new window
-
పహల్గాం ఘటన: ఎల్ఐసీ కీలక ప్రకటన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాత బాధితుల కుటుంబాలకు అండగా నిలబడటానికి.. త్వరితగతిన డెత్ క్లెయిమ్ పరిష్కారాలను అందించడానికి 'లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' (LIC) ఓ స్పెషల్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చింది."పహల్గాంలో అమాయక పౌరుల మరణం పట్ల ఎల్ఐసి ఆఫ్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. మరణించిన వారి డెత్ క్లెయిమ్‌ను వీలైనంత త్వరగా పరిష్కరించడానికి ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబానికి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అండగా నిలుస్తుంది" అని ఎల్ఐసి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సిద్ధార్థ మొహంతి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉందని క్లెయిమ్‌దారులు తప్పకుండా గమనించాలి. ఈ ప్రక్రియను ప్రారంభించడానికి, నామినీ అవసరమైన అన్ని పత్రాలను తీసుకొని పాలసీని జారీ చేసిన ఎల్ఐసీ శాఖను సంప్రదించాలి. పాలసీ ప్రీమియంలు రెగ్యులర్‌గా చెల్లించి ఉంటే లేదా గ్రేస్ పీరియడ్లోపు మరణం సంభవించినట్లయితే క్లెయిమ్ సెటిల్మెంట్కు అర్హత ఉంటుంది.క్లెయిమ్ ప్రాసెస్➤నామినీ అవసరమైన పత్రాలతో.. పాలసీ జారీ చేసిన ఎల్ఐసీ బ్రాంచ్‌ను సంప్రదించాలి.➤పాలసీ నంబర్, తేదీ, మరణించడానికి కారణం వంటి వివరాలతో LIC సర్వీసింగ్ బ్రాంచ్‌కు లిఖితపూర్వకంగా తెలియజేయాలి.➤నామినీదారునికి, మరణించిన వ్యక్తికి గల సంబంధాన్ని తెలియజేయడానికి ఫారమ్ Aను సబ్మిట్ చేయాలి.➤అధికారిక మరణ ధ్రువీకరణ పత్రంగా.. స్థానిక మరణ రిజిస్టర్ నుంచి ధ్రువీకరించిన పత్రాలను సమర్పించాలి. వయస్సు ధ్రువీకరణ కోసం ఆధార్ లేదా పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.➤మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీదారు మరణించినట్లు ప్రభుత్వ రికార్డులలో ఉన్న ఏవైనా ఆధారాలు లేదా కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించిన ఏదైనా పరిహారం వంటివి పాలసీదారు మరణించినట్లు నిర్దారించడానికి ఉపయోగపడతాయి.➤వీటన్నింటినీ.. పరిశీలించి ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్ చేస్తుంది.ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే.. -
ఆ నోట్ల డిపాజిట్‌కు అవకాశమివ్వం
సాక్షి, న్యూఢిల్లీ : రద్దు అయిన పెద్ద నోట్లు రూ.500, రూ.1000 డిపాజిట్‌కు మరో కొత్త విండో తెరిచే ఉద్దేశ్యమేమీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టీకరించింది. ఈ నోట్ల డిపాజిట్‌కు అసలు అవకాశమివ్వబోమని తేల్చి చెప్పింది. ఆర్బీఐ తాజాగా రద్దయిన పెద్ద నోట్ల గణాంకాలు విడుదల చేయడంతో, తిరిగి రాని నోట్ల కోసం మరోసారి ఓ విండో తెరవాలంటూ కొంతమంది కోరుతున్నారు. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం ఈ నోట్లను రద్దు చేసింది. అనంతరం పలు గడువులు విధించిన ప్రభుత్వం, వీటిని తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి తీసుకుంది. బుధవారం వెల్లడించిన ఆర్బీఐ వార్షిక రిపోర్టులో రద్దయిన పెద్ద నోట్లు దాదాపు అన్ని తమ వద్దకు వచ్చినట్టు తెలిపింది. 99 శాతం కరెన్సీ నోట్లు ఆర్బీఐ వద్ద జమయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొంతమంది పాత రూ.500, రూ.1000 నోట్ల డిపాజిట్ కోసం ఓ కొత్త విండో తెరవాలని కోరుతున్నారు. అయితే ఈ సమయంలో ఎట్టిపరిస్థితులోనూ పాత నోట్ల డిపాజిట్‌కు కొత్త విండో తెరవడం కుదరదంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్.సి గర్గ్ చెప్పారు. ఇదే విషయాన్ని అంతకముందు ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు కూడా తెలిపింది. సహేతుక కారణాలు చూపించే వారికోసం పాత నోట్ల డిపాజిట్‌కు ఓ విండో తెరవాలని సుప్రీంకోర్టు సూచించింది. కానీ ఇప్పుడు విండో తెరిస్తే, అది దుర్వినియోగం పాలయ్యే అవకాశముందని, అంతేకాక డీమానిటైజేషన్ ఉద్దేశ్యమే మారిపోతుందని ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆర్బీఐ ప్రకటన అనంతరం రద్దయిన నోట్లన్నీ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చాయని భావిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. అంచనావేసినంత తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చిందని తాను భావిస్తున్నట్టు గర్గ్ చెప్పారు. ఎంతమంది ఎన్ని అంచనాలు విడుదల చేస్తున్నప్పటికీ, వెనక్కి రాని కరెన్సీ అంచనాల గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదన్నారు.