breaking news
particles
-
ఆడ కాదు.. ఈడ కాదు అన్నింటిలో ప్లాస్టిక్కే! ఈ లెక్కలు చూడండి!
ఇక్కడా అక్కడా అని లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. చివరికి ఇది మన శరీరంలోనూ పేరుకుపోతోందని.. రక్తంలో కూడా అతిసూక్ష్మ (మైక్రో) ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయని ఇటీవలే శాస్త్రవేత్తలు గుర్తించారు. పీల్చేగాలి నుంచి తినే ఆహారం ద్వారా అనేక రకాలుగా ప్లాస్టిక్ శరీరంలోకి వెళ్తోందని ప్రకటించారు. మరి మన శరీరంలోకి ఏయే మార్గాల ద్వారా.. ఎంతెంత ప్లాస్టిక్ చేరుతోందో చెప్పే లెక్కలివీ.. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేగజైన్ విడుదల చేసిన ‘హ్యూమన్ కన్సంప్షన్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ నివేదిక ప్రకారం.. సగటున ఏటా ఒక్కోవ్యక్తి శరీరంలోకి వెళ్తున్న మైక్రోప్లాస్టిక్ రేణువుల సంఖ్య 74 వేల నుంచి లక్షా 21 వేల వరకు ఉంటుందని అంచనా. – సాక్షి సెంట్రల్‌డెస్క్ చదవండి 👉🏼Russia Ukraine War: తస్మాత్ జాగ్రత్త! 👉🏼గుడ్లు, బెల్లం, తేనె, అవకాడో.. పిల్లలకు వీటిని తినిపిస్తే.. -
ఉపవాసంతో వ్యర్థానికి మోక్షం!
లంఖణం పరమౌషధం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయాన్ని చాలాసార్లు రుజువు చేసింది కూడా. హార్వార్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధనలు కూడా నిరాహారంగా ఉండటం, తరచూ వ్యాయామం చేయడం శరీరంలోని కణ వ్యవస్థను పూర్తిగా చైతన్యవంతం చేస్తుందని గుర్తించారు. ఈ చర్యల ఫలితంగా పాడైపోయిన ప్రొటీన్లను బయటకు పంపేందుకు శరీరానికి మరింత శక్తి లభిస్తుందని పరిశోధన పూర్వకంగా తెలుసుకున్నారు. శరీరాన్ని తనను తాను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్వయంగా కొన్ని పనులు చేసుకుంటుంది. చెడిపోయిన ప్రొటీన్లు, కణాలను వదిలించుకోవడం ఇందులో భాగం. అయితే కొన్నిసార్లు ఈ వ్యవస్థలు సక్రమంగా పనిచేయక వ్యాధులు వస్తూంటాయి. ప్రొటీన్‌ను ఒక నిర్దిష్ట పద్ధతిలో మడతపెట్టడం ద్వారా అవి బయటకు పోకుండా పోగుబడుతూంటాయని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఈ ప్రక్రియను నియంత్రించే మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాయామం, ఉపవాసం వంటి చర్యల వల్ల శరీరంలో జరిగే హార్మోన్ మార్పులు కణాలపై ప్రభావం చూపుతున్నాయని... పాడైన ప్రొటీన్లను బయటకు పంపే వ్యవస్థను చైతన్యవంతం చేస్తున్నాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వెట్ప్లాంక్ తెలిపారు. సైక్లింగ్ వ్యాయామం చేసే కొందరిపై పరీక్షలు జరిపినప్పుడు పాడైన ప్రొటీన్లు వేగంగా నశించిపోతున్నట్లు గుర్తించారు. -
తెర వేసుకున్నా కనిపిస్తుంది...
వాహనాల కిటికీలకు సోలార్ స్క్రీన్లు ఎందుకు వేసుకుంటాం? ఇంకెందుకు? సూర్యుడి వేడి లోపలికి రాకుండా. కానీ వాటిపై ఇటీవల నిషేధం పెట్టేశారు అంటున్నారా? ఇంకొన్ని రోజులు ఆగండి, ఎంచక్కా స్క్రీన్ వేసేసుకోవచ్చు. పోలీసులు అడ్డుకుంటారన్న బెంగ కూడా అక్కరలేదు. ఎందుకంటే... ఫొటోలో కనిపిస్తున్న సరికొత్త సోలార్ స్క్రీన్లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. పారదర్శకంగా ఉన్నాయి కాబట్టి వేడిని ఎలా అడ్డుకుంటాయో అనుకోనక్కరలేదు. ఇవి కనీసం 70 శాతం వేడికి అడ్డుకట్ట వేస్తాయని భరోసా ఇస్తున్నారు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. వాహనాలకు మాత్రమే కాదు.. వీటిని భవనాల కిటికీలకు, అద్దాలకూ బిగించుకోవచ్చునని, ఏసీ ఖర్చులను కనీసం పది శాతం మిగుల్చుకునేందుకు ఉపయోగపడతాయని ఈ సరికొత్త సోలార్ స్క్రీన్స్ తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త ఫాంగ్ అంటున్నారు. ప్లాస్టిక్‌తోనే తయారైనప్పటికీ ఈ స్క్రీన్ మధ్యలో ప్రత్యేక లక్షణాలున్న సూక్ష్మ కణాలు ఉంటాయని, వేడి ఎక్కువైనకొద్దీ వీటి సైజు తగ్గిపోవడం ద్వారా వేడిని లోపలకు రాకుండా అడ్డుకుంటాయని ఆయన వివరించారు. ఇప్పటికే తాము తయారుచేసిన స్క్రీన్ అద్భుత ఫలితాలిచ్చిందని.. మరిన్ని పరీక్షలు చేసిన తరువాత అందరికీ అందుబాటులోకి తీసుకు వస్తామని వివరించారు. -
నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు?
DEECET - 2014 బయాలజీ 1. ధాన్యాలు, చిరుధాన్యాలు ఏ మొక్కల వంశానికి చెందుతాయి? 1) లిలియేసి 2) ఆస్టరేసి 3) గడ్డిజాతి 4) అన్నీ 2. ఫలాల నుంచి నారనిచ్చే మొక్క? 1) పత్తి 2) గోగు 3) కొబ్బరి 4)జనుము 3. అతి పురాతనమైన నార ఏ మొక్కకు చెందింది? 1) కోకస్ 2) హైబిస్కస్ 3) క్రొటలేరియా 4) గాసిపియం 4. జియామేజ్ దేని శాస్త్రీయ నామం? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) సజ్జ 5. కాలికో ముద్రణలో దేని పిండిని వినియో గిస్తారు? 1) సజ్జ 2) రాగి 3) గోధుమ 4) వరి 6. పంటను అభివృద్ధి చేయడానికి ఉపయో గించే సామాన్య పద్ధతి? 1) నేలదున్నడం 2) కలుపు తీయడం 3) సంకరణ పద్ధతి 4) నీరు పెట్టడం 7. ‘లైవ్‌స్టాక్’ కింద ఏ జంతువులు వస్తాయి? 1) ఆవులు 2) గేదెలు 3) పశువులు 4) అన్నీ 8. రోడ్ ఐలాండ్ అనే జాతి దేనికి సంబంధిం చింది? 1) మేకలు 2) గొర్రెలు 3) కోళ్లు 4) గుర్రాలు 9. ఏ జాతి గొర్రె తోలుకి ప్రసిద్ధం? 1) అంగోరా 2) మెరినో 3) కొరిడేల్ 4) కారాకుల్ 10. మగ గాడిద, ఆడ గుర్రానికి పుట్టిన జీవిని ఏమంటారు? 1) ల్యాంబ్ 2) మ్యూల్ 3) బక్ 4) హిన్నీ 11. ప్లీస్ అని ఏ రోమాలను పిలుస్తారు? 1) ప్రాథమిక 2) ద్వితీయ 3) తృతీయ 4) బిరుసు 12. పామ్ మొక్క శాస్త్రీయ నామం? 1) సిసామమ్ ఇండికమ్ 2) ఎల్యుసిన్ కొరకానా 3) ఇలుసిస్ గెనైసిస్ 4) బ్రాసికా 13. ఇండియన్ రోజ్‌వుడ్ అని దేన్ని పిలుస్తారు? 1) సాలు 2) టేకు 3) వేప 4) డాల్బర్జియా 14. చెవిపోటు, చర్మవ్యాధుల నివారణలో వాడే కేంఫర్ అనే ఔషధం ఏ మొక్క నుంచి లభిస్తుంది? 1) యూకలిప్టస్ 2) డిజిటాలిస్ 3) ఆసిమమ్ 4) నక్స్‌వామికా 15. మలేరియా వ్యాధి నివారణలో వాడే ఔషధం? 1) అట్రోవిన్ 2) బ్రూసిన్ 3) క్వినైన్ 4) డిజిటాలిన్ 16. థార్న ఆపిల్‌గా ఏ మొక్కను పిలుస్తారు? 1) దతూరా 2) సింకోనా 3) నల్లమందు 4) ఆట్రోపా బెలడోనా 17. టస్సార్ పట్టు దేని నుంచి లభిస్తుంది? 1) బాంబిక్స్ మోరి 2) థియోపిలా 3) అట్టాకస్ సింధియా 4) ఆంధీరియా పాంపియా 18. పట్టులోని ప్రోటీన్? 1) కెరాటిన్ 2) ఆల్బుమిన్ 3) ఫైబ్రోయిన్ 4) సిలికాన్ 19. తేనె పట్టులో రాణి ఈగల సంఖ్య? 1) 200 - 300 2) 20,000-60,000 3) 1 4) 2 20. లక్క ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం? 1) శ్రీలంక 2) పాకిస్తాన్ 3) ఇండియా 4) నేపాల్ 21. డీడీటీ ఒక? 1) శిలీంద్ర నాశకం 2) కలుపు మొక్కల నాశకం 3) క్రిమిసంహారకం 4) ఎరువు 22. ఫిరమోనులు ఏ క్రియలో ఉపయోగ పడతాయి? 1) శ్వాసక్రియ 2) విసర్జన 3) ప్రత్యుత్పత్తి 4) జీర్ణక్రియ 23. సర్పాల పార్కు ఉన్న ప్రదేశం? 1) హైదరాబాద్ 2) గిండి 3) ఢిల్లీ 4) విజయవాడ 24. ముత్యం ఏ పదార్థంతో తయారవుతుంది? 1) సోడియం కార్బోనేట్ 2) కాల్షియం కార్బోనేట్ 3) కాల్షియం సిలికేట్ 4) మెగ్నీషియం కార్బోనేట్ 25. యూజీ ఈగలు ఏ పరిశ్రమను ప్రభావితం చేస్తాయి? 1) తేనె 2) లక్క 3) పట్టు 4) చేపలు 26. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉండే నిర్మోచ నాల సంఖ్య? 1) 3 2) 4 3) 2 4) లేవు 27. మూన్ జెల్లి ఏ వర్గానికి చెందుతుంది? 1) నిమటోడ 2) పొరిఫెరా 3) టినోఫోరా 4) కార్డేటా 28. జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం? 1) మొలస్కా 2) అనెలిడ 3) ఆర్థ్రోపొడ 4) ఇఖైనోడెర్మట 29. ఏ రాజ్యాన్ని మెటాఫైటా అంటారు? 1) ఫంజి 2) ప్లాంటే 3) ప్రొటిస్టా 4) ఎనిమేలియా 30. ఏ రాజ్యానికి చెందిన జీవులను ‘భూమిని శుభ్రపరిచే తోటీలు’ అంటారు? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 31. అతిపురాతన జీవులు ఏ రాజ్యానికి చెందు తాయి? 1) మొనీరా 2) ప్రొటిస్టా 3) ఫంజి 4) ఎనిమేలియా 32. ‘సముద్రంలో తేలియాడే పచ్చికబయళ్లు’ అని వేటికి పేరు? 1) బ్యాక్టీరియా 2) డయాటమ్స్ 3) స్మట్లు 4) మౌల్డ్‌లు 33. ‘జాతి’ పదాన్ని మొదటిసారిగా ఉపయో గించింది? 1) లిన్నయస్ 2) చరకుడు 3) జాన్రే 4) అరిస్టాటిల్ 34. జీర్ణక్రియ, శ్వాసక్రియకు సంబంధించిన జీవశాస్త్ర శాఖ? 1) పిండోత్పత్తి శాస్త్రం 2) శరీర ధర్మ శాస్త్రం 3) సూక్ష్మజీవ శాస్త్రం 4) పరిణామ శాస్త్రం 35. సముద్ర జంతువులపై శాస్త్రీయ అన్వేషణ జరిపే సంస్థ ఎక్కడుంది? 1) నాగ్‌పూర్ 2) గోవా 3) ఢిల్లీ 4) పుణే 36. లక్నోలో ఏ శాస్త్రీయ సంస్థలు ఉన్నాయి? 1) ఎన్బీఆర్ఐ, ఐఏఆర్ఐ 2) ఐఏఆర్ఐ, ఐఐఎస్ఆర్ 3) ఎన్బీఆర్ఐ, ఐఐఎస్ఆర్ 4) సీఐసీఆర్, సీఆర్ఆర్ఐ 37. ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నవారు? 1) లూయిపాశ్చర్ 2) రాబర్టహుక్ 3) సలీం అలీ 4) సి.వి.రామన్ 38. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫైకాలజీ? 1) అయ్యంగార్ 2) వెంకట్రామన్ 3) బీర్బల్ సహానీ 4) పంచానన్ మహేశ్వరి 39. పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది ఎవరు? 1) వాట్సన్, క్రిక్ 2) రొనాల్డ్ రాస్ 3) అరిస్టాటిల్ 4) విలియం హార్వే 40. ఖండాల కదలిక సిద్ధాంతాన్ని ప్రతి పాదించింది? 1) పంచానన్ మహేశ్వరి 2) బీర్బల్ సహానీ 3) ఎం.ఎస్. స్వామినాథన్ 4) లీవెన్‌హుక్ 41. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం? 1) ప్రజాతి 2) జాతి 3) కుటుంబం 4) తరగతి 42. {పతిరక్షకాలు దేన్ని సంహరిస్తాయి? 1) బ్యాక్టీరియా 2) మాస్ 3) జంతువులు 4) వృక్షాలు 43. రొనాల్డ్రాస్కు నోబెల్ బహుమతి లభించిన సంవత్సరం? 1) 1962 2) 1902 3) 1898 4) 1885 44. కిందివాటిలో రసాయన గ్రాహకాలు? 1) ఘ్రాణ, చర్మ 2) ఘ్రాణ, కాంతి 3) శ్రవణ, కాంతి 4) ఘ్రాణ, రుచి 45. ‘ఎల్లోస్పాట్’ని ఏమని పిలుస్తారు? 1) నేత్రచుక్క 2) అంధచుక్క 3) ఫోవియా 4) రాడ్యులా 46. నేత్రపటంలోని దండాలు, కోనుల నిష్పత్తి? 1) 1 : 1 2) 15 : 2 3) 15 : 1 4) 1 : 15 47. డెర్మటాలజీ ఏ జ్ఞానేంద్రియ అధ్యయనం? 1) కన్ను 2) చెవి 3) ముక్కు 4) చర్మం 48. మధ్య చెవిని, గ్రసనితో కలిపే నిర్మాణం? 1) అర్ధవర్తులకుల్య 2) యుస్టాచియన్ నాళం 3) కర్ణావర్తనం 4) కర్ణాంతరాస్థి 49. ఇచ్‌మైట్ శరీరంలో ఏర్పర్చే బొరియల ఆకారం? 1) a 2) 3) b 4) c 50. చర్మంలోని నాసిసెప్టారులు దేనికి సంబం ధించినవి? 1) పీడనం 2) స్పర్శ 3) నొప్పి 4) ఉష్ణోగ్రత 51. కెరాటిన్ దేనిలో ఉంటుంది? 1) గోళ్లు 2) రోమాలు 3) గిట్టలు 4) అన్నీ 52. ఏ జ్ఞానేంద్రియం ఉష్ణోగ్రతను క్రమ పరుస్తుంది? 1) ముక్కు 2) నాలుక 3) చర్మం 4) చెవి 53. నాలుకపై చేదు గ్రాహకాలు ఏ భాగంలో అమరి ఉంటాయి? 1) ముందరి 2) వెనుక 3) పార్శ్వ 4) మధ్య 54. మానవుని చెవిలోని అర్ధ్దవర్తుల కుల్యల సంఖ్య? 1) 2 2) 3 3) 5 4) 6 55. శిశు పక్షవాతాన్ని కలిగించే సూక్ష్మజీవి? 1) వైరస్ 2) ప్రోటోజోవన్ 3) బ్యాక్టీరియా 4) కీటకం 56. సజలీకరణ ద్రావణాన్ని ఏ బ్యాక్టీరియల్ వ్యాధి నివారణలో వాడతారు? 1) టైఫాయిడ్ 2) కలరా 3) క్షయ 4) కోరింత దగ్గు 57. బీసీజీ టీకాను ఏ వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు? 1) గవద బిళ్లలు 2) పోలియో 3) కుష్ఠు 4) క్షయ 58. ‘రూబియోలా’ అని పిలిచే వైరల్ వ్యాధి? 1) గవద బిళ్లలు 2) ఆటలమ్మ 3) పొంగు 4) పోలియో 59. ‘ఆపరేషన్ ఫ్లడ్’ వేటి ఉత్పత్తికి సంబం ధించింది? 1) పాలు 2) మాంసం 3) కోడి గుడ్లు 4) కోళ్లు 60. చేపకుంటను ఏ రుతువులో నిర్మించాలి? 1) వేసవి కాలం 2) వర్షాకాలం 3) శీతాకాలం 4) నిర్దిష్ట సమయం లేదు 61. కొబ్బరిలో వేరువిల్డ్ వ్యాధిని కలిగించేది? 1) బ్యాక్టీరియా 2) వైరస్ 3) శిలీంద్రం 4) కీటకం 62. మొక్కల్లో వ్యాధుల అధ్యయనాన్ని ఏమంటారు? 1) పైటో జాగ్రఫీ 2) పైటో పాథాలజీ 3) పైటోనిక్స్ 4) క్రయోజనిక్స్ 63. వైటిస్ వినిఫెరా ఏ మొక్క శాస్త్రీయ నామం? 1) నిమ్మ 2) ద్రాక్ష 3) బత్తాయి 4) నారింజ 64. చినీ, నిమ్మతోటల్లో వ్యాపించే వైరల్ వ్యాధి కానిది? 1) ట్రిస్టిజె 2) సిట్రస్ కాంకర్ 3) మొజాయిక్ 4) ఎల్లోకార్కీ వీన్ 65. హెర్బిసైడ్స వేటిని సంహరిస్తుంది? 1) ఎలుకలు 2) దోమలు 3) కలుపు మొక్కలు 4) సర్పాలు 66. వ్యాక్సినేషన్‌ను కనుగొన్న సంవత్సరం? 1) 1786 2) 1756 3) 1776 4) 1886 67. నీలి ఆకుపచ్చ శైవలాలు వేటిని పోలి ఉంటాయి? 1) వైరస్ 2) బ్యాక్టీరియా 3) శిలీంద్రాలు 4) జంతువులు 68. ఏ వ్యాధి తీవ్రతలో వరిపంట కాలిన మాదిరిగా కన్పిస్తుంది? 1) ఎండు తెగులు 2) అగ్గితెగులు 3) తెగులు బ్లాస్ట్ 4) కుంకుమ తెగులు 69. పెన్సిలిన్‌ను ఏ జీవుల నుంచి తయారు చేస్తారు? 1) శైవలాలు 2) శిలీంద్రాలు 3) కీటకాలు 4) వైరస్లు 70. గొంతుకు సంబంధించిన తీవ్రమైన బ్యాక్టీరి యల్ వ్యాధి? 1) కోరింత దగ్గు 2) క్షయ 3) డిప్తీరియా 4) హెపటైటిస్ 71. కిందివాటిలో ఎలుకల సంహారిణి? 1) డీడీటీ 2) జింక్ ఫాైస్ఫైడ్ 3) మలాథియాన్ 4) ఇథిలిన్ డైబ్రోమైడ్ 72. నేత్రపటలంలో రంగులను గుర్తించే కణాలు? 1) రాడ్స 2) కోన్స 3) 1, 2 4) అంధ చుక్క 73. అన్ని రకాల వాతావరణంలో నివసించే సూక్ష్మజీవులు? 1) ప్రోటోజోవా 2) శిలీంద్రాలు 3) బ్యాక్టీరియా 4) వైరస్ 74. బాహ్యచెవికి సంబంధించింది? 1) చెవిదొప్ప 2) కర్ణభేరి 3) బాహ్యశ్రవణ కుహరం 4) కర్ణాంతరాస్థి సమాధానాలు 1) 3; 2) 3; 3) 4; 4) 3; 5) 4; 6) 3; 7) 4; 8) 3; 9) 4; 10) 2; 11) 2; 12) 3; 13) 4; 14) 3; 15) 3; 16)1; 17) 4; 18) 3; 19) 3; 20) 3; 21) 3; 22) 3; 23) 2; 24) 2; 25) 3; 26) 2; 27) 3; 28) 3; 29) 2; 30) 3; 31) 1; 32)2; 33) 3; 34) 2; 35) 2; 36) 3; 37) 1; 38) 1; 39) 3; 40) 2; 41) 2; 42) 1; 43) 2; 44) 4; 45) 3; 46) 3; 47) 4; 48) 2; 49) 2; 50) 3; 51) 4; 52) 3; 53) 2; 54) 2; 55) 1; 56) 2; 57) 4; 58) 3; 59) 1; 60) 1; 61) 2; 62) 2; 63) 2; 64) 2; 65) 3; 66) 3; 67) 2; 68) 1; 69) 2; 70) 3; 71) 2; 72) 2; 73) 3; 74) 4; ఉద్యోగాలు డీఆర్డీవోలో సైంటిస్ట్‌లు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో), ఢిల్లీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ఏ సైంటిస్ట్ ‘ఎఫ్’ ఏ సైంటిస్ట్ ‘ఈ’ ఏ సైంటిస్ట్ ‘డి’ ఏ సైంటిస్ట్ ‘సి’ ఏ సెంటిస్ట్ ‘బి’ అర్హతలు: మొదటి శ్రేణిలో ఇంజనీరింగ్/టెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా సంబంధిత సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్. సైంటిస్ట్ ‘ఎఫ్’ 15 ఏళ్లు, సైంటిస్ట్ ‘ఈ’కు 10, సైంటిస్ట్ ‘డి’కు 7, సైంటిస్ట్ ‘సి’కు మూడేళ్ల అనుభవం ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 20 వెబ్సైట్: www.rac.gov.in మరిన్ని నోటిఫికేషన్ల కోసం www.sakshieducation.com చూడవచ్చు.