పోలీసుల అదుపులో త్రీజీ లవ్ నిర్మాత!
విజయనగరం : 'త్రీజీ లవ్' సినీ నిర్మాత విజయనగరానికి చెందిన కోలగట్ల ప్రతాప్ కుమార్‌ను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రతాప్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడని, పెళ్లి చేసుకుంటానని... సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని చెప్పి మోసగించినట్లు కరీంనగర్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో నిందితుడిని విజయనగరంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రతాప్ పై 417, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్వేర్ ఇండియా స్టూడియోస్ పతాకంపై కోలగట్ల ప్రతాప్ 3జీ లవ్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.