breaking news
Lalitha jewelery
-
లలితా జ్యువెల్లరి ఐపీవోకి సెబీ ఓకే
హైదరాబాద్: లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రతిపాదిత ఇనీషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,700 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 1,200 కోట్ల విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ రూ. 500 కోట్ల విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నారు. తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 1,014.50 కోట్లను కొత్త స్టోర్స్ ఏర్పాటుకు, మిగతా మొత్తాన్ని ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 1985లో చెన్నై టీ నగర్లో తొలి స్టోర్ ప్రారంభించిన లలితా జ్యువెల్లరి దక్షిణాదిలో 56 స్టోర్లతో విస్తరించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 22, తెలంగాణలో 6 స్టోర్స్ ఉన్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 13,316.80 కోట్లుగా ఉన్న ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,788 కోట్లకు చేరగా లాభం రూ. 238.3 కోట్ల నుంచి రూ. 359.8 కోట్లకు చేరింది.లలితా జ్యువెలరీ మార్ట్ (Lalithaa Jewellery Mart) దక్షిణ భారతదేశంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రాంతీయ బ్రాండ్‌ల్లో ఒకటి. కొన్నేళ్లుగా కంపెనీ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. నాణ్యత, పారదర్శకత, భారీ స్టోర్ల ఏర్పాటు వ్యూహంతో ఈ సంస్థ దేశీయ నగల మార్కెట్లో తనదైన ముద్ర వేస్తోంది. నాణ్యతకు నిదర్శనంగా అన్ని ఆభరణాలపై BIS హాల్‌మార్క్ ప్రమాణాలను పాటిస్తూ బంగారం (Gold), వెండి (Silver), వజ్రాల (Diamond) ఆభరణాలను అందిస్తోంది. ఈ సంస్థకు మొత్తం 6.09 లక్షల చదరపు అడుగుల వ్యాపార స్థలం ఉంది. ఇది సంస్థ విస్తృతికి అద్దం పడుతోంది.ఆర్థిక ప్రగతిలో దూకుడులలితా జ్యువెలరీ గత కొంతకాలంగా ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తోంది. సంస్థ ఆదాయ వృద్ధి రేటు 43.62%గా ఉందని కంపెనీ తెలిపింది. ఇది ఈ రంగంలో సంస్థ బలమైన పనితీరును సూచిస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.16,788 కోట్లు ఆదాయం వస్తే రూ.359.8 కోట్లు లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరంలో (9 నెలలు) రూ.12,594 కోట్లు ఆదాయం వస్తే అందులో రూ.262.3 కోట్లు లాభంగా ఉందని కంపెనీ తెలిపింది.భారీ స్టోర్ల వ్యూహం, తయారీ సామర్థ్యంలలితా జ్యువెలరీ దేశంలోనే అతిపెద్ద నగల స్టోర్లను నెలకొల్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన స్టోర్ల పరిమాణం ప్రత్యేకంగా నిలిచింది. విజయవాడలో 1,00,000 చదరపు అడుగులు, సోమాజిగూడ (హైదరాబాద్)లో 98,210 చదరపు అడుగులు, విశాఖపట్నంలో 65,000 చదరపు అడుగులతో స్టోర్లు నెలకొల్పింది.ఈ సంస్థకు తమిళనాడులో రెండు అత్యాధునిక తయారీ కేంద్రాలు (మానుఫ్యాక్చరింగ్ యూనిట్లు) ఉన్నాయి. ఇక్కడ 563 మంది నిపుణులైన కారిగర్లు(బంగారు ఆభరణాల తయారీదారులు) పనిచేస్తున్నారు. వీరు కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా అనేక రకాల డిజైన్లను రూపొందిస్తున్నారు. -
లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్?
కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజా మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కార్తి ఇంట్రో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కార్తి క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడింది అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా) తమిళనాడులోని చెన్నైలో లలితా జ్యువెలరీ దుకాణంలో తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి 13 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో అతను దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఈ రియల్ దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. (ఇదీ చదవండి: ఐటం పాప బాగా రిచ్.. నైట్ డ్రెస్సుకు ఎన్ని వేలు పెట్టిందంటే?) కానీ కథలో కొన్ని మార్పులను కార్తి సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు? అనేక ప్రతిష్టాత్మకమైన బంగారు ఔట్లెట్లలో నగలను ఎలా దోచుకున్నాడు? అనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మేకర్స్ జోడిస్తున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో చిత్ర సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారట. నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో కథను ముగించాలని అభిప్రాయపడ్డారట! మరి జపాన్‌కు ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారో తెలియాలంటే? ఈ దీపావళి వరకు ఆగాల్సిందే! -
లలితా జ్యువెలరీలో భారీ చోరీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని లలితా జ్యువెలరీ షోరూంలో భారీ చోరీ జరిగింది. రూ. 50 కోట్ల విలువైన నగలను దుండగులు చోరీచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరుచిరాపల్లి సత్రం బస్‌స్టేషన్ దగ్గర లలితా జ్యువెలరీ షోరూం ఉంది. అందులో గ్రౌండ్ ఫ్లోర్లో ప్రదర్శన కోసం ఉంచిన నగలు బుధవారం ఉదయానికి మాయమయ్యాయి. దీన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. షోరూం వెనుక గోడకు కన్నం వేసి ఉంది. దుండగులు తమ వేలిముద్రలు ఫోరెన్సిక్ నిపుణులకు దొరక్కుండా ఉండేందుకు కారప్పొడి చల్లి వెళ్లారు. ముఖాలకు జోకర్ బొమ్మల మాస్క్‌లు వేసుకుని షోరూంలో సంచరించడం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సుమారు రూ. 50 కోట్ల విలువైన వంద కిలోల బంగారం, వజ్రాలు, వెండి నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. రూ.13 కోట్ల విలువైన నగలు చోరీకి గురయ్యాయని తిరుచ్చిలో లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ చెప్పడం గమనార్హం. -
వైజాగ్‌లో లలితా జువెలరీ మెగా షోరూమ్
హైదరాబాద్: ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ ‘లలితా జువెలరీ’ ఈ నెల 21న వైజాగ్‌లో మెగా షోరూమ్‌ను ప్రారంభిస్తోంది. నగరంలోని ద్వారకానగర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఏర్పాటైన ఈ షోరూమ్ విస్తీర్ణం 75,000 చదరపు అడుగులు ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ షోరూమ్‌లో విభిన్నమైన ఆధునాతన డిజైన్లతో కూడిన బంగారు ఆభరణాలు, హాల్‌మార్క్ ధ్రువీకృత నగలు, ఐజీఐ సర్టిఫైడ్ వజ్రాభరణాలు, సమకాలీన వెండి వస్తువులు, ఫ్యాషనబుల్ స్టోన్స్ వంటి తదితర వస్తువులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. వీటితోపాటు కస్టమర్లకు సరళమైన కొనుగోలు పథకాలను కూడా అందిస్తున్నట్లు పేర్కొంది. షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నామని సంస్థ చైర్మన్, మేనే జింగ్ డెరైక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.