breaking news
keshavareddy schools
-
ఎచ్చెర్లలో కేశవరెడ్డి కార్పొరేషన్ స్కూల్స్ బాధితుల ఆందోళన
-
నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు: కేశవరెడ్డి
తాను కిడ్నాప్ అయినట్లు మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని కేశవరెడ్డి స్కూల్స్ సంస్థల అధినేత కేశవరెడ్డి తెలిపారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను కేవలం తన బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్నానని ఆయన తెలిపారు. ఆయన కిడ్నాప్ అయినట్లు మీడియాలోని ఒక వర్గంలో ప్రచారం కావడంతో ఈ అంశంపై ఆయన 'సాక్షి'కి వివరణ ఇచ్చారు. కొంతమంది తానంటే గిట్టనివాళ్లు కావాలనే తనమీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. కేశవరెడ్డిని ఎవరూ కిడ్నాప్ చేయలేదని బనగానపల్లి సీఐ కూడా ఓ ప్రకటన ఇచ్చారు.