breaking news
Mister World
-
మిస్టర్ వరల్డ్ పోటీలు: మిస్టర్ గ్లో..మిస్టర్ స్లో..
అందాల ప్రపంచంలో అతివలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. పురుషులకూ అంతే ప్రాధాన్యత ఉంది. మోడలింగ్ కావచ్చు, గ్లామర్, సినీ రంగాల్లో రాణించాలనుకునే యువతికైనా, యువకుడికైనా బ్యూటీ కాంటెస్ట్‌లు చక్కని ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తాయి. అయితే మహిళల అందాల పోటీలు రోజురోజుకూ విస్తరిస్తుంటే మగవాళ్ల అందాల పోటీల విలువ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. భాగ్యనగరంలో మిస్ వరల్డ్ పోటీలు సందడిగా ముగిసిన నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలను సిటీ మోడలింగ్ రంగం గుర్తు చేసుకుంటోంది. ప్రపంచ సుందరి పోటీలు ఎంత పాపులరో, ప్రపంచ సుందరాంగుడు పోటీలు అంత తక్కువ పాపులర్ అని చెప్పొచ్చు. మిస్ వరల్డ్ పోటీలను 1951లో ప్రారంభిస్తే.. చాలా ఆలస్యంగా.. 45ఏళ్ల తర్వాత 1996లో మిస్టర్ వరల్డ్ పోటీలను ఎరిక్ మోర్లే ప్రారంభించారు. అందం, శారీరక సామర్థ్యం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని బట్టి పురుషులను విజేతలుగా ఎంపిక చేసే ఈ పోటీ లండన్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మిస్ వరల్డ్ పోటీలకు సారథ్యం వహిస్తున్న జూలియా మోర్లేనే ఈ పోటీలకు సైతం అధ్యక్షురాలిగా ఉన్నారు. మూడు దశాబ్దాల్లో.. పదకొండు సార్లు.. మిస్ వరల్డ్ పోటీల్లానే.. ఏటా నిర్వహించాలని ప్రారంభంలో అనుకున్నా.. స్పందనను బట్టి ఈ పోటీలను నిర్ణిత వ్యవధి అనేది లేకుండా నిర్వహిస్తున్నారు. తొలిసారి 1996లో బెల్జియం వాసి టామ్ నుయెన్స్ ఈ పోటీలో గెలుపొందగా, 1998లో వెనిజువెలా వాసి సాండ్రో ఫినోగ్లియో, 2000లో ఉరుగ్వే వాసి ఇగ్నాసియో క్లిచె, 2003లో బ్రెజిల్ వాసి గుస్తావో గియానెట్టి, 2007లో జువాన్ స్పెయిన్ కు చెందిన గార్సియా పోస్టిగో, 2010లో ఐర్లాండ్‌కు చెందిన కమాల్ ఇబ్రహీం, 2012లో కొలంబియా నివాసి ఫ్రాన్సిస్కో ఎస్కోబార్, 2014లో డెన్మార్క్ నుంచి నిక్లాస్ పెడర్సెన్, 2016లో మొదటి ఆసియన్ విజేతగా భారత్‌కు చెందిన రోహిత్ ఖండేల్వాల్, 2019లో ఇంగ్లాండ్ వాసి జాక్ హెసెల్వుడ్ గెలుపొందారు. చివరి సారిగా 2024లో ఈ పోటీ నవంబర్ 23న వియత్నాంలోని ఫాన్ థియెట్లో జరిగింది. డానియెల్ మేజియా మిస్టర్ వరల్డ్ పోటీలో, స్పోర్ట్స్ టాలెంట్ విభాగాల్లో విజేతగా నిలిచారు. అతను 60 మంది ఇతర పోటీదారులతో పోటీపడి, మొదటి స్థానం దక్కించుకున్నారు. వివిధ విభాగాల్లో.. మిస్టర్ వరల్డ్ పోటీలో పాల్గొనేవారు వివిధ విభాగాల్లో పోటీ పడతారు, వారి శారీరక సామర్థ్యం పరీక్షించడానికి స్పోర్ట్స్ ఛాలెంజ్, ప్రతిభను ప్రదర్శించే టాలెంట్ రౌండ్, సామాజిక మాధ్యమాల్లో పట్టును చూపించే మల్టీమీడియా, వ్యక్తిగత శైలి ఫ్యాషన్ సెన్స్ చూపే ఫ్యాషన్ రౌండ్.. ఈ పోటీలు పాల్గొనేవారి సమగ్ర వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి రూపొందించారు. ఇండియాకు టైటిల్ తెచ్చిన నగరవాసి..2016లో, రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు, ఆసియన్ కూడా. ఈ పోటీ జులై 19, 2016న ఇంగ్లండ్‌లోని సౌత్‌పోర్ట్‌లో జరిగింది. రోహిత్, మిస్టర్ వరల్డ్ మల్టీమీడియా అవార్డు కూడా గెలుచుకున్నారు. విశేషం ఏమిటంటే రోహిత్ ఖండేల్వాల్ నగరానికి చెందిన యువకుడు కావడం. ఈ నేపథ్యంలో మిస్టర్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడానికి మన హైదరాబాద్ పూర్తిగా సరైన ఎంపిక అని పలువురు నగర మోడల్స్ అభిప్రాయపడుతున్నారు. మిస్ వరల్డ్ లాగే మిస్టర్ వరల్డ్ పోటీదారులు కూడా హైదరాబాద్ నగరంలో సందడి చేస్తారేమో వేచి చూద్దాం.. (చదవండి: మిస్ యూనివర్స్ సన్నాహకం..) -
మిసెస్ వరల్డ్‌గా సర్గమ్ కౌశల్.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు కిరీటం..
న్యూఢిల్లీ: ముంబైకి చెందిన సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 కిరీటం దక్కించుకున్నారు. శనివారం అమెరికాలోని వెస్ట్గేట్ లాస్‌వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో జరిగిన పోటీల్లో 63 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ కిరీటం కోసం తలపడ్డారు. సర్గమ్ విజేతగా నిలవగా మొదటి రన్నరప్‌గా మిసెస్ పోలినేసియా, రెండో రన్నరప్‌గా మిసెస్ కెనడా నిలిచారు. 2001లో నటి, మోడల్ అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ గెలుచుకోగా, 21 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు ఆ గౌరవం దక్కింది. సర్గమ్ కౌశల్ జమ్మూకశీ్మర్‌కు చెందిన వారు. మిసెస్ వరల్డ్ పోటీలను 1984 నుంచి నిర్వహిస్తున్నారు. చదవండి: మోరల్ పోలీసింగ్ వద్దు: సుప్రీం -
మిస్టర్ వరల్డ్ ఛాంపియన్ షిప్ కు సెలెక్ట్ అయిన హైదరాబాద్ యువకుడు
-
మిస్టర్ ఇండియా అవుతారా?
దండోరా ‘లక్షలాది భారతీయ పురుషులకు రోల్‌మోడల్ కావాలనుకుంటున్నారా? ఆడవాళ్ల హృదయాలలో గ్రీకువీరుడిగా నిలిచి పోవాలనుకుంటున్నారా? సమాజంలో ప్రముఖుడిగా నిలవాలనుకుంటున్నారా? బంగారంలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మాతో చేతులు కలపండి’ అంటోంది ‘మెన్స్ ఎక్స్‌పి’ ఫ్యాషన్ మ్యాగజైన్. ఈ పోటీలో పాల్గొనడానికి అర్హతలు: - చూడడానికి బాగుండాలి, శారీరక దృఢత్వం ఉండాలి స్టైలిష్‌గా ఉండాలి దీంతో పాటు ప్రతిభ ఉండాలి ఇతరులను హాయిగా నవ్వించగలగాలి.పై మూడు అర్హతలు మీలో ఉంటే చాలు ‘మిస్టర్ ఇండియా’ టైటిల్ గెలుచుకోవడానికి కావలసిన సరుకు మీలో ఉన్నట్లే. ఈ పోటీకి నిరభ్యంతరంగా నిండు ధైర్యంతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోటీలో విజేతగా నిలిచినవారు ‘మిస్టర్ వరల్డ్’ టైటిల్ కోసం ప్రపంచం నలుమూలల నుంచి ‘మోస్ట్ స్టైలిష్మెన్’తో పోటీ పడవచ్చు. ‘‘ప్రతి ఒక్కరూ మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోలేకపోవచ్చు. కానీ ఆ అవకాశమేదో మీకు వస్తే సంతోషమే కదా!’’ అంటోంది మెన్స్ ఎక్స్‌పి.నిజమే కదా... ఏ పోటీలో మన విజయం దాగుందో ఎవరికి తెలుసు. మీకు ఆసక్తి ఉంటే పోటీలో పాల్గొనండి. అదృష్టం మీ వైపు ఉంటే టైటిల్ గెలుచుకోండి. రాత్రికి రాత్రే సెలబ్రిటీ కండి. రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వివరాలకు: mensxp.com mrindia2014