breaking news
Petroleum & Natural Gas Ministry
-
అలెర్ట్ : ఈ వెహికల్స్‌ను బ్యాన్ చేయండి.. కేంద్రం వద్దకు ప్రతిపాదనలు!
న్యూఢిల్లీ: పది లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో డీజిల్ ఆధారిత ఫోర్ వీలర్లను 2027 నాటికి నిషేధించాలని చమురు మంత్రిత్వ శాఖ సూచించింది. ఎలక్ట్రిక్, గ్యాస్ ఆధారిత వాహనాలను ప్రోత్సహించాలని చమురు మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ విన్నవించింది. ‘ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో తయారైన మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, త్రిచక్ర వాహనాల తయారీని 2035 నాటికి దశలవారీగా నిలిపివేయాలి. సుమారు 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో డీజిల్ సిటీ బస్సులను నూతనంగా జోడించకూడదు. ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఆధారిత ద్విచక్ర, త్రిచక్ర వాహనాలను దశలవారీగా నిర్మూలించడానికి ఎలక్ట్రిక్ వెహికిల్స్ సరైన పరిష్కారంగా ప్రచారం చేయాలి. చదవండి👉 దేశంలోని ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! మధ్యంతర కాలంలో మిశ్రమ నిష్పత్తిని పెంచుతూ ఇథనాల్‌తో కూడిన ఇంధనానికి విధాన మద్దతు ఇవ్వాలి. డీజిల్‌తో నడిచే ఫోర్ వీలర్లను వీలైనంత త్వరగా తొలగించవచ్చు. అందువల్ల 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాలు, అధిక కాలుష్యం ఉన్న అన్ని పట్టణాలలో డీజిల్‌తో నడిచే నాలుగు చక్రాల వాహనాలపై నిషేధాన్ని ఐదేళ్లలో అమలు చేయాలి. ఫ్లెక్స్ ఫ్యూయల్, హైబ్రిడ్లతో కూడిన వాహనాలను ప్రోత్సహించేలా స్వల్ప, మధ్యస్థ కాలంలో ప్రచారం చేయాలి. పన్నుల వంటి ఆర్థిక సాధనాల ద్వారా ఇది చేయవచ్చు. ఈవీల వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్‌ను కొనసాగించాలి. నగరాల్లో సరుకు డెలివరీ కోసం ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కొత్తగా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలి. కార్గో తరలింపు కోసం రైల్వేలు, గ్యాస్‌తో నడిచే ట్రక్కులను ఎక్కువగా ఉపయోగించాలి. ఈ సూచనలు అమలైతే 2070 నాటికి ఉద్గారాల విషయంలో భారత్ నెట్ జీరో స్థాయికి చేరుకుంటుంది’ అని నివేదిక పేర్కొంది. చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో? -
రిలయన్స్‌పై చట్టబద్ధంగానే చర్యలు
న్యూఢిల్లీ: గ్యాస్ నిక్షేపాలను వెలికితీసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఇచ్చిన స్థలంలో కొంత భాగాన్ని వెనక్కి తీసుకునే అంశంపై చట్టబద్ధంగానే వ్యవహరిస్తామని చమురు శాఖ కార్యదర్శి వివేక్ రే బుధవారం తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఉత్పత్తి పంపక ఒప్పందం (పీఎస్సీ) నిబంధనలకి అనుగుణంగానే చర్యలు తీసుకుంటామన్నారు. సదరు స్థలంలో ఉండే గ్యాస్ నిక్షేపాలన్నింటినీ సాధ్యమైనంత త్వరగా వెలికి తీయడం ద్వారా దిగుమతుల భారం తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని రే చెప్పారు. రిలయన్స్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌తో సుమారు మూడున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాలు వివరించారు. ఒకవైపు పీఎస్సీకి కట్టుబడి ఉండటం, మరోవైపు నిక్షేపాలను వెలికి తీసి ఆదాయం ఆర్జించడం ఎలా అన్న రెండు సవాళ్లు ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్నాయన్నారు. నిక్షేపాల అభివృద్ధి ప్రక్రియలో వివిధ దశల డెడ్లైన్లను పలుమార్లు ఉల్లంఘించిన రిలయన్స్ నుంచి స్థలాన్ని వెనక్కి తీసుకోవడమా.. లేక దానికే మరో అవకాశం ఇవ్వడమా అన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోగలదన్నారు. కేజీ-డీ6 బ్లాక్‌లో ఆర్‌ఐఎల్‌కి 7,645 చ.కి.మీ. కేటాయించగా.. అందులో నిక్షేపాలు వెలికితీయని 6,601 చ.కి.మీ. స్థలాన్ని కంపెనీ వెనక్కి ఇచ్చేయాలని డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) చెబుతోంది. అయితే, తమకు మరింత సమయం ఇవ్వాలని.. గ్యాస్, చమురు నిక్షేపాలు కనుగొన్న 3,412 చ.కి.మీ. స్థలాన్ని అట్టే పెట్టుకునేందుకు అనుమతించాలంటూ రిలయన్స్ కోరుతోంది.