breaking news
Michael korsel
-
ఇండియా నా రెండో ఇల్లు
ఇండియా నా రెండో ఇల్లు. ఇలా అన్నది ఎవరో తెలుసా? నేటి టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతున్న సంచలన నటి శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న మైఖేల్ కోర్సెల్. కమలహాసన్ వారసురాలు శ్రుతీహాసన్ తన బాయ్‌ఫ్రెండ్‌తో చెటా్టపటా్టల్ అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన శ్రుతీహాసన్ మైఖేల్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేననీ, అయినా తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పాల్సిన అవసరం లేదనీ బాహాటంగానే వెల్లడించారు. కాగా ఒక ఆల్బం రికార్డింగ్ కోసం లండన్ వెళ్లిన శ్రుతీహాసన్ కు అక్కడ పరిచయం అయిన వ్యక్తే మైఖేల్. వారి పరిచయం స్నేహంగా మారి ఆపై మైఖేల్ శ్రుతీహాసన్ కు బాయ్‌ఫ్రెండ్‌గా మారాడన్నది సినీవర్గాల టాక్. కాగా ఇటీవల ఇండియా వచ్చిన మైఖేల్‌ను శ్రుతీ విమానాశ్రయంలోనే రిసీవ్ చేసుకుని ఇద్దరు సన్నిహితంగా నడిచి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటి ప్రచారం గురించి తాను చింతించేది లేదనీ, అసలు ఆ విషయమై స్పందించడానికి ఇష్టపడడం లేదనీ, ఇంకా చెప్పాలంటే తన వ్యక్తిగత విషయాల గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదనీ ఇప్పటికే నటి శ్రుతీహాసన్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రుతీహాసన్ బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ తన వెబ్సైట్లో ఇండియాకు వచ్చినప్పుడు అదు్భతవైున యువతి శ్రుతితో కాలం సంతోషంగా గడిచి పోయిందన్నారు. ఆమె అందవైున స్నేహితుల బృందాన్ని కలుసుకున్నాననీ, ఇండియా తనకు రెండో ఇల్లు అని పేర్కొన్నారు. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలే కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టాక్‌గా మారాయి. -
జస్ట్ ఫ్రెండ్.. అంతే!
ప్రేమా లేదు... పాడూ లేదు... మీరు ఏవేవో ఊహించుకోవద్దని శ్రుతీహాసన్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ మధ్య శ్రుతీతో సన్నిహితంగా ఓ అబ్బాయి తిరుగుతున్నాడని, అతను ఆమె లవర్ అనీ ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే... ఇటీవల విమానాశ్రయాల్లో శ్రుతీహాసన్‌తో తరచూ ఓ వ్యక్తి కనిపిస్తున్నాడు. రఫ్ అండ్ టఫ్స్టైలిష్ లుక్‌లో కనిపించే అతగాడి పేరు మైఖేల్ కోర్సేల్. అతను లండన్‌లో సెటిల్ అయిన ఇటాలియన్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. అందుకని, థియేటర్స్ ఆర్ట్స్‌లో ఓ కోర్స్ కూడా చేశాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన మైఖేల్‌తో శ్రుతీహాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగిందనే వార్తలు షికారు చేశాయి. ప్రేమికుల రోజున ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారనే వార్త గుప్పుమంది. ఇవన్నీ నిజమేనా? అని శ్రుతీహాసన్‌ను తాజా ఇంటర్వూ్యలో ప్రశ్నించగా.. ‘‘అలాంటిదేమీ లేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్. అంతే’’ అన్నారామె. ఒక్క ముక్కలో సమాధానం చెప్పిన శ్రుతీహాసన్ ప్రేమలో ఎప్పుడు పడతారో మాత్రం చెప్పలేదు.