breaking news
park projects
-
వృద్ధులారా.. మీ స్ఫూర్తికి వందనం
ఎవరి సాయానికీ ఎదురు చూడలేదు సమష్టిగా సుందరనందనవన నిర్మాణం హుద్‌హుద్ పెకలించినా పునరుద్ధరణకు అందరూ ఒక్కటయ్యారు మురళీనగర్ వాకర్స్‌క్లబ్ సభ్యుల ఆదర్శం మురళీనగర్ : మురళీనగర్ వాకర్స్ క్లబ్ సభ్యులు ఎవరి సాయం కోసం ఎదురు చూడలేదు. చేతులు ముడుచుకు కూర్చోలేదు. తాము నారు, నీరు పోసి పెంచుకున్న పార్కును హుద్‌హుద్ తుపాను కకావికలం చేసినా కొండంత ధైర్యంతో పూర్వ వైభవం తెచ్చుకున్నారు. వృద్ధాప్యంలో కూడా పచ్చదనం పరవళ్లు తొక్కే విధంగా పార్కును తీర్చిదిద్దారు. సమైక్య కృషికి తార్కాణంగా వాకర్స్ పార్కును నందనవనంగా తీర్చిదిద్దిఆదర్శంగా నిలిచారు. క్లబ్లో 648మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 60ఏళ్లు దాటినవారే. వీరంతా చక్కని పార్కును నిర్మించుకున్నారు. దీని అభివృద్ధికి వీరు ప్రభుత్వాధికార్లు చూట్టూ ఎప్పుడూ తిరగ లేదు. వారే చందాలు వేసుకుని పార్కును అభివృద్ధి చేసుకుంటున్నారు. అందుకే వాకర్స్ పార్లు పచ్చదనంతో నిత్యం కళకళలాడుతుంది. 1997లో దీనిని అభివృద్ధి చేసిన తర్వాత మురళీనగర్‌లో మరో 8 పార్కులు ఏర్పాటయ్యాయి. వాకర్స్ పార్కు ఇతర పార్కులకు స్ఫూర్తిగా నిలిచింది. మొదట్లో జీవీఎంసి ప్రజా భాగస్వామ్య పద్ధతిలో రూ.2లక్షల50వేల నిధులతో అభివృద్ధి చేసింది. పచ్చదనం ఏర్పాటులో సభ్యులే కీలకంగా వ్యవహరించారు. ప్రతి సభ్యుడూ దాతే.. : సభ్యుల్లో ఎక్కువ మంది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పించనుదార్లు ఉన్నారు. వీరు ఇతోధిక సాయం చేస్తునే ఉంటారు. పార్కు అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రమాణం చేస్తారు. దీంతో ఇక్కడ పూర్తి సౌకర్యాల్ని క ల్పించుకోగలిగారు. ఇంతగా అభివృద్ధి చేసిన హుద్‌హుద్ తుపాను గత సెప్టెంబరులో పూర్తిగా నాశనం చేనపుడు వీరు కలత చెందారు. అంతలోనే కర్తవ్యం గుర్తుకు వచ్చి పార్కులో పూర్వ వైభవం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ప్రబుత్వం, స్వచ్చంద సంస్థల సాయంతో ఇక్కడ వ్యర్థాలను తొలగించడంతోపాటు వృక్షాలకు ప్రూనింగు చేయించారు. తర్వాత ఒక్కొక్కటిగా సౌకర్యాలు సమకూర్చుకున్నారు. భిన్నత్వం : ఏపార్కులోను లేని అరుదైన మొక్కలు ఇక్కడ మనం చూడవచ్చు. బోధి చెట్టు, మంచి గంధం, ఎర్రచందనం, రుద్రాక్ష, ఆల్బుకారా, బ్రెజిలియన్ రెయిన్‌ట్రీ వంటివి 20రకాల మ్కొలను ఇక్కడ చూడవచ్చు. మర్రి, జువ్వి, తురంతో, గన్నేరు, మర్రి, చింత తదితర 50ఏళ్ల వయజు కలిగిన బోన్సాయ్ మొక్కలు పెంచుతున్నారు. కార్తీక మాసంలో మహిళలు పూజలు చేసుకోవడానికి అశ్వద్ధ వృక్షం ఉంది. దీని చుట్టూ అరుగు కట్టి పూపజలకు ఏర్పాటు చేశారు. పచ్చదనం పరవళ్లు ఐదునెలల్లోనే పచ్చదనంతో అభివృద్ధి చేశారు. వాకి ంగు ట్రాకును బాగుచేశారు. ఇరువైపులా అందంగా పెంచి కోటన్స్ వనం ముచ్చట గొలిపే విధంగా దర్శనమిస్తోంది. పార్కులో ప్రవేశించిన వెంటనే కాసేపు కూర్చుని గాలి పీల్చాలనే ఉత్సుకత కలుగుతుంది. పౌంటెన్‌కు చుట్టూ అందమైన మొక్కలు పెంచారు. బుషెస్ కనువిందు చేస్తున్నాయి. సైకస్, ఫెర్న్ వంటి అనేక జాతుల మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. జూజలకు వినియోగించే పత్రాలకోసం జాజి, మారేడు, జమ్మి, మామిడి, జామ, ఉసిరిక, జిల్లేడు, తులసి, ఉమ్మెత్త, బదరీపత్రం మొక్కలు పెంచుతున్నారు. సాంస్క ృతిక వేదిక సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహహణకు వేదికను నిర్మించారు. కొద్దికాలంలోనే దీని పైకప్పు ఎగిరిపోవడంతో దీనిన పూర్తి స్థాయిలో సీలింగు చేసి పునరుద్ధరించుకున్నారు. కొత్తగా లైట్లు వేసి విద్యుత్ వెలుగుల నింపారు. సాయంత్రం సీనియర్ సిటిజన్స్ ఆత్మీయ కలయిక కోసం ఫ్యాన్లు, కుర్చీలు సమకూర్చారు. బెంచీలు ఏర్పాటు చేసుకున్నారు. నిరంతం భక్తి సంగీతాన్ని వినిపించి ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తీసుకురావాలని మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వీరి పనులకు ముగ్దులైన జీవీఎంసి అధికార్లు స్పందించి రూ.2.30లక్షలతో ప్రహరీ గోడను మరమ్మతు చేసి రంగులు వేయించారు. పూర్వ అధ్యక్షుడు మ్యూజిక్సిస్టమ్ను బాగు చేశారు. దీనికి రూ.12వేలు ఖర్చు చేశారు. సర్కులర్ స్వింగ్, ఊయల వంటి ఆటపరికరాలు బాగు చేయించారు. పూర్వ అధ్యక్షుడు ఆర్.సత్యనాథం రీడింగు రూం నిర్మించారు. -
కీలక ప్రాజెక్టులన్నీ హుష్‌కాకి
‘మహా’ గడ్డుకాలం =కదలిక లేని బస్సు టెర్మినల్, ట్రక్ పార్కు ప్రాజెక్టులు =రాజకీయ అనిశ్చితీ కారణమే.. =కలిసిరాని హెచ్ఎండీఏ ప్రయత్నాలు =సొంత ఆదాయ మార్గాలకు గండి సాక్షి, సిటీబ్యూరో: ఆ రెండూ అత్యంత కీలకమైన ప్రాజెక్టులు.. అవి సాకారమైతే నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే రాజధానిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉండేది. ప్రారంభంలో ఆర్భాటంగా ప్రకటించిన ఇవి ప్రస్తుతం కాగితపు ప్రాజెక్టులుగా మిగిలిపోనున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే నగరం రూపురేఖలే మారిపోతాయని చెప్పిన హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ).. ఇప్పుడు ప్రాజెక్టుల్లో కదలిక తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ కలిసిరావట్లేదు. నెహ్రూ ఔటర్ రింగ్‌రోడ్డు, పీవీ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే (ర్యాంపులు) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉండగా, కొత్తగా తలపెట్టిన పీపీపీ ప్రాజెక్టులు సైతం ఆగిపోయాయి. ఎలాగోలా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకొనేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలకు ప్రస్తుత రాజకీయ అనిశ్చితి గండికొట్టింది. ఫలితంగా పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులన్నీ అటకెక్కాయి. మియాపూర్‌లో భారీ బస్సు టెర్మినల్, ఔటర్ రింగ్‌రోడ్డుకు చేరువలో లాజిస్టిక్ పార్కులు నిర్మించాలనే యోచన కార్యరూపం దాల్చి ఉంటే హెచ్ఎండీఏకు ఆర్థికంగా ఉపశమనం కలిగేది. కానీ రెండేళ్లుగా ఇవి పట్టాలపైకి ఎక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న తరుణంలో రాష్ట్ర విభజన అంశం తెరపైకి రావడంతో కాంట్రాక్టు సంస్థలు వెనకడుగు వేసినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి కూడా ఉలుకుపలుకు లేకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టులు నిలిచిపోయినట్లేనని హెచ్ఎండీఏ ఓ నిర్ణయానికి వచ్చింది. బస్సు టెర్మినల్ తుస్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రణకు శివారులోని మియాపూర్‌లో 50 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో హెచ్ఎండీఏ భారీ బస్సు టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళిక రచించింది. రెండేళ్ల క్రితమే ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. సొంతంగా నిధులు వెచ్చించే పని లేకుండా హెచ్ఎండీఏ ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో నిర్మించేందుకు టెండర్ ప్రక్రియను పూర్తి చేసింది. అయితే, వివిధ ప్రభుత్వ విభాగాల అనుమతులు రావాల్సి ఉందంటూ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో మొదటికే ఎసరొచ్చింది. ప్రాజెక్టు విషయమై మొదట్లో ఏపీఐడీఈ నుంచి అనుమతి పొందిన అధికారులు ఆపై న్యాయ, ఆర్థిక శాఖల నుంచీ ఆమోదం పొందారు. అనంతరం మున్సిపల్ పరిపాలన, పట్టణాభి వృద్ధి శాఖల నుంచి తుది అనుమతి మంజూ రులో జాప్యం జరిగింది. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్ కూడా ఆసక్తి చూపకపోవడంతో భారీ బస్సు టెర్మినల్ ప్రాజెక్టు ఇక అటకెక్కినట్టుగానే కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చి ఉంటే.. నగరంపై తీవ్ర ట్రాఫిక్ ఒత్తిడి తగ్గేది. అతీగతీ లేని ట్రక్ పార్కు ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణించే రవాణా వాహనాలను నిలుపుకొనేందుకు వీలుగా బాట సింగారం, మంగళపల్లిలో నిర్మించ తలపెట్టిన లాజిస్టిక్ హబ్స్ (ట్రక్ పార్కులు) ప్రాజెక్టుకూ కాలం చెల్లినట్లు తెలుస్తోంది. పీపీపీ విధానంలో నిర్మించేందుకు వీటికి టెండర్లు ఖరారైనా ఇంతవరకు అతీగతీ లేదు. ఔటర్‌పై తిరిగే వాహనాలకు ఇది అత్యంత ప్రధానమైన ప్రాజె క్టు అయినప్పటికీ రాష్ట్ర విభజన ప్రకంపనలతో కాంట్రాక్టు సంస్థలు నిరాసక్తత చూపుతున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు ఏదోలా కాంట్రాక్టు సంస్థలపై వత్తిడి తెచ్చి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు. కానీ ప్రాజెక్టు ఆదాయ వ్యయాలను లెక్కించుకొన్న ఆయా సంస్థలు తాము చెల్లిం చిన ఈఎండీని వదులుకొనేందుకు సైతం సిద్ధపడినట్లు తెలుస్తోంది.