breaking news
modern trends
-
స్టార్ బ్రాండ్స్..
ప్రముఖ సినీతారలు, క్రీడాకారులు, ఫ్యాషన్ ఐకాన్స్, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా విభిన్న రంగాల్లో సెలబ్రిటీలు తమ కళ, నైపుణ్యాలతో అభిమానులను అలరిస్తుంటారు. ఈ క్రమంలో ప్రేక్షకులతో, అభిమానులతో ఏర్పడిన ప్రత్యేక అనుబంధం వారిని సెలబ్రిటీలుగా మారుస్తుంది. ఇలా వారి వారి రంగాల్లో తారలుగా వెలుగొందుతూనే, వారికున్న ఇమేజ్, ప్రశస్తిని వ్యాపారంగానూ మార్చుకునే ట్రెండ్ గతంలోనే మొదలైంది. చాలా వరకూ సెలబ్రిటీలు వివిధ బ్రాండ్లకు, ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటారు. అయితే కొందరు మాత్రం సొంత బ్రాండ్లను ఆవిష్కరిస్తుండడం విధితమే. ఇందులో టాలీవుడ్ స్టార్లు మొదలు బాలీవుడ్ తారలు, భారతీయ క్రికెటర్లు తదితర సెలబ్రిటీలు ఉన్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం. మోడ్రన్ ట్రెండ్స్, అధునాతన ఫ్యాషన్ హంగులకు ఎల్లప్పుడూ వేదికగా నిలిచే హైదరాబాద్ నగరం ఈ సెలబ్రిటీ బ్రాండ్లకు సైతం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నగర వేదికగా క్రేజ్ పొందుతోన్న కొందరు సెలబ్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందామా.. మేము సైతం.. టాలీవుడ్ సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న మహేష్ బాబు కూడా ఈ ఓన్ బ్రాండ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి కొన్ని సంవత్సరాలు కొనసాగించారు. ‘ది హంబుల్ కో’ అనే క్లాతింగ్ బ్రాండ్‌తో మహేష్ అలరించి మధ్యలో ఆపేశారు. తన బ్రాండ్ పేరు మధ్యలో ‘ఎమ్‌బి’ అనే ఇంగ్లిష్ అక్షరాలు వచ్చేలా చూసుకున్నాడు. ఇదే కోవలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సైతం ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 1 విడుదలై, విజయవంతమైన సమయంలో ‘బీ ఇస్మార్ట్’ అనే బ్రాండ్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం అది అందుబాటులో లేదని సమాచారం. యూ వి కెన్.. క్యాన్సర్ నుంచి బయట పడిన అనంతరం తనలాంటి క్యాన్సర్ బాధితులకు సహకారం అందించడమే లక్ష్యంగా ప్రముఖ ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ‘యూ వి కెన్( ్గౌu గ్ఛి ఇ్చn...)’ అనే ఎన్జీవోను ప్రారంభించారు. ఈ సంస్థకు ఆర్థిక వనరుల కోసం అదే పేరుతో అథ్లెటిక్ వేర్, క్యాజువల్ వేర్‌ను ఆవిష్కరించారు. క్రీడాకారులు, క్రీడా రంగానికి చెందిన వివిధ వ్యక్తులు ఈ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యూవీ ఇదే సంస్థ తరపున నగరంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ‘రాన్’.. రన్ అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అటు ఆటలో దూకుడుతోనూ.. ఇటు మోస్ట్ ఫ్యాషనబుల్ పర్సనాలిటీతోనూ ఎప్పుడూ మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీగా అలరిస్తుంటాడు. అయితే విరాట్ కోహ్లికి సైతం ‘రాన్’ అనే సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. ఈ బ్రాండ్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా నగరంలోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక్కడి ఆదరణ గమనించిన కోహ్లి.. తన బ్రాండ్ అంబాసిడర్ ఎబీ డివీలియర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించాడు. ఎబీ డివీలియర్స్ తనతో ఆర్సీబీ టీమ్ మేట్మాత్రమే కాదు, తన బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నాడు. మోడ్రన్, క్లాసీ లుక్స్ ఈ బ్రాండ్ ప్రత్యేకత. ఏ ‘ఊకో కాక’.. సింగర్‌గా గల్లీ నుంచి ప్రయాణం ప్రారంభించి ఆస్కార్ వేదిక వరకూ ఎదిగిన లోకల్ బాయ్ రాహుల్ సిప్లిగంజ్ సైతం ఈ వ్యాపారంలోకి వచ్చారు. తన వ్యక్తిత్వానికి తగ్గట్టే ‘ఊకో కాక’ అనే పేరుతో క్లాతింగ్ స్టోర్లు ప్రారంభించాడు. మధ్య తరగతి కుటుంబాలు మొదలు రిచ్ పీపుల్ వరకూ ఈ బ్రాండ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. లోకల్ ఫ్లేవర్‌తో, మాస్, ట్రెండీ లుక్స్‌తో ఈ బ్రాండ్ దూసుకుపోతోంది. సచిన్ సైతం.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఒక మతమైతే సచిన్ టెందుల్కర్ని దేవుడిలా కొలుస్తారు. అలాంటి సచిన్ సైతం ఫ్యాషన్ రంగంలో సొంత బ్రాండ్‌తో బిజినెస్ చేస్తున్నాడు. అరవింద్ ఫ్యాషన్‌తో సంయుక్తంగా జతకట్టి మగవారికి సంబంధించిన నాణ్యమైన కలెక్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వారసత్వ వైభవాన్ని ప్రదర్శించేలా అధునాతన హంగులనూ అవసోపన పట్టిన ఈ డిజైన్స్‌కు మంచి ఆదరణ ఉంది. దీంతో పాటు సచిన్ టెందుల్కర్ స్పిన్నీ, బూస్ట్, బీఎండబ్ల్యూ వంటి వ్యాపారాల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘అల్లూ’రిస్తూ... తెలుగు సినిమాల్లోనే కాకుండా ప్రస్తుతం పాన ఇండియా స్థాయిలో స్టైలిష్ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపున్న అల్లు అర్జున్ సైతం ‘ఏఏ’ బ్రాండ్ ఆవిష్కరిస్తున్నారని పలుమార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ‘ఏఏ’ పేరుతో కొన్ని లోకల్ బ్రాండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనర్..ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రాకు సైతం నగరంలో ప్రత్యేకంగా స్టోర్ ఉండటం విశేషం. తన డిజైన్స్‌ను నగరంలో ప్రమోట్ చేయడం కోసం కరీనా కపూర్ వంటి బాలీవుడ్ తారలతో నగరంలో అతిపెద్ద ఫ్యాషన్ షోలను సైతం ఈ ఫ్యాషన్ ఐకాన్ నిర్వహించాడు.‘రౌడీ’ బాయ్స్..టాలీవుడ్ టు బాలీవుడ్ వరకూ ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినూత్న కథాంశాలు, మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో అతి తక్కువ సమయంలో టాప్ హీరోల స్థాయిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే హవాను కొనసాగిస్తూ ‘రౌడీ’ అనే ఇండియన్ స్ట్రీట్ కల్చర్ టాప్, బాటమ్ వేర్ బ్రాండ్‌ను ప్రారంభించారు. సరికొత్త ట్రెండ్స్‌ను ఇష్టపడే యూత్ ఈ రౌడీ బ్రాండ్‌ను బాగా ఆదరిస్తున్నారు. ఈ బ్రాండ్ యాడ్స్‌లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ సొంత బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడు విజయ్. సినిమా ఫంక్షన్లు, టీవీ షోలలో విజయ్ తన బ్రాండ్ దుస్తులనే ధరిస్తూ హ్యండ్సమ్ లుక్స్‌తో అలరిస్తుంటారు. ఈ బ్రాండ్ ఆన్లైన్ రౌడీ క్లబ్లో లభ్యమవుతాయి.బీయింగ్ హైదరాబాదీ.. దేశ వ్యాప్తంగా ఫ్యాషన్ మార్కెట్లో బీయింగ్ హ్యూమన్ది ప్రత్యేక స్థానం. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంత బ్రాండ్ కావడంతో దీనికి మంచి ఆదరణ ఉంది. 2007 నుండి సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి బీదవారి ప్రాథమిక విద్య, వైద్యానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాడు. 2009 నుండి బీయింగ్ హ్యూమన్ పేరుతో ఫ్యాషన్ ఉత్పత్తులను ప్రారంభించాడు. వచ్చే ఆదాయాన్ని తన స్వచ్ఛంద సంస్థ తరపున సేవా కార్యక్రమాలకే ఖర్చుపెడుతున్నాడు. హైదరాబాద్‌లో సల్మాన్ ఖాన్‌కు అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సల్మాన్‌కు నగరంతో ప్రత్యేక అనుబంధముంది. తన చెల్లి పెళ్లిని సైతం ఇక్కడే చేయడం తెలిసిందే.గ్లామర్ క్వీన్స్.. ప్రియాంక చోప్రా అనోమ్లీ బ్యాటీ ఉత్పత్తులు, దీపికా పదుకొనె ఆల్ అ»ౌట్ యూ, సమంత సాకి, అనుష్క శర్మ నుష్ వంటి బ్రాండ్లు కూడా ఇక్కడ లాభాల్లో అమ్ముడవుతున్నాయి. గ్లామర్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న ఈ తారల సొంత బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్, మింత్ర లాంటి అన్లైన్ పోర్టల్స్‌లో లభ్యమవుతుండగా.. సమంత మాత్రం సాకి.కామ్ పేరుతో సొంత ఈకామర్స్ పోర్టల్ నడుపుతోంది. టాప్‌లో.. వీరితో పాటే ధోనీ సెవెన్ బ్రాండ్, విరేంద్ర సెహా్వగ్ వీఎస్ బ్రాండ్లకు సైతం ఇక్కడ మంచి ఆదరణ ఉంది. ఈ కామర్స్ పెరిగిపోవడంతో అందిరి సెలబ్రిటీల బ్రాండ్స్ అభిమానులు ఆర్డర్ చేస్తున్నారు. -
ఫ్యాషన్ స్ట‘యిల్’
సాక్షి, సిటీబ్యూరో : ఫ్యాషన్ రోజుకో కొత్త పుంత తొక్కుతోంది. ఒంటినిఅలంకరించుకోవడంలో సిటిజన్లు మోడ్రన్ ట్రెండ్స్‌ను ఫాలోఅవుతున్నారు. బొట్టు దగ్గర్నుంచి కాళ్లకు వేసుకునే ఫుట్‌వేర్ దాకా ఏదైనా సరే తమదైన స్టైల్‌ని ప్రదర్శించాలనుకుంటున్నారు. అయితే ఇదే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. సమస్యలు తప్పవు అంటున్నారు నగరానికి చెందిన పలువురు వైద్యులు.ఆ విశేషాలు ఏంటో ఓ లుక్ వేద్దాం. నెత్తికెక్కితే...సమస్యలే.. హెయిర్‌డ్రెస్సింగ్, హెయిర్ కలరింగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి. విభిన్న రకాల కలర్స్‌ను ఉపయోగించడం, కెరటిన్ ట్రీట్మెంట్స్ వంటి హెయిర్ స్రైటనింగ్ పద్ధతుల వంటివి విపరీతమైన హెయిర్లాస్కి, అలర్జీలు తదితర సమస్యలకు కారణం కావచ్చు. తల వెంట్రుకలను బాగా టైట్‌గా కట్టేయడం హెయిర్‌ఫాల్‌కి దారి తీస్తుంది. టా‘ట్రూ’త్ మరవొద్దు.. టాటూస్ ముద్రించుకోవాలనుకున్నప్పుడు... రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ కాకుండా తప్పనిసరిగా స్పెషలిస్ట్ దగ్గరకు మాత్రమే వెళ్లాలి. ఇది స్కిన్ అలర్జీల నుంచి స్కిన్ గ్రాన్యులోమాస్ దాకా కారణం అవుతుంది. అంతేకాదు అన్ స్టెరిలైజ్డ్ వాడితే... ఎయిడ్స్ నుంచి హెపటైటిస్ వంటి వ్యాధుల వరకూ వచ్చే ప్రమాదం ఉంది. ముందుగా డాక్టర్ సలహా కూడా తీసుకోవాలి. టాటూస్ వేసుకుకున్నాక కనీసం 2వారాల పాటు అబ్జర్వ్ చేయాలి. మెహెందీ... కేర్ ఇదీ.. సహజమైన రీతిలో తయారైన మెహందీలు కావాల్సిన గాఢమైన రంగును ఇవ్వలేవు.. వీటి తయారీ దారులు కృత్రిమ దారులు వెతుకుతున్నారు. ఫలితంగా వీటిలోనూ రసాయనాల మేళవింపు బాగా జరుగుతోంది. నగరంలో పలువురు చేతులు, కాళ్ల వాపు, వేళ్ల మీద బొబ్బలు రావడం, దురదలు... చర్మం ఎర్రబారడం, మరింత తీవ్రమైతే చర్మం ఊడిపోవడం.. దాకా దారి తీయవచ్చు. స్టాప్.. హెవీ మేకప్.. ఒకప్పుడు సినిమా వాళ్లకు మాత్రమే పరిమితమైన మేకప్ ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికీ సర్వసాధారణమైపోయింది. నిమిషాల్లో వర్ఛస్సును మెరిపించేయాలనే తాపత్రయంతో మార్కెట్లోకి వచ్చిన ప్రోడక్టŠస్ వచ్చినట్టు వాడేస్తున్నారు. వైద్యుల సలహా మేరకు పరిమితమైన మేకప్‌కు మాత్రమే ఓటేయాలి. సమస్యలకు అ‘డ్రెస్’... కొన్ని ఫ్యాబ్రిక్స్ కొన్ని రకాల చర్మాలకు సరిపడవు. ఉదాహరణకు నైలాన్ ఫ్యాబ్రిక్ చాలా మందికి సరిపడదు. ఇక ఎగ్జిమా సమస్య ఉన్నవారి తప్పనిసరిగా కాటన్ వంటి నప్పే ఫ్యాబ్రిక్ మాత్రమే వాడాలి. టైట్స్ పేరుతో విరివిగా వినియోగిస్తున్న బిగుతైన దుస్తులు సైతం చర్మవ్యాధులకు కారణం కావచ్చు. ఎత్తు పెంచుతూనే చిత్తు చేస్తాయి... విపరీతమైన హీల్ ఉన్న ఫుట్‌వేర్ వాడకం వల్ల హైట్ ఎక్కువగా, సై్టల్‌గా కనపడతారేమో గాని, రకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడతారు. కాబట్టి పరిమితమైన హీల్ ఉన్నవీ అది కూడా కాస్తంత ప్రాక్టీస్ తర్వాతే వినియోగించడం మంచిది. ‘ఫి’యర్సింగ్.. కాదేదీ కుట్టుకోవడానికి అనర్హం అన్నట్టు రింగుల్ని గుచ్చుకుంటున్నా రు. నాలుక వంటి సున్నితమైన భాగాల మీద జ్యువెలరీ యాడ్ చేయడం వంటి ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్ ఫాలో అవకూడదు. ఇలాంటివి ముదిరితే తీవ్రమైన సైకలాజికల్ సమస్యగానూ మారవచ్చు. స్టైల్స్ ఫాలో అవొచ్చు కానీ.. ప్రస్తుతం యూత్ చాలా మోడ్రన్‌గా, స్టైలిష్‌గా కనిపించాలని ఆశిస్తున్నారు. అది కొంత వరకూ అవసరమే అయినా... జాగ్రత్తలు తప్పనిసరి. మన శరీరం మీద ఏ ప్రయోగం చేయాలన్నా దానికి ముందస్తుగా కొంత శిక్షణ ఇవ్వాలి. తమ శరీరం తీరు తెన్నులపై అవగాహన తెచ్చుకోవడానికి నిపుణులను సంప్రదించి, ఆ తర్వాత ఎంత మేరకు ఆ స్టైల్స్ అనుసరించవచ్చో నిర్ణయించుకోవాలి.– డాక్టర్ వాణి, డెర్మటాలజిస్ట్ -
ఆధునిక పోకడలతో విలువలు కనుమరుగు
స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ముగిసిన పద్యనాటక సప్తాహం ఆకట్టుకున్నపాదుకాపట్టాభిషేకం నాటకం హన్మకొండ కల్చరల్ : శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన పెనుమార్పులు, ఆధునిక పోకడలతో మానవ విలువలు కనుమరుగవుతున్నాయని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో హన్మకొండ పబ్లిక్‌గార్డెన్‌లోని నేరేళ్లవేణుమాధవ్ కళాప్రాంగణంలో పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పద్యనాటక సప్తాహ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి కొనసాగుతున్న రాష్ట్రస్థాయి పద్యనాటక సప్తాహం గురువారం ముగిసింది. చివరి రోజు జరిగిన కార్యక్రమానికి స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పందిళ్ల శేఖర్‌బాబు పేరిట రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. పౌరాణిక కళాకారులకు పందిళ్ల శేఖర్‌బాబు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. నాటకాలు సందేశాత్మకంగా ఉంటాయని.. సమాజానికి ఉపయోగకరమైనవని పేర్కొన్నారు. అనంతరం స్పీకర్.. పందిళ్ల శేఖర్‌బాబు స్మారక పురస్కారాన్ని ప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నాటక రచయిత తడకమల్ల రాంచంద్రరావుకు అందజేశారు. అలాగే డాక్టర్ నిభా నుపూడి సుబ్బరాజు, జిల్లాకు చెందిన ప్రముఖ మైమ్ కళాకారుడు కళాధర్‌ను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్, వనం లక్షీ్మకాంతారావు, గిరిజామనోహర్‌బాబు, శ్రీరామోజు సుందరమూర్తి, గుడిమల్ల రవికుమార్, నిర్వాహక సలహా మండలి సభ్యుడు పందిళ్ల అశోక్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు బూరవిద్యాసాగర్గౌడ్, ఆకుల సదానందం, తిరుమలయ్య, శ్రీధరస్వామి, రవీందర్, సదానందచారి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.