breaking news
latin word
-
యూఎస్‌లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్‌లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్‌లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆవిష్కరణం: గొడుగు అమ్మాయిలదట!
అంబ్రెల్లా అనే పదం లాటిన్ నుంచి వచ్చింది. అంబ్రా అంటే నీడ అని, ఎల్లా అంటే చిన్న అని అర్థం. అంటే అంబ్రెల్లాకు ‘చిన్న నీడ’ అని అర్థమన్నమాట. గొడుగుకు చాలా చరిత్రే ఉంది. గొడుగు పుట్టింది ఎండ నుంచి రక్షణకు.. క్రీస్తుపూర్వమే వీటిని వాడినట్టు తెలుస్తోంది. రికార్డుల ప్రకారం చైనాలో తొలిసారి క్రీ.శ. 21లో గొడుగు వాడారు! అయితే వారు వాన కోసం వాడారు. తొలి వాటర్‌ప్రూఫ్ గొడుగు వాళ్లే తయారుచేశారు. చిత్రమేంటంటే.. గొడుగులు ఆడాళ్ల కోసం తయారుచేశారట. దానిని తొలిసారి వాడిన పురుషుడు ఇంగ్లండ్‌కు చెందిన జోనాస్ హాన్వే (1712-1786) అనే ఒక ట్రావెలర్, రచయిత. అప్పట్లో ఆయన రచయితగా కంటే గొడుగు వాడిన పురుషుడిగా ప్రపంచానికి ఎక్కువ ఫేమస్ అయ్యాడట. మొదటి గొడుగుల దుకాణం కూడా లండన్‌లోనే వెలిసింది. 1830 లో పుట్టిన ఈ దుకాణం ఇప్పటికీ ఉంది. (53, న్యూ ఆక్స్ఫర్డ్ వీధి, లండన్). 1852 వరకు గొడుగు హ్యాండ్ చెక్కదే. వీటిని ఆర్టిస్టిక్‌గా చేయడానికి ప్రత్యేకంగా ఉండేవారట. వారికి మంచి ఆదాయం కూడా ఉండేది. 1852లో శామ్యూల్ ఫాక్స్ తొలిసారి స్టీల్ రాడ్‌ను గొడుగులో వాడాడు. 1928లో హాన్స్ హాప్ట్ పాకెట్ గొడుగుల్ని తయారు చేశాడు. 1969లో అమెరికాకు చెందిన బ్రాడ్ఫోర్డ్ ఫిలిప్స్ గొడుగుల తయారీకి పేటెంట్ సంపాదించాడు. అక్కడి నుంచి మార్కెట్లో వివిధ రకాల గొడుగులు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో గొడుగులు పెద్దగా నలుపు రంగుల్లో ఉండేవి. తర్వాత వాటి సైజు తగ్గుతూ వచ్చింది. తర్వాత రకరకాల డిజైన్లలో ఆకర్షణీయంగా తయారయ్యాయి. కొసమెరుపు: అప్పటికీ ఇప్పటికీ గొడుగు రాచరికానికి చిహ్నమే. ఓ మనిషి చేత గొడుగు పట్టించుకోవడం అంటే ఆ ఠీవి వేరు! ఇప్పటికీ దర్శకులను సెట్స్‌లో గొడుగు లేకుండా ఎవరూహించుకుంటారు?