breaking news
milk anointed
-
యూఏఈ దుబాయిలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు
-
సీఎం జగన్ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం
‘‘25 ఏళ్లుగా ఎంపీడీఓగా పనిచేస్తున్నా.. ఇప్పటివరకూ ఉద్యోగోన్నతి లేదు. ప్రమోషన్ సాధించాలనేది మా ఎంపీడీఓల కల. ఆ కలను సాకారం చేసిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి’’ అంటూ గుంటూరు జిల్లా దాచేపల్లి ఎంపీడీఓ వై.మహాలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఎంపీడీఓల ఉద్యోగోన్నతికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మహాలక్ష్మీకి కూడా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా దాచేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెండుచేతులూ జోడించి నమస్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కటకం బ్రహ్మనాయుడు, కందుల జాను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాశ్‌రెడ్డి, ఈఓపీఆర్డీ మంగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జాకీర్‌హుస్సేన్, మునగా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. - దాచేపల్లి -
సీఎం జగన్ చిత్రపటానికి తెలంగాణ ఉద్యోగుల క్షీరాభిషేకం
ఇబ్రహీంపట్నం (మైలవరం): ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులను వారి స్వరాష్ట్రానికి పంపే అంశంపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి జీవో విడుదల చేయడంపై ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. చదవండి: ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో దూసుకెళ్తున్న విశాఖ బురదజల్లడానికే నిమ్మగడ్డ పిటిషన్ -
రాజన్నకు జోహార్లు
♦ ఘనంగా వైఎస్సార్ జయంతి ♦ విగ్రహాలకు పాలాభిషేకాలు, స్వీట్ల పంపిణీ సాక్షిప్రతినిధి, ఖమ్మం : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతిని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరూరా ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేయడంతోపాటు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. రాజన్న సేవలను పలువురు కొనియాడారు. జయంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు స్వీట్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతోపాటు అన్నదానం చేశారు. నగరంలో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు జిల్లేపల్లి సైదులు ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. విగ్రహానికి పూలమాలలు వేశారు. రాపర్తినగర్, చర్చి కాంపౌండ్, శుక్రవారపేట, సీతారాంపురం, ధంసలాపురం, కొత్తూరు గ్రామాల్లో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి.. పూలమాలలు వేశారు. భద్రాచలంలోని మార్కెట్ సెంటర్లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు, కడియం రామాచారి తదితరులు పాల్గొన్నారు. చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకుడు నల్లపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అశ్వారావుపేట మండలం నారాయణపురం కాలనీలో జక్కుల రాంబాబు ఆధ్వర్యంలో బిస్కెట్లు, స్వీట్ల పంపిణీ నిర్వహించారు. దమ్మపేట మండలం దమ్మపేట,నాయుడుపేట, మొద్దులగూడెం గ్రామాల్లో వైఎస్సార్ సీపీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ప్రభుత్వాస్పత్రిలో బ్రెడ్లు పంపిణీ చేశారు. ముల్కలపల్లి మండలంలో జగన్నాధపురం సర్పంచ్ సోయం కృష్ణ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చండ్రుగొండ మండలం చండ్రుగొండ, రాజాపురం, అన్నపురెడ్డిపల్లి గ్రామాల్లో అభిమానులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక మండలాల్లో వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మణుగూరు మండలంలో సీటైప్ బాలవెలుగు అనాథ పిల్లల పాఠశాలలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వైఎస్ జయంతి నిర్వహించారు. విద్యార్థులకు 50 కిలోల బియ్యాన్ని వితరణగా అందించారు. మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి నిర్వహించారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం, సారపాక, బూర్గంపాడు, రెడ్డిపాలెం, మోరంపల్లిబంజర గ్రామాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బూర్గంపాడు ఆస్పత్రిలో పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఏడూళ్లబయ్యారం, ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్డులోని వైఎస్ విగ్రహాలకు వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో పూలమాలలు వేశారు. అశ్వాపురం మండలం రామచంద్రాపురం, అమ్మగారిపల్లి గ్రామాల్లో వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. ⇒ ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట, పెద్దతండాల్లోని వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ జిల్లా నాయకుగు జిల్లేపల్లి సైదులు పూలమాలలు వేశారు. గోళ్లపాడులో పార్టీ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అన్నదానం చేశారు. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, చెరువుమాదారంలలో వైఎస్సార్ విగ్రహాలకు పార్టీ నాయకులు మోహన్‌రెడ్డి, నకిరకంటి సత్యనారాయణ పూలమాలలు వేశారు. కూసుమంచి మండలం గట్టుసింగారం, తిరుమలాయపాలెంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. ⇒ కొత్తగూడెంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ముత్యాల హన్మంతరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేశారు. గాంధీపథం చారిటబుల్ సర్వీస్ చింతలచెర్వు గెర్షోము ఆధ్వర్యంలో బర్మాక్యాంపులో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేశారు. కొత్తగూడెం మండలం వేపలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పాల్వంచ బస్టాండ్ సెంటర్, ప్రశాంతి కాలనీలో గల వైఎస్సార్ విగ్రహాలకు అభిమానులు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. పాల్వంచ మండలం నారాయణరావుపేట, దంతెలబోరలో వైఎస్సార్ అభిమానులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ⇒ ఇల్లెందులో వైఎస్ఆర్ జయంతిని నిర్వహించారు. పాత బస్టాండ్‌లో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. హనుమంతులపాడులోని అనాథాశ్రమంలో బాలల మధ్య కేక్ కట్ చేసి, పాలు, పండ్లు, బ్రెడ్, స్వీట్లు పంపిణీ చేశారు. ⇒ మధిర మండలంలో వైఎస్సార్ సీపీ నాయకులు తూమాటి నర్సిరెడ్డి, అబ్బూరి రామకృష్ణచౌదరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ⇒ముదిగొండ మండలం బాణాపురం, కమలాపురం, గోకినేపల్లి, మాదాపురం గ్రామాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోనకల్ మండలంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి.. వేడుకలు నిర్వహించారు. ముష్టికుంట్ల, రావినూతల, బ్రాహ్మణపల్లి, బోనకల్ గ్రామాల్లోని వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి.. పూలమాలలు వేశారు. మండల కేంద్రంలోని శాంతినిలయం, దివ్యదయాళ్ వృద్ధాశ్రమాల్లో పండ్లు పంపిణీ చేశారు. ⇒ వైరా పాత బస్టాండ్ సెంటర్, క్రాస్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి వైఎస్సార్ అభిమానులు పాలాభిషేకం చేసి.. పూలమాలలు వేశారు. బాలవెలుగు పాఠశాలలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేశారు. దాచాపురంలో వైఎస్సార్ విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేశారు. ⇒కొణిజర్ల, పెద్దగోపతి, సింగరాయపాలెం గ్రామాల్లో రాజశేఖరరెడ్డి జయంతిని నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. ఏన్కూరు, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో వైఎస్ విగ్రహాలకు అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు పూలమాలలు వేశారు. ⇒ సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు తల్లాడ మండలాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు, కార్యకర్తలు వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలో పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. ⇒ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.