breaking news
Melodious Journey
-
కొంత కాలం కొంత కాలం కాలమాగి పోవాలి...
విద్యాసాగర్ పేరు చెప్పగానే ‘ఏ అంటే అమల బి అంటే భానుప్రియ’ వంటి అల్లరి పాటలు వినిపిస్తాయి. ‘చామంతి పువ్వా పువ్వా పువ్వా నీకు బంతిపూల మేడ కట్టనా’ అనే కమర్షియల్ హిట్స్ గుర్తుకొస్తాయి. ‘చుక్కా చుక్కా కన్నీటి చుక్కా బుగ్గన జారొద్దు’ వంటి సెంటిమెంట్ పాటలు కదిలిస్తాయి. ‘తెలుగందాలే నన్ను తొంగి తొంగి చూసెనమ్మ తొలకరిగా’ వంటి మెలొడీలు చుట్టుముడతాయి. విద్యాసాగర్ మరో ఇళయరాజాగా గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు. విజయనగరం నుంచి వచ్చిన తెలుగు గీతమే అయినా తమిళంలో, మలయాళంలో ఎక్కువ గుర్తింపు పొందాడు. మార్చి 2 ఆయన పుట్టినరోజు. బొబ్బిలి సంస్థానం నుంచి... విద్యాసాగర్ తాత తండ్రులది బొబ్బిలి సంస్థానం. వాళ్లది సంగీత కుటుంబం. విద్యాసాగర్ తండ్రి రామచందర్ సినిమాల్లో పని చేయాలని 1950లలోనే మద్రాసు వచ్చారు. విద్యాసాగర్ అక్కడే పెరిగారు. తండ్రి వద్ద తొలి సంగీత విద్యలు నేర్చుకుని 11 ఏళ్ల వయసులో లండన్ ట్రినిటి కాలేజ్‌లో సంగీతం నేర్చుకున్నారు. విద్యాసాగర్ మొదట రీరికార్డింగ్‌లో గుర్తింపు పొందారు. వందలాది సినిమాలకు రీరికార్డింగ్ చేశారు. ఆ తర్వాత తమిళంలో మొదట... తర్వాత తెలుగులో సంగీత దర్శకుల య్యారు. రెండు చోట్లా కొన్ని అపజయాల తర్వాత మలయాళంలో హిట్ కొట్టి తర్వాత సౌత్‌లోని అన్ని భాషల్లో హిట్స్ ఇచ్చారు. మెలొడీస్ ఇష్టం విద్యాసాగర్‌కు మెలొడీలు ఇష్టం. ‘ఓ చినదానా’లో ‘తన చిరునామా అడిగితే ప్రేమ నిను చూపెడుతోందే’ అలాంటి మెలొడీనే. ‘చిత్రం భళారే విచిత్రం’లో ‘నవ్వుకునే మన యవ్వనమే ఒక పువ్వుల తోటంట’ కూడా అదే మెలొడీ. రాజశేఖర్ నటించిన ‘విలన్’లో ‘నా గుండె గుడి లో నువు శిలవా దేవతవా’ పెద్ద హిట్. ఇక తమిళం నుంచి తెలుగులోకి డబ్ అయిన మెలొడీలు కూడా హిట్టే. అర్జున్ నటించిన ‘కర్ణ’ సినిమాలో ‘పలికే మౌనమా’ చాలా పెద్ద హిట్. అన్నింటికి మించి ‘చంద్రముఖి’ కోసం చేసిన ‘కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి’ క్లాసిక్‌గా నిలిచింది. ‘చంద్రముఖి’ విద్యాసాగర్ ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలిపింది. అందులోని ‘చిలకా పద పదా’, ‘రారా సరసకు రారా’ అద్భుతంగా అమరాయి. విద్యాసాగర్ కె.విశ్వనాథ్ ‘స్వరాభిషేకం’కు, బాపు ‘సుందరకాండ’కు పనిచేశారు. పవన్ కల్యాణ్ ‘బంగారం’ సినిమాకు ‘రా..రా.. రారా బంగారం’ మాస్ హిట్ ఇచ్చారు. విద్యాసాగర్ మరెన్నో మంచి పాటలు అందించాలని కోరుకుందాం. -
చక్రికి ఇష్టమైన పాట ఇదే...
హైదరాబాద్ : సంగీత దర్శకుడిగానే కాదు...గాయకుడిగా కూడా టాలీవుడ్లో చక్రికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దాదాపు 50పాటలకు పైగా చక్రి పాడారు. ఇడియట్లో 'చూపులతో గుచ్చిగుచ్చి చంపకే', అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాలో 'నీవే నీవే నేనంటా'.... సత్యం సినిమాలో 'ఓ మగువ నీ స్నేహం కోసం ఎంతో ట్రై చేశా'...నేనింతే చిత్రంలో 'కృష్ణ నగరే మామ', గోపి గోపికా గోదావరి సినిమాలోని 'నువ్వెక్కడుండి నేనక్కడుంటే ప్రాణం విలవిల' అనే పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మెలోడి, ఫాస్ట్ బీట్, డ్యూయెట్ అనే తేడా లేకుండా.... అన్ని రకాల పాటలు పాడి సంగీత ప్రియుల అభిమానాన్ని చక్రి సొంతం చేసుకున్నారు. రీసెంట్గా తమన్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన పవర్ సినిమాలో కూడా ఓ హుషారైన పాటను పాడారు. ఇక ఎన్నో పాటలకు సంగీతం అందించిన చక్రికి ఏ పాట అంటే ఇష్టమో తెలుసా ? ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం చిత్రంలో 'మల్లికూయవే' పాట అంటే ఇష్టం. అలాగే చక్రం సినిమాలోని 'ఒకే ఒక మాట..మదిలోనే దాగుంది మౌనంగా' అనే పాట చాలా ఇష్టమని గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పల్లవి : మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా మల్లి కూయవే గువ్వా.. మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా... జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా చరణం : 1 సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే సిరిసిరి మువ్వలా చిరుసడివించే స్మృతి పదమున నీ గానమే పొంగిపారె ఏటిలో తొంగి తొంగి చూస్తె తోచెను ప్రియ నీ రూపమే సోకేటి పవనం నువు మురిపించే గగనం కోనేటి కమలం లోలో నీ అరళం కలత నిదురలో కలలాగ జారిపోకె జవరాల నీలి సంద్రమున అలలాగ హృదయలోగిలో నువ్వా... నువ్వా... నువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా చరణం : 2 తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే తీయనైన ఊసుతో ప్రియ విరహముతో కృంగెను ఎద నీ కోసమే సాగిపోయె దారిలో వేసే ప్రతి అడుగులా తగిలెను నీ మృద పాదమె ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం నువ్వేలే అరుణం వలపు వరదలో నదిలాగ తడిపిపో జడివానలా మంచుతెరలలో తడిలాగ నయన చిత్తడిలో నువ్వా... నువ్వా... నువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా విధివరమే నీవేగా నీవేగా... కలనిజమై పూచేగా పూచేగా... జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా జిలిబిలి పలుకుల నువ్వా దివిలో తారా జువ్వా... జువ్వా... జువ్వా... మల్లి కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెలో సవ్వడి నువ్వా