breaking news
Penna Bridge
-
ఆర్టీసీ బస్సు ప్రమాదం: నలుగురికి గాయాలు
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం పెన్నానది బ్రిడ్జి సమీపంలో గురువారం ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో గంగాధరం అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు లారీలు.. ఆటో ఢీ: ఐదుగురు మృతి
నెల్లూరు : నెల్లూరులోని పెన్నా హైవే బ్రిడ్జిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు... ఓ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి...క్షతగాత్రుడ్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని... స్థానికుల సహాయంతో క్యాబిన్‌లోని డ్రైవర్‌ను బయటకు తీసేందుకు యత్నిస్తున్నారు. అలాగే మృతదేహాలను స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రొద్దుటూరు టౌన్: అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై విద్యార్థులు ప్రాణాలు విడిచిన సంఘటన ఇంకా అందరికళ్ల ముందు మెదలుతూనే ఉంది. అయినా ఆర్టీసీ యాజమాన్యంలో ఏ మాత్రం మార్పు రాలేదనడానికి ఈ సంఘటనే నిదర్శనం. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 04 ఎక్స్ 0844 నెంబర్‌గల అద్దె బస్సు వేంపల్లెకు మంగళవారం ఉదయం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో 30 -40 మందికిపైగా ప్రయాణికులతో ఎర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరుకు బయల్దేరింది. పోట్లదుర్తి దాటుకుని ప్రొద్దుటూరు పెన్నా బ్రిడ్జికి మరో పది మీటర్లు ఉండగా ఉన్నట్లుండి డ్రైవర్ వైపు ఉన్న ముందు చక్రం ఊడి పక్కకు పడిపోయింది. దీంతో బస్సు ఒక్కసారిగా ముందు వైపుకు ఒరిగి పెద్ద శబ్దంతో ముందుకు వెళ్లడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై కేకలు వేశారు. డ్రైవర్ బస్సును వెంటనే ఆపివేయడంతో ప్రయాణికులు కిందికి దిగారు. మరో 10 మీటర్లు ముందుకు వచ్చి ఉంటే పెన్నా బ్రిడ్జి ప్రహరీని బస్సు ఢీకొట్టి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రయాణికులు మరో బస్సులో ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. పోట్లదుర్తి వద్దే సమస్య తెలిసినా... ఆర్టీసీ అద్దెబస్సుకు పోట్లదుర్తి వద్దనే సమస్య వచ్చిందన్న విషయాన్ని బస్సు డ్రైవర్, కండక్టర్లతోపాటు ప్రయాణికులు కూడా గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి సలహా మేరకు ముందుకు తీసుకురావడమా లేక నిలిపివేయడమా అనే నిర్ణయం తీసుకుని ఉండాల్సింది. అయితే డ్రైవర్ అలాగే బస్సును ముందుకు నడపడంతో ముందు చక్రం ఊడిపోయింది. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మొత్తం 61 అద్దె బస్సులు, 110 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజు ప్రయాణికులను చేరవేస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు అయితే డిపో గ్యారేజికి వెళ్లి అక్కడ ఫిట్నెస్ను పరిశీలిస్తారు. అద్దె బస్సుల యజమానులు ఇళ్ల వద్దకానీ, పెట్రోలు బంకుల వద్ద కానీ పెట్టుకుని తిరిగి వాటిని ఉదయాన్నే వారికి కేటాయించిన సమయానికి పాయిం ట్ల వద్దకు తీసుకొస్తారు. వీటి ఫిట్నెస్ను పరిశీలించే పరిస్థితి ఏమేరకు ఉంటుందన్న విషయం అధికారులు చెప్పాల్సి ఉంది. వీటికి రవాణాశాఖాధికారులు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్లను అధికారులు ఓ మారు నిశితంగా పరిశీలిస్తే బస్సుల పరిస్థితి అర్థమవుతుంది. అద్దె బస్సులకు ఉన్న ప్రైవేటు డ్రైవర్లకు హెవీ లెసైన్స్‌లు ఉన్నాయా, వారికి అనుభవం ఉందా అన్న విషయాన్ని కూడా ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ప్రమాదం జరిగితేనే పరిశీలనలా... ఈ విషయంపై ఆర్టీసీ డీఎం గిరిధర్‌రెడ్డిని అడగ్గా డిపోలో ఉన్న అన్ని ప్రైవేటు బస్సులను బుధవారం తనిఖీ చేస్తున్నామన్నా రు. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరి శీలించామని తెలిపారు. ప్రమాదానికి కారణం పై విచారణ చేసి బస్సు యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. అలాగే ఫిట్నెస్ సరిఫికెట్లను పరిశీలిస్తామన్నారు.