Local candidates
-
ఉగ్రవాదులకు స్థానిక స్లీపర్‌సెల్స్ సాయం?
శ్రీనగర్: పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కర్కశకాండ వెనుక స్థానిక స్లీపర్‌సెల్స్ హస్తం దాగుందని నిద్రాణంగా ఉండే ఉగ్ర బృందంలోని మాజీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇలాంటి పలు విషయాలను పంచుకున్నాడు. ‘‘స్థానికంగా ఉండే వాళ్ల నుంచి కనీస సహకారం లేకుండా ఇంతటి దాడి చేయడం అసాధ్యం. దాడిచేసిన లష్కర్ ఉగ్రవాదులతో కనీసం ఐదారుగురు స్థానిక స్లీపర్‌సెల్ సభ్యులు సాయపడి ఉంటారు. సాధారణంగా ఇలాంటి దాడుల్లో కనీసం నెల రోజుల ముందే స్లీపర్ సెల్ సభ్యులను దాడిచేయబోయే ఉగ్రవాదులు సంప్రదిస్తారు. దాడి ఎలా చేయాలి? ఎటు వైపు తప్పించుకోవాలి?లాంటివన్నీ ముందే ప్లాన్ చేస్తారు’’అని మాజీ స్లీపర్‌సెల్ సభ్యుడు చెప్పాడు. ‘‘ఒకవేళ నేనే స్వయంగా శ్రీనగర్‌లో దాడిచేయాలనుకుంటే గుడ్డిగా శ్రీనగర్‌కు వెళ్లను. ముందుగా శ్రీనగర్‌లో దాడిచేయబోయే చోట తరచూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు అనే ఖచ్చితమైన అంచనా ఉండాలి. ఆ ప్రాంతంపై నాకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన మనకు స్లీపర్‌సెల్స్ సభ్యులు కల్పిస్తారు. భద్రతా బలగాలు ఎంత మంది ఉండొచ్చు, దాడికి సఫలమయ్యే అవకాశాలు లాంటివన్నీ వాళ్లే చెప్తారు. తర్వాత ఉగ్రవాదులు రంగంలోకి దిగుతారు. బైసారన్లోనూ ఇదే జరిగి ఉంటుంది’’అని అన్నాడు.గతంలో జైలుకు వెళ్లి.. ఇతను గతంలో స్లీపర్‌సెల్‌లో పనిచేసిన నేరానికి కొన్నేళ్లు జైలులో గడిపి బయటికొచ్చాడు. ‘‘స్లీపర్‌సెల్ సభ్యులు దాడి చేయరు. దాడి చేయబోయే ఉగ్రవాదులకు ఆర్మీ కదలికలపై నిఘా సమాచారం అందిస్తారు. ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అత్యయిక అవసరాలు తీరుస్తారు. నేను కూడా గతంలో 2–4 ఏళ్లు స్లీపర్‌సెల్ సభ్యునిగా పనిచేశా. ఉగ్రవాదులకు కావాల్సినవి అందించా. రాత్రిళ్లు తిరిగి సమాచారం సంపాదించి ఇచ్చా. నేను ఇచ్చిన సమాచారంతో వాళ్లు ఎన్నో దాడులు చేశారు’’అని చెప్పాడు. గ్రనేడ్ దాడి ప్రయత్నంలో భద్రతా బలగాలు ఇతడిని అరెస్ట్‌చేశారు. నేరం నిరూపణ అయ్యాక కొంతకాలం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ‘‘ఆనాడు నేను మైనర్‌గా ఉండబట్టే విడుదలయ్యా. అది నా అదృష్టం. లేదంటే ఎప్పటికీ నేను విడుదలకాకపోయే వాడినేమో’’అని అతను అన్నాడు. ‘‘2015 కాలంలో నన్ను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకున్నారు. అప్పట్లో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లపై నిఘా అంతగా లేదు. అందుకే ఫేస్బుక్లో నాకు మెసేజ్‌లు పంపేవాడు. కొంతకాలానికి నిఘా పెరగడంతో బీబీఎం యాప్‌కు మారా. ఈ యాప్‌లో చేసే వీడియో, వాయిస్ కాల్స్‌ను ఎవరూ కనిపెట్టలేరు’’అని అతను చెప్పాడు. ఉగ్రవాదులతో పనిచేయడం 110 శాతం తప్పు ‘‘స్లీపర్‌సెల్ సభ్యునిగా ఉంటూ చిట్టడవిలోకి వెళ్లి ఉగ్రవాదులకు ఆహారం అందించి రావడం నా తొలి పని. తర్వాతర్వాత ఒక చోట ఉన్న వస్తువును రహస్యంగా మరో చోటుకు చేర్చాల్సి వచ్చేది. నాకు ఈ పనులు పురమాయించే ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే నేను నమ్మకస్తుడినా కాదా అని నిర్ధారించుకునేందుకు నాపై కూడా నిఘా కొనసాగేది. ఇప్పుటికీ నా స్నేహితుల్లో ఇద్దరు ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారు. మరో 13–14 మంది స్నేహితులు ఉగ్రవాదులుగా మారి భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఏ విధంగా చూసినా ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం 110 శాతం తప్పు. నా పదేళ్లగతాన్ని చూసుకుంటే అసలు నేనింకా బతికే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’అని అతను చెప్పాడు. -
అమల్లోకి ప్రైవేటు వర్సిటీల చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెం ట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–2018ని అమల్లోకి తెస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి జీవో 17 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. గతేడాది మార్చి 28వ తేదీన రాష్ట్ర అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీల చట్టం బిల్లు పాస్ అయింది. అదే ఏడాది దానిపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి వెంటనే అమల్లోకి తెస్తుందని అంతా భావించారు. కాని గతేడాది దానిని అమల్లోకి తేలేదు. తాజాగా సోమవారం చట్టం అమలుకు గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే చట్టం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం లేదా గురువారం జారీ చేసే అవకాశముంది. తర్వాత దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతిచ్చినా వచ్చే విద్యా సంవత్సరమే అవి తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. చట్టంలోని ప్రధాన అంశాలు.. నాణ్యతతో కూడిన విద్య, పరిశోధనలకు ప్రాధాన్యం, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా.. ఆధునిక పరిస్థితులకు పెద్ద పీట వేస్తూ ప్రపంచస్థాయి యూనివర్సిటీలను ఈ చట్టం ద్వారా ఏర్పాటుకు అనుమతిస్తున్నాం. ఈ చట్టం కింద ఏర్పాటయ్యే విద్యా సంస్థల కు పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. కోర్సుల నిర్వహణ, ప్రవేశాల విధానం ఆయా యూనివర్సిటీలే నిర్ణయిస్తాయి. తెలంగాణ విద్యార్థులకు మాత్రం 25 శాతం సీట్లు కల్పించాలి. వాటిల్లో ఫీజులను యూనివర్సిటీనే నిర్ణయిస్తుంది. ప్రతి వర్సిటీ ఫీ ఫిక్సేషన్ కమిటీని ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలి. ఆ కమిటీలో బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్, అకడమిక్ కౌన్సిల్‌కు చెందిన వారు సభ్యులుగా ఉంటారు. లింగ వివక్ష, ప్రాంతం, కులం, పుట్టిన ప్రదేశం, మతం, రాజకీయ కోణం, ఇతర కారణా లతో ఎవరికీ ప్రవేశాలను తిరస్కరించడానికి వీల్లేదు. ఈ నిబంధనలు కొత్తగా వర్సిటీని ఏర్పాటు చేసే సంస్థలకు వర్తిస్తాయి. తెలంగాణలో ఇప్పటికే ఉన్న విద్యా సంస్థలు యూనివర్సిటీగా ఏర్పడితే ప్రవేశాల్లో పాత విధానమే అమలు చేయాలి. సీట్ల భర్తీలో ఇప్పుడున్న రూల్ ఆఫ్ రిజర్వేషనే వర్తిస్తుంది. ఫీజు విధానం కూడా ఇప్పుడున్న ప్రకారమే కొనసాగుతుంది. తెలంగాణ ఫీజుల నియంత్రణ, ప్రవేశాల కమిటీ నిర్ణయించిన ప్రకారమే కొనసాగుతాయి. యూనివర్సిటీలు ఏర్పాటైన ఐదేళ్లలోగా నేషనల్ అసేస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ నుంచి గుర్తింపు పొందాలి. యూనివర్సిటీలకు ఎంత భూమి ఉండాలి.. కార్ఫస్ ఫండ్ ఎంత పెట్టాలన్న నిబంధనను చట్టంలో పొందుపర్చలేదు. నిర్ణీత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని మాత్రం పేర్కొంది. ఈ యూనివర్సిటీలు యూజీసీ, ఏఐసీటీఈ, ఎంసీఐ, ఎన్సీటీఈ తదితర జాతీయ స్థాయి విద్యా సంస్థల నిబంధనలకు లోబడే కోర్సులను రూపొందించాలి. యూనివర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చే సంస్థల దరఖాస్తులను (ప్రాజెక్టు రిపోర్టులను) పరిశీలించి, అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తుంది. ప్రాజెక్టు రిపోర్టు వచ్చిన నెలలో ఆమోదించడమా? రిజెక్టు చేయడమా? అన్న దానిపై నిపుణుల కమిటీ నిర్ణయాన్ని తెలుపుతుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్ రూపంలో ఇస్తుంది. అనుమతిచ్చిన ఏడాదిలోగా వర్సిటీని ఏర్పాటు చేయాలి. నాన్ ప్రాఫిట్ సొసైటీ, పబ్లిక్ ట్రస్టు, కంపెనీలు స్పాన్సరింగ్ బాడీగా ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేయవచ్చు. వర్సిటీకి చాన్స్‌లర్ ఉంటారు. యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంస్థ చాన్స్‌లర్‌ను నియమిస్తుంది. ఆయన ముగ్గురు సభ్యులు కలిగిన ప్యానల్ నుంచి ఒకరిని వైస్ చాన్స్‌లర్‌గా నియమిస్తారు. తొలగించే అధికారం ఆయనకే ఉంటుంది. 70 ఏళ్లలోపు వారిని వీసీగా నియమిస్తారు. ఆయన పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. అయితే మొదటిసారి మాత్రం ఏడాదే ఉంటుంది. రిజిస్ట్రార్‌ను చాన్స్‌లరే నియమిస్తారు. యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిధిలోనే ఏర్పాటు చేయాలి. ఇవి మరే కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి వీల్లేదు. ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకొని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, ప్రత్యేకమైన కోర్సులను, పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వర్సిటీలు రెండు అదనపు క్యాంపస్‌లు/సెంటర్లు ఏర్పాటు చేయవచ్చు. ఇవీ నాణ్యతా ప్రమాణాలు, వాస్తవిక అవసరాల మేరకు ఉంటాయి. అయితే ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో అదనపు క్యాంపస్‌ల ఏర్పాటుకు అనుమతివ్వవచ్చు. ఐదేళ్లలో అక్కడ కల్పించే మౌలిక సదుపాయాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్స్ ఉండవు. గౌరవ డిగ్రీలు కూడా ఇచ్చుకోవచ్చు. ప్రపంచంలో ఏ యూనివర్సిటీతోనైనా ఒప్పందం చేసుకోవచ్చు. నిధుల సేకరణ విషయంలో ఎలాంటి నిబంధనలు లేవు. ఇతర దేశాల నుంచి కూడా నిధులు సేకరించుకోవచ్చు. యూనివర్సిటీల గవర్నింగ్ బాడీలో మెంబర్‌గా కార్యదర్శి, ఆ పైస్థాయి ప్రభుత్వ అధికారి ఉంటారు. ఏడాదికి నాలుగుసార్లు గవర్నింగ్ బాడీ సమావేశం కావాలి. ప్రభుత్వం సూచనలు మాత్రమే ఇస్తుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాత్రం జోక్యం చేసుకుంటుంది. ప్రభుత్వ అనుమతి లేకుండా యూనివర్సిటీ మూసివేయొద్దు. -
ఆ పోస్టుల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం
నల్లగొండ : అంగన్వాడీ పోస్టుల భర్తీలో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ స్థాయీ సంఘ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మహిళలకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. బుధవారం జెడ్పీ కా ర్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ స్థాయి కమిటీ, సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశాలు కమి టీల చైర్మన్లు చింతల వరలక్ష్మీ, చుక్కా ప్రేమలత అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కమిటీ సమావేశాల్లో సభ్యులు మాట్లాడుతూ.. అంగన్వాడీ పోస్టుల భర్తీలో పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ప్రకారం కాకుండా స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గతంలో అంగన్వాడీ సెంటర్ల లో ఉద్యోగాలుగా పనిచేసి వేర్వేరు కారణాలతో మానేసిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానికులతో పాటు, ఇతర గ్రామాల్లో ఉంటున్న వారికి అవకాశం కల్పించాలని సభ్యుల అభిప్రాయం మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామాల్లో మహిళా సంఘాలను చైతన్యపర్చి వ్యక్తిగత మరుగుడొడ్లు నిర్మించుకునేలా కమిటీ సభ్యులు చొరవ చూపించాలని చైర్మన్ వర లక్ష్మీ, సీఈఓ హనుమానాయక్ సభ్యులకు సూచిం చా రు. అంగన్వాడీలకు విజయా డెయిరీ నుంచి పాలు సప్లయ్ కావడం లేదని, ఆ కాంట్రాక్ట్‌ను తొలగించి మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కొత్త భవనాలకు ప్రతిపాదనలు సంక్షేమ వసతి గృహాలకు ఎక్కడైతే సొంత భవనాలు లేవో వాటిని గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే పక్కా భవనాల మంజూరుకు కృషి చేస్తానని కమిటీ చైర్మన్ చుక్కా ప్రేమలత పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్స్ పనుల త్వరగా పూర్తిచేయాలని, ఎస్సీ, ఎస్టీలకు రు ణాలు అందజేసి వారిని ఆదుకోవాలని చైర్మన్ సూ చించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. -
‘నకిలీ’ టీచర్లు!
- తప్పుడు బోనఫైడ్లతో ఉద్యోగాలు! - 45 మందిపై యంత్రాంగానికి ఫిర్యాదులు - పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన కలెక్టర్ జిల్లా విద్యాశాఖలో మరో ‘నకిలీ’ బాగోతం వెలుగుచూసింది. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో ఉద్యోగాలు కొట్టేసిన తంతు మర్చిపోకముందే మరో నాటకం తెరపైకి వచ్చింది. గతనెలలో కల్పిత మార్కుల జాబితాలతో కార్యాలయ సబార్డినేట్ ఉద్యోగాలు దక్కించుకున్న 14 మందిని టర్మినేట్ చేశారు. ఈ క్రమంలో ఇలాంటి అంశాలపై కఠినంగా స్పందించాలని యంత్రాంగం సంకల్పించిన నేపథ్యంలో.. తాజాగా నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో జిల్లాలో పదుల సంఖ్యలో టీచర్ ఉద్యోగాలు సొంతం చేసుకున్నట్లు బయటపడింది. ‘స్థానిక’ కోటాలో భర్తీ చేసిన ఉపాధ్యాయ పోస్టులను 45 మంది స్థానికేతరులు బూటకపు బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించి కొల్లగొట్టినట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పూర్తిస్థాయి విచారణకు యంత్రాంగం ఉపక్రమించింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా: అన్ట్రైన్డ్ డీఎస్సీ-2002లో కేవలం స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. అదేవిధంగా 2006లో నిర్వహించిన డీఎస్సీల్లోనూ స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తూ నియామకాలు చేపట్టారు. అయితే ఈ రెండు డీఎస్సీ ల్లో స్థానికేతర అభ్యర్థులకు పెద్దగా అవకాశం దక్కలేదు. దీంతో అత్యధిక పోస్టులుండి.. పోటీ తక్కువగా ఉండడంతో స్థానికేతరులు జిల్లాలో పాగావేస్తూ వ చ్చారు. ఈ పరిస్థితుల్లోనే నకిలీ బోనాఫైడ్లు తయారుచేసి ఉద్యోగాలు పొందినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల్లో 2002, 2006 సంవత్సరాల్లో నిర్వహించిన డీఎస్సీలకు సంబంధించినవే. శివారు మండలాల నుంచే.. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన విషయంలో 45 మందిపై ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ప్రాథమిక దర్యాప్తులో ఐదింటిని యంత్రాంగం తిరస్కరించింది. మిగిలిన 40 ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుల్లో గండేడ్, కుల్కచర్ల, దోమ, పరిగి, హయత్‌నగర్, ఘట్కేసర్ మండలాల నుంచి బోగస్ బోనాఫైడ్‌లో పొందినట్లు ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలల వారీగా విచారణ చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో బదిలీల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత అధికారులు పూర్తిస్థాయి విచారణకు దిగి అక్రమాలపై నిగ్గు తేల్చనున్నారు. 10 మందిపై క్రిమినల్ కేసులు వివిధ శాఖల్లో పనిచేస్తున్న 13 మంది ఆఫీస్ సబార్డినేట్లను జిల్లా యంత్రాంగం ఇటీవల టర్మినేట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా నకిలీ మార్కుల సర్టిఫికెట్లు సమర్పించనట్లు విచారణలో తేలడంతో ఈమేరకు యంత్రాంగం చర్యలు తీసుకుంది. తాజాగా వీరిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 10 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వారి నుంచి రెవెన్యూ రికవరీ సైతం చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది.