breaking news
Mohammed Hussain
-
పాక్ మాజీ క్రికెటర్ అకాల మరణం.. పీసీబీ దిగ్భ్రాంతి
Former Pakistan Spinner Mohammad Hussain Passed Away: పాకిస్థాన్ క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. 45 ఏళ్ల వయసులో ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్ కూడా అయిన హుస్సేన్.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. హుస్సేన్ అకాల మరణంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ.. హుస్సేన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. The PCB is saddened by the passing of former Pakistan Test all-rounder Mohammad Hussain and offers its sincerest condolences to his family and friends. pic.twitter.com/f4q4zSUiXj — Pakistan Cricket (@TheRealPCB) April 11, 2022 లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్, లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ అయిన మహ్మద్ హుస్సేన్ 1996-98 మధ్యలో పాకిస్థాన్ తరఫున 2 టెస్ట్‌లు, 14 వన్డేలు ఆడాడు. ఇందులో 172 పరుగులు సాధించి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇండిపెండెన్స్ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హుస్సేన్ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్‌గా రాణించలేకపోయిన హుస్సేన్.. పాక్ దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 131 మ్యాచ్‌ల్లో 454 వికెట్లు సాధించాడు. కాగా, 1997 సహారా కప్ (భారత్-పాక్) సందర్భంగా శివ్ కుమార్ అనే భారత సంతతి కెనడియన్‌పై జరిగిన దాడి ఘటనలో ఇంజమామ్ ఉల్ హాక్‌తో పాటు మహ్మద్ హుస్సేన్ నిందితుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్ సందర్భంగా శివ్ కుమార్‌పై ఇంజమామ్ బ్యాట్‌తో దాడి చేయగా, 12వ ప్లేయర్‌గా ఉన్న మహ్మద్ హుస్సేన్ ఇంజమామ్‌కు బ్యాట్ అందించి సహకరించాడు. చదవండి: IPL 2022: వరుస ఓటములతో కుంగిపోయిన సీఎస్కేకు మరో భారీ షాక్..! -
పేరు పెట్టింది.. నిజాం నవాబు
టేస్ట్ స్పెషలిస్ట్: తండ్రి చనిపోయే సమయానికి మహ్మద్ హుస్సేన్‌కి 15 ఏళ్లు. అతని తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. తండ్రి మరణానంతరం ఈ స్వీట్ షాప్ పెట్టాడాయన. కారణం తెలియదు కానీ... అది ‘వితవుట్ నేమ్’ స్వీట్‌షాప్. నేమ్ బోర్డ్ లేకపోయినా నిదానంగా ఆ స్వీట్‌షాప్ ప్రాచుర్యంలోకి రావడం మొదలైంది. దాని మిఠాయిలు ఇప్పుడు పాతబస్తీ కేంద్రంగా చవులూరిస్తున్నారుు. పాలు, నెయ్యి, పంచదార, కుంకుమపువ్వు... మరికొన్ని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన దినుసులు కలిపి తయారు చేసే జౌజిహల్వా ఇక్కడ సూపర్ ఫేమస్. దీన్ని కట్టెల పొయ్యి మీద తక్కువ మంటతో 8 నుంచి 10 గంటల దాకా వండుతారు. కొద్దిగా జౌజిహల్వా నోట్లో వేసుకుంటే దాని రుచి చాలా సేపు మన నోటిని వదలదు. ఇక ఇక్కడి కేసరి లడ్డూ రుచి అద్భుతం అంటారు స్వీట్లవర్స్. ఇలాంటి వినూత్న రుచులనే ఆధారం చేసుకుని ఈ స్వీట్‌షాప్ పేరు శరవేగంగా విస్తరించింది. ఆ పేరంటే గుర్తొచ్చింది. ఈ షాప్‌కి తర్వాతి కాలంలో పేరు కూడా పెట్టారు. అది కూడా నామకరణం చేసింది ఎవరనుకున్నారు! ఏకంగా నిజాం నవాబు. దాని వెనుక ఓ చిన్న కథ ఉంది... ఈ షాప్ పేరు ఆ నోటా ఈ నోటా విన్న నిజాం నవాబు సైతం ఈ స్వీట్షాప్ని విజిట్ చేశాడట. అక్కడ మిఠాయిలు రుచి చూశారట. అద్భుతం అన్నారట. అంతేకాకుండా అంత టేస్టీ స్వీట్స్ విక్రయించే షాప్ అలా పేరు లేకుండా ఉండడం నచ్చక... అలా తిరిగి వెళ్లాక ఆ షాప్‌ని అభినందిస్తూ పురస్కారం పంపడమే కాక తన పుత్రుల్లో ఒకరి పేరును ఆ షాప్‌కి పెట్టమని అభ్యర్థిస్తూ స్వయంగా ఒక ఉత్తరం కూడా రాశాడట. అలా ‘హమీది కన్ఫెక్షనర్స్’ పేరు బోర్డెక్కిందట. నిజాం రాసిన ఉత్తరం, ఆయన పంపిన పురస్కారం ఆ షాప్‌లో మనకి ఇప్పటికీ దర్శనమిస్తుంటాయి. ‘మేం ప్రారంభించినప్పుడు (దాదాపు తొంభై ఎనిమిదేళ్ల క్రితం) ఇక్కడ ఈ షాప్ ఒక్కటే ఉండేది. దీనికి వచ్చిన ప్రాచుర్యంతో మరికొన్ని వెలిశాయి. మేం షాప్ పెట్టిన కొంత కాలానికి ఇక్కడ మొజంజాహి మార్కెట్ ప్రారంభమైంది’ అంటూ షాప్ నిర్వాహకులు పాషా చెప్పుకొచ్చారు. - సంకల్ప్ -
ఫారో మార్కు ప్రజాస్వామ్యం
ఈజిప్ట్ సైనిక నియంత అల్ సిసీ అధ్యక్ష ఎన్నికల్లో నిలవబోతున్నారు. ప్రత్యర్థులే లేని ఆ ఎన్నికల్లో ఆయన గెలుపు తథ్యం. ప్రజాస్వామ్య పరివర్తనకు నాంది పలుకుతానంటున్న సిసీ భావప్రకటనా స్వేచ్ఛపై పంజా విసిరారు. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య తేడా ఎంత? దుస్తులు మార్చుకున్నంత. ఈజిప్టు ‘దుస్తులు’ మార్చుకోబోతోంది. సైనిక నియంత ఫీల్డ్ మార్షల్ అబ్దెల్ అల్ ఫతా అల్ సిసీ ఏప్రిల్‌లో పౌర దుస్తులు ధరించడంతో ఈజిప్టు ప్రజాస్వామ్య దేశంగా మారిపోతుంది. సంశయజీవులు మయన్మార్ నిన్నగాక మొన్న దుస్తులు మార్చి ప్రజాస్వామ్య పరివర్తనను సాధించిన వైనాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరి. నాటకీయత లేని రాజకీయాలు రక్తి కట్టవు. ‘అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న ప్రజాభీష్టాన్ని తిరస్కరించజాలను’ అని సిసీ బుధవారం కువైట్ పత్రిక ‘అల్ సియాసా’తో అన్నారు. అలా అయన అన్నా, దాని అర్థం ఆ పత్రిక ప్రచారం చేసినట్టు అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొంటారని చెప్పినట్టు కాదని ఆయన ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనరని చెప్పలేదు. ఏప్రిల్ మధ్యలో జరగాల్సిన అధ్యక్ష ఎన్నికల్లో సిసీ పోటీ చేయాలని అత్యున్నత సైనిక మండలి గత నెల 27న తీర్మానించింది. దాన్ని ఆయన శిరసావహించక తప్పదు. మండలి అధిపతి ఆయనే. రాజకీయ ప్రవేశానికి మొదటి అర్హత... అన్నది అనలేదంటూ పాత్రికేయులను అబ ద్దాలకోర్లుగా రుజువు చేయడం. సిసీ ఆ అర్హతను సాధించారు. గత నెల 19న జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో సిసీ మార్కు రాజ్యాంగం 98.1 శాతం ఓట్లతో ఆమోదం పొందింది. మూడు కోట్లకు పైబడిన ఓటర్లలో 38.6 శాతమే ఓటింగ్‌లో పాల్గొన్నారనేది, 60 శాతం ఓటర్లయిన 18-40ల మధ్య వయస్కులు పోలింగ్ బూత్‌ల మొహం చూడలేదనేది వాస్తవమే. అంత మాత్రాన అది ‘ప్రజామోదం’ కాకపోదు. ఆ రాజ్యాంగం ప్రకారం సిసీ సైనిక మండలి అధ్యక్ష పదవిని, రక్షణమంత్రి పదవిని వదులుకోకుండానే సింహాసనం ఎక్కేయవచ్చు. ప్రజాస్వామ్యం దుస్తులు మార్చడం అయిన చోట ఎన్నికలు తప్పనిసరి తద్ధినం కాక మరేమవుతాయి? ఇదంతా ఒక ప్రహసనమని నిషిద్ధ ‘ఉగ్రవాద సంస్థ’ ముస్లిం బ్రదర్ హుడ్ హేళన చేసినంత మాత్రాన అది ప్రజాస్వామ్యం కాకుండా పోదు. బ్రదర్హుడ్ నేత, మాజీ అధ్యక్షుడు, తాజా ‘ఉగ్రవాది’ మొహ్మద్ ముర్సీ 2012లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో 33 శాతం ఓటర్లే పాల్గొన్నారు. వారిలో 64 శాతం మాత్రమే ఆయన రాజ్యాంగానికి అవునన్నారు! అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంతటి వాడు విప్లవం మొదట్లోనే హోస్నీ ముబారక్ పాలనను ‘అరబ్బు తరహా ప్రజాస్వామ్యం’గా అభివర్ణించారు. సరిగ్గా మూడేళ్లకు ఈజిప్ట్ అక్కడికే చేరిందంటే అది ఆయన చాణక్యమే. నాటి విప్లవంలో ప్రజాస్వామ్య యువత, వామపక్ష ట్రేడ్యూనియన్లతో భుజం కలిపి సాగిన ముస్లిం బ్రదర్‌హుడ్‌ను వారి నుంచి వేరు చేసినది అమెరికాయే. అధికారం ఆశజూపి లౌకిక, వామపక్ష, ప్రజాస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన పార్లమెంటు ఎన్నికల్లో ముర్సీ పాల్గొనేలా చేశారు. సైనిక మండలికి అధికారాలను కట్టబెట్టి అమెరికా నాడు మొహ్మద్ హుస్సేన్ తంత్వానీకి పగ్గాలను అప్పగించింది. నామమాత్రపు అధికారాలే ఉన్న ముర్సీ తంత్వానీని తొలగించి, ఏరికోరి (2012) సిసీకి ఆ బాధ్యతలు అప్పగించారు. ఓటర్లలో మూడింట ఒక వంతు మద్దతే ఉన్న బ్రదర్‌హుడ్‌కు రాజకీయ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టాలని ప్రయత్నించారు. సిసీనే నమ్ముకున్నారు. ‘బ్రదర్హుడ్ ఫీల్డ్ మార్షల్’ సిసీ... ముర్సీనే కటకటాల పాలుచేసి, బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. 20 వేల మందిని నిర్బంధించారు. అమెరికా మిత్రభేదం ఫలించింది. ఇతర పక్షాలేవీ మాట్లాడలేదు. పైగా నాడు సిసీని ‘హీరో’గా భావించాయి. నాటి లౌకికవాద హీరో ఇప్పుడు ‘ఉగ్రవాద వ్యతిరేక హీరో’గా రూపాంతరం చెందారు. అల్ సియాసాతో మాట్లాడుతూ ఆయన... గల్ఫ్ సహకార మండలి ఉగ్రవాదాన్ని (బ్లాక్ టై) నిర్మూలించడానికి సహకరించాలని కోరారు. ఆయన అడగకుండానే సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 16 వేల కోట్ల నిధులను కుమ్మరించాయి. ‘ఉగ్రవాదం’పై పోరుకు ముందు షరతు ఎప్పుడూ ‘పంచమాంగ దళమే’... అంటే పత్రికలే. సిసీ అధికారంలోకి వచ్చినవెంటనే తమకు తామే కళ్లూ, చెవులు, నోళ్లు మూసేసుకోవడం స్థానిక పత్రికలు అలవరుచుకున్నాయి. ‘అల్‌జజీరా’కు ఆ ఇంగితం లేకపోయింది. ఫలితం అనుభవిస్తోంది. నలుగురు విదేశీయులు సహా 20 మంది పాత్రికేయులు కటకటాలు లెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా ‘అన్సర్ అల్ మక్దిన్’ అనే అల్‌కాయిదా అనుబంధ సంస్థ గత పదిహేను రోజుల్లోనే కైరోలో కారుబాంబు పేలుడుకు, సినాయ్‌లో ఒక సైనిక హెలికాప్టర్ కూల్చివేతకు, ఒక పోలీస్ జనరల్ హత్యకు పాల్పడింది. ఆ సంస్థకు సౌదీ మద్దతున్నది కాబట్టి అది ఉగ్రవాద సంస్థ కాదు, దానిది ఉగ్రవాదం కాదు. అభినవ ఫారో ప్రజాస్వామ్యంతో పీనుగుల పిరమిడ్లను నిర్మించనున్నారు. - పి. గౌతమ్