breaking news
kirankumar died
-
లండన్‌లో మృతి చెందిన గొడవర్రు యువకుడు
గొడవర్రు(చేబ్రోలు): లండన్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామానికి చెందిన యువకుడు గత నెలలో లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించాడు. గొడవర్రు గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆరాధ్యుల యజ్ఞనారాయణ, భూలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు కిరణ్‌కుమార్ (25) రెండేళ్ల కిందట లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. గత నెల 26వ తేదీన బైక్‌పై వెళ్తున్న కిరణ్‌కుమార్‌ను ప్రమాదవశాత్తూ కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన కిరణ్‌కుమార్ చికిత్స పొందుతూ జూలై 3వ తేదీన మరణించాడు. ప్రవాస భారతీయుల సహకారంతో గురువారం కిరణ్‌కుమార్ మృతదేహాన్ని విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. స్వగ్రామం గొడవర్రుకు తీసుకురావటానికి భారీ వర్షం ఆటంకం ఏర్పడటంతో జాప్యం జరిగింది. కిరణ్‌కుమార్ మృతదేహం శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంటుందని అనంతరం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
సముద్రంలో పడి బాలుడి మృతి
తూర్పుగోదావరి(పిఠాపురం): ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన పి. కిరణ్ కుమార్(8)కు ఈ రోజు స్కూల్ బంద్ కావడంతో తండ్రితో కలిసి బోటు రిపేర్ చేసే ప్రదేశానికి వెళ్లాడు. అయితే తండ్రి సముద్రం వద్ద బోటు రిపేరు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిరణ్ నీళ్లలో పడి మృతి చెందాడు.