breaking news
new batches
-
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
22 నుంచి స్పోకెన్ ఇంగ్లిష్ బ్యాచ్‌లు
- సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో 30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గంగా మాట్లాడేందుకు ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్‌లు జూన్ 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 30 రోజుల ఈ కోర్సులో ఆంగ్లంలో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితరాలను క్షుణ్నంగా నేర్పుతారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు తరగతులు ఉంటా యి. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఫీజు రూ.4,600. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600, నంబర్లలో గానీ, sakshiedge@gm ail.com మెయిల్ ద్వారా గానీ ‘సాక్షి ఎడ్జ్, 8-2.696, కార్మెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్’ చిరునామాలో గానీ సంప్రదించవచ్చు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతాయి.