breaking news
Morari Bapu
-
ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్
లండన్: భారత్ దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాణ్ని పురస్కరించుకుని వేడుకల్లో మునిగిన వేళ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ నేను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ మొరారి బాపు మాట్లాడుతూ.. ఒక సాధారణ వ్యక్తిలా రిషి గారు ఇక్కడికి వచ్చారు. మీకు నా ప్రేమ పూర్వక స్వాగతం. దేవుడి ఆశీస్సులు మీపైనా బ్రిటీష్ ప్రజలపైనా మెండుగా ఉంటాయని ఆశీర్వదిస్తూ ప్రధానికి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరుగుతున్న మొరారి బాపు రామ కథా కార్యక్రమానికి హాజరుకావడం గౌరవం గానూ సంతోషంగానూ భావిస్తున్నానని, ఈరోజు ఇక్కడికి ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా వచ్చినట్లు తెలిపారు. మత విశ్వాసమనేది వ్యక్తిగతమైనది. నా జీవితంలో ఆ విశ్వాసమే నాకు తోడుండి నడిపిస్తోంది. ఒక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ఏమంత సులువు కాదు. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఆ నమ్మకమే నాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తోందని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుడు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్బంగా రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి అక్కడ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తూ ఉండేవాళ్లమని అన్నారు. తాము కూడా సాంప్రదాయ హిందూ కుటుంబం లాగే హోమయజ్ఞాది పూజలను నిర్వహించేవారమని తెలిపారు. మా సోదరులు, సోదరీమణులతో కలిసి అన్న ప్రసాదాలను కూడా వడ్డించేవాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు బాపు జీవితం విలువలతో కూడుకున్నదని ఆయన భక్తి, నిస్వార్ధమైన సేవాతత్వ దృక్పధం అందరికీ మార్గదర్శకమని అన్నారు. బాపు గారు చెప్పిన రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ వెళ్తున్నానని జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయపూర్వక పరిపాలనతో నిస్వార్దమైన సేవలందించడంలో శ్రీరామచంద్రుడే నాకు స్ఫూర్తి అని సునాక్ చెప్పారు. ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి -
భజనలకొచ్చేవారు రేప్‌లు చేయరు
పనాజీ: దైవ ప్రసంగాలకు హాజరు కావడం ద్వారా మహిళలపై దాడులు, అత్యాచారాలను నివారించవచ్చని గుజరాత్‌కు చెందిన మత ప్రబోధకుడు మోరారీ బాపు అన్నాడు. అదొక్కటే ఇలాంటి నేరాలను నివారించగల సర్వమార్గమని చెప్పారు. ప్రస్తుతం గోవాలో ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయన మాట్లాడుతూ దైవ భజనలకు, ప్రసంగ కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లు లైంగికదాడులకు, వేధింపులకు పాల్పడరని చెప్పారు. అందుకు ప్రధాన కారణం వారి పరిజ్ఞానం విస్తృతమవ్వడమేనని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అన్యాయాలకు, వేధింపులకు, లైంగికదాడులకు ఒక మహిళ శరీరం వస్తువుగా మారకూడదని, పురుషుల ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. భజనలకు రావడం ద్వారా ఆ పరిస్థితి మారుతుందని చెప్పారు. తనకు ప్రధాని నరేంద్రమోదీ అంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయన.. ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మోక్షాన్నివ్వకుండా ఎందుకు చట్టప్రతినిధులు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.