breaking news
oldageman
-
కల్పనా? నిజమా?
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటిస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ కలవని కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఏం జరుగుతుంది? అనే కాల్పనిక కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఫిక్షన్ సినిమాకి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. సినిమాలో ఎన్టీఆర్ వృద్ధునిగానూ కనిపించనున్నారని సమాచారం. అయితే కొమురం భీమ్ చిన్న వయసులోనే మరణించారు. అయితే ఇది కాల్పనిక కథ కాబట్టి ఎన్టీఆర్కి ఓల్డ్ గెటప్ పెట్టి ఉంటారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ పాత్ర కోసం ‘ప్రోస్థటిక్’ మేకప్ వాడాలనుకుంటున్నారట. మరి.. ఈ పాత్ర ఉందన్నది ఫిల్మ్ నగర్ కల్పనా? నిజమా? ట్రిపుల్ ఆర్లో ఎన్టీఆర్ రెండు గెటప్పుల్లో కనబడతారా? వెయిట్ అండ్ సీ. -
థ్యాంక్యూ పోలీస్ అన్నా
డాబాగార్డెన్స్: మానవత్వం వెల్లివిరిసింది. మన చుట్టూ జరిగే పరిణామాలు..ప్రమాదాలు..అనుకోని సంఘటనలు జరిగితే మనకెందుకులే అన్న ఈ రోజుల్లో కూడా మానవత్వం ఉందని ఆ పోలీసులు నిరూపించారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసుల కళ్లెదుటే ఓ వృద్ధుడు బట్టల్లేక..వర్షంలో నానుతూ..చలికి వణుకుతూ రోడ్డు మధ్యలోనే నిస్సహాయిడిగా కనిపించాడు. ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ వృద్ధుడు వద్దకు వెళ్లి పేరు..ఊరు..చిరునామా..వివరాలు అడిగారు. మాట కూడా సరిగ్గా రాకపోవడాన్ని వారు గమనించారు. ముందుగా ఓ ఆటోను పిలిచి ఆ ఆటోపై అడడ్ని కూర్చోబెట్టి సమీపంలో ఉన్న ఓ బస్షెల్టర్కు తీసుకెళ్లి..అనంతరం వద్ధాశ్రమానికి అప్పజెప్పారు.