breaking news
Nationalist Congress Party president
-
‘మహా’ రాజకీయాల్లో మరో మలుపు.. శరద్ పవార్ సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో అధికార మార్పిడితో రాజకీయాలు వేడెక్కిన వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీలోని అన్ని విభాగాలు, సెల్స్‌ను రద్దు చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ పటేల్ ట్వీట్ చేశారు. ‘ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఆమోదంతో తక్షణమే అన్ని విభాగాలు, సెల్స్ రద్దయ్యాయి.’ అని పేర్కొన్నారు. అయితే.. నేషనలిస్ట్ మహిళా కాంగ్రెస్, నేషనలిస్ట్ యువ కాంగ్రెస్, నేషనలిస్ట్ విద్యార్థి కాంగ్రెస్‌లను మినహాయించినట్లు చెప్పారు. With the approval of our National President Hon'ble Shri Sharad Pawar Saheb, all the National level Departments and Cells of @NCPspeaks excluding Nationalist Women's Congress, Nationalist Youth Congress and Nationalist Students Congress stand dissolved with immediate effect. — Praful Patel (@praful_patel) July 20, 2022 అయితే.. పార్టీలో ఆకస్మికంగా తీసుకున్న ఈ నిర్ణయం వెనక గల కారణాలను వెల్లడించలేదు కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోయిన కొన్ని రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. శివసేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఎన్సీపీ కీలక భూమిక పోషించింది. శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో వారి ప్రభుత్వం కూలిపోయింది. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ రాష్ట్రంలో ఇంకా రాజకీయ వేడి తగ్గలేదు. ఇదీ చదవండి: శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ -
రజనీకాంత్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మోడీ ఆకాంక్షించారు. భారత చలన చిత్ర పరిశ్రమలో రజనీ కాంత్ తనదైన ముద్ర వేసుకున్నారని మోదీ ప్రశంసించారు. శుక్రవారం రజనీకాంత్ 63వ జన్మదినోత్సవం. ఆయన నటించిన లింగ ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు కూడా ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుక్రవారం రజనీ,శరద్ పవార్లకు ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల శరద్ పవార్ ఇంట్లో జారి పడి... కాలికి తీవ్ర గాయమైంది. దాంతో ఆయన కాలికి ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం శరద్ పవార్ ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న విషయం విదితమే.