breaking news
phone in programme
-
ఇదిగో డిజైన్
సాక్షి,సిటీబ్యూరో: ప్రజా సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ చేపట్టిన జీహెచ్ఎంసీ కమిషనర్‌తో ‘ఫోన్ ఇన్’కు నగర పౌరుల నుంచి అనూహ్య స్పందన లభించింది. గురువారం నిర్ణీత సమయం కంటే ముందునుంచే నిర్విరామంగా ప్రజల నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరి ఫిర్యాదులు శ్రద్ధగా విన్న కమిషనర్ దానకిశోర్.. ఒకటికి రెండుసార్లు అడిగి వారి ప్రాంతం, ఫోన్ నంబర్ వంటి వివరాలు రాసుకున్నారు. తక్షణ చర్యల కోసం అవసరమైన పీటీఐఎన్, ఇతరత్రా రశీదుల నంబర్లూ అడిగారు. ఓవైపు ఫిర్యాదులు స్వీకరిస్తూనే మరోవైపు నిర్లక్ష్యం కనబరచిన ఇద్దరు అధికారులపై ఆయన చర్యలు తీసుకున్నారు. కాగా, 500 గజాల్లోపు స్థలంలో ఇళ్లు నిర్మించాలనుకునే యజమానుల కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించినట్లు చెప్పారు. ఇంటి నిర్మాణానికి పూనుకునేవారు జీహెచ్ఎంసీని సంప్రదించి సదరు విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారో చెబితే పలు రకరకాల డిజైన్లతో నమూనాలను అందజేస్తారన్నారు. వాటిలోతమకు నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఆ మేరకు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోగా ఇంటి నిర్మాణ అనుమతి జారీ చేస్తారు. నిర్మాణం ప్రారంభించేటప్పుడు భూసార పరీక్షల కోసం మాత్రమే ఆర్కిటెక్ట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ మొత్తం 4 వేల డిజైన్లు అందుబాటులోకి తేనుండగా తొలిదశలో 500 డిజైన్లు అందుబాటులో ఉంచనున్నారు. అంతే కాదు.. తమ దరఖాస్తు పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘ఫైల్ ట్రాకింగ్’ అవకాశం కూడా కల్పించనున్నారు. అందుకు త్వరలోనే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం. దానకిశోర్ ‘సాక్షి’ ఫోన్ ఇన్ సందర్భంగా తెలిపారు. అక్రమ నిర్మాణాలు, టౌన్‌ప్లానింగ్‌లో రెడ్టేపిజంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంపై స్పందించిన ఆయన ఈ విషయం వెల్లడించారు. ఈ యాప్ పనితీరు, డిజైన్లు, అనుమతులపై ప్రజలకు తగిన అవగాహన కల్పించేందుకు అన్ని జోన్లలో నెలలో ఒకరోజు అవగాహన దినం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీసీపీ, తదితర అధికారులు పాల్గొంటారని తెలిపారు. యాప్‌లో తమ దరఖాస్తు పరిస్థితి ఏంటో ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునన్నారు. సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కూడా డ్యాష్‌బోర్డు ద్వారా ఫైల్ ట్రాకింగ్ తెలుస్తుందన్నారు. ‘ఫీడ్ ద నీడ్’ కు మరో యాప్ నగరంలో పేదల ఆకలి తీర్చేందుకు చేపట్టిన‘ఫీడ్ ద నీడ్’ను మరింత విస్తృతంగా అమలు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా ఆహారం అందజేయాలనుకునే వారు తమకు వివరాలు అందిచవచ్చన్నారు. దాంతోపాటు ఆకలితో అలమటించే అన్నార్తులు ఎక్కువగా ఏ ప్రాంతంలో ఉన్నారో కూడా ప్రజలు తెలియజేయవచ్చునన్నారు. యాప్ ద్వారా అందే ఈ సమాచారంతో ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ‘ఫీడ్ ది నీడ్’ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మ్యాపింగ్ చేస్తామన్నారు. తద్వారా ఈ కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చునని ఆయన తెలిపారు. అవగాహనలో భాగంగా.. నగరంలో కొత్తగా ఇల్లు నిర్మించేవారికి.. ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి.. ఎంత విస్తీర్ణంలో ఎన్ని అంతస్తుల భవనం నిర్మించవచ్చో అవగాహన సదస్సులో సందేహాలు తీరుస్తారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఎలాంటి డాక్యుమెంట్లు అందజేయాలి.. ఎంతమేర సెట్బ్యాక్లు వదలాలి వివరాలతో పాటు, ఫ్లాట్ కొనుగోలు సందర్భంగా జీహెచ్ఎంసీ నిర్దేశించిన నిబంధనలను సదస్సులో వివరిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈనెల 23వ తేదీన జరిగే సదస్సుకు 500 గజాలలోపు స్థలంలో ఇల్లు నిర్మించ దలచుకున్నవారు, 2 వేల చ.అ.లోపు ఫ్లాట్ కొనుగోలు చేసేవారు హాజరు కావచ్చన్నారు. నగరంలో ఏటా దాదాపు 16 వేల భవన నిర్మాణ అనుమతులు జారీ అవుతుండగా, వీటిలో 13 వేలు ఇండిపెండెంట్ ఇళ్లే ఉంటున్నాయి. ఆన్లైన్ ద్వారా అనుమతులతో పారదర్శకత పాటిస్తున్నప్పటికీ నియమ నిబంధనల గురించి తెలియజేసే వ్యవస్థ లేకపోవడంతో పాటు ప్రజల అవగాహన లోపంతో 10 శాతానికి పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని కమిషనర్ దానకిశోర్ తెలిపారు. మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయిస్తుండటంతో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయన్నారు. సదస్సులో భాగంగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. ఇంటి నిర్మాణాలు చేయాలనుకునేవారు తమ స్థల వైశాల్యం, ఎన్ని అంతస్తులు నిర్మించే విషయం, సమర్పించే డాక్యుమెంట్లు తదితర అంశాలకు సంబంధించి ఆసక్తి పత్రాన్ని ఈ అవగాహన సదస్సులో అందజేస్తే వారికి నియమిత సమయంలోగా మార్గదర్శకాలు అందజేయనున్నట్టు చెప్పారు. 23వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ అవగాహన సదస్సును మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభిస్తారని కమిషనర్ తెలిపారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం దేశంలో ఇదే ప్రథమమన్నారు. -
నేడు జేడీతో 'ఫోన్ ఇన్'
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, పెసర ఖరీఫ్ పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగు ఏవైనా సమస్యలుంటే గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య 08554–246847 నెంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు పొందాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి రైతులకు సూచించారు. ఫోన్‌ఇన్ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల వాడకం, భూసార పరీక్షల ఫలితాల పత్రాలు, వర్షాల స్థితిగతులు, పంటలకు వ్యాపించిన తెగుళ్లు, నివారణ పద్ధతుల గురించి సరైన సలహాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి గురువారం రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
డబ్బులిస్తేనే వైద్యం
ఐదు నెలలుగా ఏఎన్ఎంలకు జీతాల్లేవు ఫోన్‌ఇన్ కార్యక్రమంలో డీఎంహెచ్ఓకు బాధితుల వినతి సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి విభాగంలో డబ్బులు ఇవ్వందే వైద్యం చేయడం లేదని, పేద రోగులకు సరైన వైద్యం అందించడంలో ఆసుపత్రి డాక్టరు, సిబ్బంది తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని సంగారెడ్డిలోని హనుమాన్ నగర్‌కు చెందిన రాకేష్ ఇన్చార్జి డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎక్స్‌రే విభాగంలో దారుణంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మంగళవారం స్థానిక జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఫోన్‌ఇన్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అమర్‌సింగ్ పాల్గొని ఫోన్ ద్వారా సమస్యలను తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు ఆయనకు సమస్యలను విన్నవించారు. ఐదు నెలల నుంచి ఏఎన్ఎంల జీతాలు రావడం లేదని, జీతాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దుబ్బాకకు చెందిన నరేందర్ పేర్కొన్నారు సిద్దిపేట మండలం చిన్నగౌడవెల్లి ఆస్పత్రిలో హిమోఫీలియా మందులు గత రెండు నెలల నుంచి అందుబాటులో లేవని గ్రామానికి చెందిన నరేష్ ఫిర్యాదు చేశారు. నారాయణఖేడ్ పీహెచ్సీలో ఉన్న ఖాళీలలను వెంటనే భర్తీ చేయాలని చందూలాల్ సూచించారు. -
నేడు మంత్రి సునీతతో ఫోన్‌ఇన్
అనంతపురం అర్బన్ : పౌర సరఫరాల అంశాలపై ఈనెల 18న ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి పరిటాల సునీత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్వామా సమావేశ మందిరంలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు తానే స్వయంగా నిర్వహిస్తానని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, తూనికలు కొలతలు, దీపం, తదితర సమస్యలు, ఫిర్యాదులను ప్రజలు 08554– 274058లో ఫోన్ చేసి తెలియజేÄñæ¬చ్చని మంత్రి తెలిపారు.