breaking news
Money loan waiver
-
అమెజాన్ ప్రొడక్ట్స్ పేరుతో భారీ మోసం
ఇటీవల ఆన్లైన్ లో మోసం పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే ఆన్లైన్ లోన్ యాప్స్ పేరిట మోసాలు పెరిగిపోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆన్లైన్ లోన్ యాప్స్ గురుంచి పోలిసులతో పాటు ఆర్బీఐ కూడా ప్రజలను హెచ్చరించింది. లోన్ యాప్స్ తో పాటు ఇతర యాప్స్ మీద పోలీసులు సెర్చ్ ఆపరేషన్ పెట్టడంతో చాలా ఫ్రాడ్ యాప్స్ ఈ నెల 21 నుంచి తమ యాక్టివిటీని నిలిపివేశాయి. అయితే ఇవన్నీ మరవక ముందే మరో స్కామ్ బయటపడింది. ఆన్లైన్ లో జోరుగా కొనసాగుతున్న"బర్స్ మనీ యాప్" ఫ్రాడ్ పై ఇటీవల సైబర్ పోర్టల్స్, సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతుంది. దీనిలో డబ్బులు పెట్టుబడి పెట్టిన భాదితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రొడక్ట్స్ క్లిక్ చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు: ఆన్లైన్ లో అమెజాన్ కి సంబందించిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు సంపాందించవచ్చు అంటూ బల్క్ ఎస్ఎంఎస్లు, యాప్ లింక్స్ పంపిస్తున్నారు. అయితే, ఎవరైతే దీనిలో జాయిన్ కావాలని అనుకుంటున్నారో వారు కొత్త మొత్తంలో నగదు మాత్రం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అమెజాన్ వెబ్పేజ్తో వివిధ రకాల ప్రొడక్ట్స్ ను డిస్ ప్లే చేస్తున్నారు. బక్కెట్ సిస్టమ్ పేరుతో రీచార్జ్(ఇన్వెస్ట్ మెంట్) ఆప్షన్స్ కూడా తీసుకొచ్చారు. మీరు ఎంచుకున్న ప్లాన్ ప్రకారం వాటిని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు క్లిక్ చేసిన ద్వారా వచ్చిన డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి కొంత అమౌంట్ ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా కొన్ని రోజుల పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది ఈ యాప్ అమెజాన్ కి సంబంధించింది అని భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. ఇందులో ఉండే నాలుగు ఎ,బి,సి,డి అనే ఆప్షన్స్ ద్వారా ప్రతిరోజు 5-35 శాతం వరకు క్యాష్ విత్డ్రాల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇందులో ఎవరైతే డబ్బులు డిపాజిట్ చేస్తారో వారి డబ్బు యాప్ నిర్వాహకుల దగ్గరే ఉంటుంది. ఇందులో డిపాజిట్ చేస్తేనే డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేల మీరు డిపాజిట్ చేసిన నగదును ఉపసంహరించుకుంటే ఎలాంటి డబ్బులను సంపాదించు కోవడానికి అవకాశం ఉండదు. ఇందులో కమిషన్ ద్వారా వచ్చిన నగదును మాత్రమే మీ అకౌంట్ లోకి జమ అవుతుంది. యాప్లో పెట్టుబడి పెట్టిన వారికి గ్రాబ్ ఆర్డర్స్, పర్చేస్ కింద మనీ యాడ్ అవుతుంది. రూ. 5000 పెట్టుబడి పెట్టిన వారు 30 ఆర్డర్స్ చేస్తే ప్రతిరోజూ 400 రూపాయలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ ఇందులో జీఎస్టీ పేరుతో 18 శాతం కట్ చేస్తారు. ఇలా ప్రతి ఒక్కరి నుండి డబ్బులు పెట్టుబడి పెట్టేలా చేసి తర్వాత మోసం చేస్తున్నట్లు భాదితులు చెప్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో బర్స్ యాప్ దందా జోరుగా కొనసాగుతుంది. ఇప్పటికే చాల మంది ఇందులో రూ.100 నుంచి రూ.లక్షా 80 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది. పనిచేయని విత్డ్రాల్ ఆప్షన్స్ తాజాగా ఈ నెల నుంచి బర్స్ యాప్లో రీచార్జ్, విత్డ్రాల్ ఆప్షన్స్ పనిచేస్తలేవని బాధితులు చెప్తున్నారు. వారు డిపాజిట్ చేసిన కూడా తిరిగి పొందలేకపోతున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో చాలా మంది బాధితులు భయాందోళనకు గురౌతున్నారు. ఇంకో ముఖ్యవిషయం ఏమిటంటే ఈ యాప్ నిర్వాహుకుల అడ్రస్ లేకపోవడం అందరిని భయానికి గురిచేస్తుంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇలా జరుగుతుందని యాప్ నిర్వాహకులు యాప్ లో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బర్స్ యాప్ కాల్ సెంటర్స్ కి ఫోన్ చేస్తే సరైన స్పందన లేదని భాదితులు ఆరోపిస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేసి సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు కూడా మోస పోయినట్లు తెలుపుతున్నారు. -
అంతా మా ఇష్టం!
- రెన్యువల్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు - చేసుకోని వారి ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకర్ల నిరాకరణ - వడ్డీ చెల్లింపు విషయంలో స్పష్టత లేకపోవటమే కారణం పరిగి: మేం మోనార్కులం.. ఎవరి మాటా వినం.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు బ్యాంకర్లు. రెండోవిడత రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం బ్యాంకులకు అందజేసినా.. అవి రైతుల ఖాతాల్లో బ్యాంక్ అధికారులు జమ చేయటంలేదు. రెన్యువల్ చేసుకున్న రైతుల ఖాతాల్లోనే రుణమాఫీ డబ్బులు జమచేసి చేతులు దులుపుకొంటున్నారు. రెన్యువల్ చేసుకోని రైతులకు సంబంధించిన డబ్బులు బ్యాం కుల్లోనే ఉంచుకుని వాటితో జమయ్యే వడ్డీతో బ్యాంకర్లు తమ వ్యాపారాలు వెలగబెట్టుకుంటున్నారు. విషయాన్ని పసిగట్టిన కలెక్టర్ వెంటనే రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు జమయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆయా మండలాల ప్రత్యేకాధికారులను ఆదేశించారు. ఏయే బ్యాంకులకు ప్రభుత్వం ఎన్ని డబ్బులు జమచేసింది. ఆయా బ్యాంకులు రైతుల ఖాతాల్లో ఎన్ని డబ్బులు జమచేశాయి. ఇంకా ఎన్ని డబ్బులు ఖాతాల్లో మూలుగుతున్నాయనే విషయంలో తనకు వెంటనే నివేదిక సమర్పించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన ప్రత్యేకాధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకుల నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇదే సమయంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చే యాలని వ్యవసాయ శాఖ అధికారులు బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటంలేదు. రెన్యువల్ చేసుకున్నప్పుడే ఖాతాల్లో జమచేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. 25 రోజులైనా.. 30 శాతంలోపే.. ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ డబ్బులు విడుదల చేసి 25 రోజులు కావస్తోంది. 25 రోజుల క్రితమే అన్ని బ్యాంకుల్లో రెండో రుణమాఫీకి సంబంధించి 12.5 శాతం నిధులు ప్రభుత్వం జమ చేసింది. ఇదే సమయంలో మరో 12.5 శాతం నిధులు త్వరలో బ్యాంకులకు ఇస్తాం. వాటిని కూడా రైతుల ఖాతాల్లో జమచేయాలని సూచించింది. అయితే బ్యాంకర్లు ఇవేవీ పట్టించుకోకుండా అసలుకే ఎసరు పెట్టారు. ఇప్పటికే బ్యాంకుల్లో ప్రభుత్వం జమ చేసిన 12.5 శాతం నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయకుండా తమ ఖాతాల్లోనే ఉంచుకున్నారు. ఇప్పటి వరకు పంట రుణాలు రెన్యువల్ చేసుకున్న 30శాతంలోపు రైతులకు మాత్రమే ఖాతాల్లో జమ చేసి ఊరుకున్నారు. పరిగి వ్యవసాయ డివిజన్లోని నాలుగు మండలాలకు చెందిన బ్యాంకుల్లో ప్రభుత్వం 25 రోజుల క్రితం రూ.22.89 కోట్లు జమ చేయగా ఇప్పటి (బుధవారం) వరకు రూ.7.35 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమచేశారు. మొత్తం 41,651 మందికి రుణమాఫీ జమచేయగా 14,337 మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి. ఈ విషయమై వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నగేష్కుమార్ను వివరణ కోరగా.. విడుదల చేసిన డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమచేయాలని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ బ్యాంకు అధికారులు మాత్రం రెన్యువల్ చేసుకున్న వారి కాతాల్లోనే జమ చేస్తున్నారని తెలిపారు. రైతులంతా రెన్యువల్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.