breaking news
opposation
-
Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా?
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెలీల ఆక్రోశం, ఆక్రందనలు క్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని పీఠానికి ఎసరు పెట్టేలా కని్పస్తున్నాయి. హమాస్ చెరనుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా ఆగస్టు 31న ఆరుగురు బందీలను గాజాలో ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చడంతో ఇజ్రాయెలీలు భగ్గుమంటున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని స్తంభింపజేశారు. నెతన్యాహూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కోర్టు జోక్యం చేసుకుంటే గానీ వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహూ రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెడతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి తెగబడ్డ హమాస్ 1,200 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే గాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఖైదీల మారి్పడి కింద 100 మందిని విడిపించారు. 35 మందికి పైగా చనిపోయినట్టు భావిస్తుండగా 100 మందికి పైగా ఇంకా హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. వాళ్లను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడం, ఆరుగురు బందీలను హమాస్ చంపేయడం తెలిసిందే. దీనిపై ఇజ్రాయేలీల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌లో అతిపెద్ద కార్మిక సంఘం హిస్ట్రాడుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఓడరేవులనూ మూసివేశారు. నిరసనలు సాయంత్రం దాకా కొనసాగాయి. నిరసనకారులు నెతన్యాహూ నివాసాన్ని కూడా ముట్టించారు. అమెరికా ఎంబసీ ముందు బైఠాయించారు. అయలాన్ హైవేను దిగ్బంధించారు. దాంతో వారిపైకి పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెల్ అవీవ్‌లో 29 మందిని అరెస్టు చేశారు. చివరికి లేబర్ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. ఇజ్రాయెలీల నిరసనల వెల్లువను తట్టుకుని నిలవడం నెతన్యాహూకు కష్టమేనంటున్నారు.పెరుగుతున్న వ్యతిరేకత.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్న నెతన్యా హు వైఖరిపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నా యి. ఇజ్రాయెల్ విపక్ష నేత యైర్ లాపిడ్ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకున్న, తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత కేబినెట్లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదు ర్చుకోవడం కంటే కారిడార్ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండటం సరికాదని రక్షణ మంత్రి యెవ్ గాలెంట్ బాహాటంగానే విమర్శించారు. దీన్ని ‘నైతికంగా అవమానం’గా అభివరి్ణంచారు. బందీల ఒ ప్పందంపై గానీ, కాల్పుల విరమణపై గానీ నెత న్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్ మాజీ రాయబారి, ప్రభుత్వ సలహాదారు అలోన్ పింకస్ ఆరోపించారు. ‘‘ఆశ్చర్యంగా అని్పంచినా ఇదే నిజం. ఒప్పందానికి నెతన్యాహూ విముఖత వల్లే బందీలు బలవుతున్నారు’’ అని మండిపడ్డారు.తగ్గుతున్న మద్దతు..మరోవైపు నెతన్యాహుకు మద్దతు కూడా నానాటికీ తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు గత శుక్రవారం ఛానెల్ 12 చేసిన సర్వేలో తేలింది. ఆయన మళ్లీ పోటీ చేయొద్దని 69 శాతం పేర్కొనగా కేవలం 22 శాతం మంది మాత్రమే మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుతున్నారు.నిత్యం నిరసనలే..ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహూ నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటినుంచీ దేశంలో తరచూ నిరసనలూ, ఆందోళనలూ కొనసాగుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కత్తెర వేసేందుకు ఉద్దేశించిన న్యాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడాది కింద జనం భారీగా రోడ్డెక్కారు. చివరికి ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక హమాస్ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహూ ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్ నుంచి రాజధాని మొదలుకుని దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహూపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం తదితర అభియోగాలపై విచారణలు కోర్టుల్లో పలు దశల్లో ఉన్నాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు..ఇజ్రాయెల్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుంది. ఆలోపు నెతన్యాహూపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం ఐదుగురు పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరం.నెతన్యాహు.. తగ్గేదేలే..నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహూ తోసిపుచ్చారు. ‘‘ఆరుగురు బందీలను ఉరి తీశారు. అయినా కసి తీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా?’’ అని ప్రధాని ప్రశి్నస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ససేమిరా అంటున్నారు.దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలన్న హమాస్ డిమాండ్‌కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహూ, యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్‌పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘‘ఈ విషయంలో నాకంటే నిబద్ధత కలిగిన వారెవరూ లేరు. దీనిపై నాకెవరూ ఉపన్యాసం ఇవ్వనక్కరలేదు’’ అన్నారు! -
ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం ఆపాలి : సీ.రామచంద్రయ్య
-
మోటారు వాహనాల చట్టం 2019 అమలుపై వ్యతిరేకత
-
నితీష్ కుమార్ ఓటెవరికి?
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతును కూడగట్టడంలో విజయం సాధిస్తాయా? అన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. ప్రతిపక్షాల ఐక్యతకు గత ఏప్రిల్ నెలలోనే అన్నీ తానై చొరవ తీసుకున్న నితీష్ కుమార్ తమతో చేతులు కలుపుతారనే ఆశ ప్రతిపక్షాలకు లేకపోలేదు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనే నితీష్ కుమార్ కలసివస్తారని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆశించాయి. ఆయన అనూహ్యంగా ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకపోవడం, అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీతో విందు సమావేశంలో పాల్గొనడం విపక్ష పార్టీలను విభ్రమపర్చాయి. అనుమానించినట్లుగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నోథ్ కోవింద్‌ను బలపర్చి ప్రతిపక్ష పార్టీలను నితీష్ కుమార్ నిరాశ పర్చారు. అలాగే రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం మంగళవారం జరిగిన విపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ ఎగనామంపెట్టి ఇప్పుడు కూడా అనుమానం బీజాలు నాటారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా లౌకికభావాలు కట్టుబడి రాజకీయవేత్తగా రాణించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రధాని మోదీ పక్షాన చేరాల్సిన అవసరమే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపితే దాన్ని ఇబ్బందికర పరిణామంగా భావించి లాలూతో నితీష్ తెగతెంపులు చేసుకుంటారని బీజేపీ పెద్ద నేతలు ఆశించి ఉండవచ్చు. దర్యాప్తు దశలో లాలూతో సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం నితీష్‌కు లేదు. ఎందుకంటే అంతకంటే అపకీర్తి కలిగిన నేతల మద్దతుతో నితీష్ ప్రభుత్వ పాలన సాగించిన రోజులు ఉన్నాయి. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ముద్రపడిన సూరజ్ భాన్ సింగ్ లాంటి వారి మద్దతుతోనే ఆయన ప్రభుత్వాని నిలబెట్టుకున్నారు. 1989లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముఖ్యకారకుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్. ఆయనే అన్ని విపక్షాలను ఏకం చేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి మహత్తర పాత్రను నిర్వహించే అవకాశం నితీష్ కుమార్‌కు వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా? 1966లో జ్యోతిబసు ప్రధాన మంత్రయ్యే అవకాశాన్ని వదులుకొని చారిత్రక తప్పిదం చేశామంటూ పశ్చాత్తామం పడతారా? అన్నది నితీష్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.