breaking news
MBA College
-
ప్రియుడి బ్లాక్‌మెయిలింగ్ భరించలేక..
మల్లాపూర్ (హైదరాబాద్): ప్రియుని వేధింపులు భరించలేక ఓ ఎంబీఏ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి తెలిపిన వివరాల ప్రకారం..మల్లాపూర్ ఎస్వీనగర్‌కు చెందిన గుండె సత్యనారాయణ కూతురు పూజిత (21) ఘట్కేసర్లోని వీబీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు ఇంద్ర చరణ్‌రెడ్డి (22) వీబీఐటీ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. వీరిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నెలరోజుల క్రితం వీరిద్దరూ మనస్పర్థలతో విడిపోయారు. కాగా ఇంద్రచరణ్‌రెడ్డి గతంలో ఇద్దరు కలిసి తీసుకున్న ఫొటోలు చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం, వేధించడంతో మనస్తాపానికి గురైన పూజిత సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్మకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం ఇంద్రచరణ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
HYD: ఎంబీఏ విద్యార్థిని అదృశ్యం
ఖరతాబాద్: ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎఎస్ఐ శ్రీరాములు తెలిపిన వివరాల ప్రకారం.... ఖైరతాబాద్ డివిజన్ మహాభారత్నగర్లో నివాసముండే తలారి ఎల్లయ్య, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తె తలారి రేణుకాదేవి (22) ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో రేణుకాదేవి తల్లి విజయలక్ష్మి ఖైరతాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తితో వెళ్లి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దిశగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంబీఏ.. చేరికలేవి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో విద్యార్థుల చేరికలు నానాటికీ పడిపోతున్నాయి. ఏపీ ఐసెట్–2021 కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో తొలివిడత సీట్ల కేటాయింపును అడ్మిషన్ల కన్వీనర్ ప్రొఫెసర్ కె.రామ్మోహనరావు బుధవారం ప్రకటించారు. ముందుగా ఎంబీఏ విషయానికొస్తే.. ఈ విద్యా సంవత్సరం ఐసెట్ కౌన్సెలింగ్‌లో కేవలం 25 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 75 శాతం మేర సీట్లు ఖాళీగా మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 303 ఎంబీఏ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 26 కళాశాలల్లో ఒక్కరు కూడా చేరలేదు. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్ రాసేందుకు దరఖాస్తు చేసుకుంటున్నవారు అంతంతమాత్రంగానే ఉండటమే దీనికి కారణం. ఇక ప్రవేశపరీక్షలో అర్హత సాధించే వారి సంఖ్య మరీ తక్కువగా ఉంటోంది. ఉత్తీర్ణులైనవారిలోనూ కౌన్సెలింగ్‌కు హాజరవుతోంది కొందరే. ఇక సీట్లు పొందాక కళాశాలల్లో చేరేవారూ తక్కువగానే ఉంటున్నారు. -
గ్లోబల్‌కి Welcome
ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ కాలేజీ. మరో మూడు గంటల్లో పరీక్ష హాలుకు వెళ్లాల్సిన వాళ్ల చేతుల్లో పుస్తకాలు. అక్కడి వాతావరణం నిశ్శబ్దంగానే ఉంది. కానీ ఆ పక్కనే పచ్చిక మైదానంలో కొంతమంది స్టూడెంట్స్ హాట్‌హాట్‌గా డిస్కషన్ చేస్తున్నారు. అప్పుడే అక్కడకు వచ్చిన పీహెచ్డీ స్టూడెంట్ సునీతగౌరీ కాస్త ఆసక్తిగా టాపిక్‌లోకి ఇన్వాల్వ్ అయింది. ఆమెను చూసి అంతా స్నేహపూర్వకంగా విష్ చేశారు... సునీత: ఏంటీ టాపిక్? హాట్ హాట్ డిస్కషన్. జ్యోతి: కమ్... కమ్... ఇంట్రస్టింగ్ టాపిక్కే... గ్లోబల్ సిటీ. సునీత: గ్లోబల్ సిటీ అయితే లాభమా? నష్టమా? శ్రావణ్: లాభనష్టాలు కాదు. అయితే ఎట్లుంటది! సిటీ మొత్తం మారిపోతది కదా! మన క్యాంపస్కొచ్చే వరకూ వైఫై... అసలు జర్నీ చేసినమా అనేది తెల్వదు! కల్చర్ మొత్తం చేంజ్ అయితది. పవన్: అంత చేంజ్ రావాలంటే జనం సహకరించాలి కదా. పృథ్వీ: సింగపూర్, యూకే.. ఇలా చాలాచోట్ల గ్లోబల్ సిటీస్ సక్సెస్ అయ్యాయి. క్విక్ చేంజ్ వచ్చింది. మన హైదరాబాద్కేం తక్కువ. సునీత: ఏం తక్కువ కాదు. కానీ అక్కడ సిస్టమ్ ఉంటుంది. రూల్స్ ఎవరూ అతిక్రమించరు. ఇక్కడిలా గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఉండదు. అంటే... ముందుగా మౌలిక వసతులు మెరుగుపడాలి. పబ్లిక్‌లోనూ మార్పు వస్తే... సింగపూర్ ఏం ఖర్మ... సింగపూర్‌కే హైదరాబాద్‌ను మోడల్ చేయొచ్చు. సమీర: అక్కడి దాకా ఎందుకు... ముంబై, చెన్నై, బెంగళూరు చూడండి. అక్కడ బస్టాప్‌లు రోడ్డు పక్కకు ఉంటయి. అక్కడే బస్సులు ఆగుతయి. మన సిటీలో ఎక్కడబడితే అక్కడే ఆగుతయి. దీన్ని గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకోవాలి. పవన్: అవును అందుకే పొలిటికల్ లీడర్స్ మారాలి. అడ్మినిస్ట్రేషన్‌లో పొలిటీషియన్స్ జోక్యం తగ్గితే మార్పు వస్తుంది. సిటీలో సవాలక్ష సమస్యలున్నయి. వాటి మీద దృష్టి పెట్టాలి. బాలుమహేష్: అందుకే గ్రీనరీని కాపాడాలమ్మా. మన చిన్నప్పటి నుంచి చెట్ల గురించి చదువుకుంటున్నం. ఒక్కసారన్న పాటించినమా? ఎంతసేపూ చదువులు, ర్యాంకులు! దీన్ని గ్లోబల్ సిటీ చేయాలంటే యూత్‌పైనే బాధ్యత ఎక్కువ ఉంది. జ్యోతి: బాబూ! ఈ సిటీని చూడ్డానికి ఎక్కడెక్కడి దేశాల వాళ్లో వచ్చారు. నిజాం కాలం నాటి హైదరాబాద్‌ను మోడల్‌గా తీసుకొనే వాళ్లట. మనలను చూసే వాళ్లు గ్లోబల్ సిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకంగా పాఠాలు నేర్చుకోవాల్సిన పనిలేదు. ఉన్న కట్టడాలు రక్షించుకుని, పరిసరాలు కాపాడుకుంటే అదే పదివేలు. అరే... ఒక్కసారి చార్మినార్‌కు పొయి చూడుర్రి. దాని చుట్టూ వెహికల్స్ రొద. అందమైన కట్టడం చరిత్ర మసకబారుతోంది. ఇట్లయితే గ్లోబల్ సిటీ మాటెట్లున్నా, చార్మినార్‌ను ఫ్యూచర్లో గూగుల్‌లో సెర్చ్ చేసి చూసుకోవాల్సొస్తది. సమీర: అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది కదా? మరి స్లమ్స్‌లో ఉండే వాళ్ల పరిస్థితి ఏంది? లక్ష్మణ్: సిటీలో చదువుకోవడానికి ఇబ్బంది లేదు. ఉద్యోగాలే సమస్య. దాంతో బాగ చదువుకున్నోళ్లు ఇతర దేశాలకు వెళ్తున్నారు. గ్లోబల్ స్థాయిలో హైదరాబాద్‌ను తీసుకెళ్తే మనోళ్లు దేశాలు పట్టుకు తిరిగే సమస్య ఉండదు కదా! దానికోసం సిటీని పూర్తిగా మార్చాలి. శ్రావణ్: అదెలా సాధ్యం? కూకట్పల్లి నుంచి దిల్సుఖ్నగర్ వరకూ అంతా కలిసిపోయింది. ఎలా వేరు చేస్తారు. పృథ్వీ: ఎనీ హౌ... గ్లోబల్ సిటీగా మార్చాలనే నిర్ణయానికి వెల్కం చెబుదాం. దాంతో పాటే పబ్లిక్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ కూడా కావాలి. అదే విధంగా కామన్ మ్యాన్‌కి కూడా ఇది నా సిటీ అనే భావన ఉండాలి. అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు తేవాలనే ఆలోచన రావాలి. లక్ష్మణ్: వస్తుంది. సిటీ కొన్నేళ్లకయినా మారుతుంది. మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ సమస్యలు ఇలా ఉంటాయా? గ్లోబల్ ఎఫెక్ట్ వస్తే లుక్ ఇలా ఉంటుంది. సునీత: ఏ మార్పు వచ్చినా... మన కల్చర్ మాత్రం పాడవ్వకుండా ఉండాలి బాబూ! లెట్స్... గో.