10. {పాంతీయ సమతౌల్య అభివృద్ధిని 3వ ప్రణాళికలో ప్రత్యేకంగా ఏ చాప్టర్లో పొందుపరిచారు? 1) ఐగీ 2) గీ 3) గీఐ 4) గీఐఐ సమాధానాలు 1) 3 2) 1 3) 1 4) 2 5) 4 6) 3 7)1 8) 4 9) 3 10) 1