breaking news
Kesavapuram reservoir
-
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్టు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు గాను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనుల ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేసింది. గోదావరి ఫేజ్– 2లో భాగంగా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి శామీర్‌పేట్ సమీపంలో నిర్మించే కేశవాపురం రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించేలా గత ప్రభుత్వం డీపీఆర్ తయారు చేసింది. ఆరేళ్ల క్రితమే మేఘా కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది. అయితే పనులు ప్రారంభించకపోవడంతో ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ తాజాగా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేశవాపురం ప్రాజె క్టుకు అయ్యే రూ. 2 వేల కోట్లతోనే గోదావరి ఫేజ్–2 పథకాన్ని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్‌కు తాగునీరు అందించేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తాగునీటికి 10, జంట జలాశయాలకు 5 టీఎంసీలు మల్లన్నసాగర్ నుంచి తరలించే 15 టీఎంసీల జలాల్లో 10 టీఎంసీలు హైదరాబాద్ ప్రజల తాగు నీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలకు అందించనున్నారు. మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వ ప్రతిపాదన ఇలా.. గత ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం.. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు తరలించి అక్కడినుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీల కేశవాపురం చెరువును నింపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఘన్పూర్ మీదుగా హైదరాబాద్‌కు తాగునీటి కోసం 10 టీఎంసీలు సరఫరా చేస్తారు. అయితే ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూ సేకరణ చిక్కులతో పాటు అలైన్మెంట్ లోపాలతో పనులు ముందుకు సాగలేదని ప్రభుత్వం గుర్తించింది. పనులు ప్రారంభించని నిర్మాణ సంస్థ బీఆర్ఎస్ హయాంలో రిజర్వాయర్ నిర్మాణ టెండర్లను దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వివిధ కారణాలతో పనులు ప్రారంభించలేదు. అ యితే 2017 నాటి ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం పను లు చేపట్టలేమని, 2024 ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని కోరుతూ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా ఆ కంపెనీకి ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త డిజైన్‌లో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కూడా.. కాంగ్రెస్ సర్కార్ మార్చిన డిజైన్‌లోని కొత్త రూట్ ప్రకారం.. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్‌కు అక్కడినుంచి నేరుగా హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేస్తారు. దీనితో పాటు మూసీ పునరుజ్జీవ పథకంలో భాగంగా జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు 5 టీఎంసీలు సరఫరా చేస్తారు. ఎక్కువ శాతం నీరు గ్రావిటీతో వచ్చేలా పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మల్లన్నసాగర్ బెస్ట్ ఆప్షన్!కొండపోచమ్మ సాగర్‌కు 15 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమే ఉండగా.. మల్లన్నసాగర్‌కు 50 టీఎంసీల కెపాసిటీ ఉంది. కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయడం వీలుకాదు. అదే మల్లన్నసాగర్లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీ లుంది. అందుకే కొండపోచమ్మ సాగర్‌కు బదులు మల్లన్నసాగర్‌ను ఎంచుకున్నట్లు అధికార వర్గా లు తెలిపాయి.పాత ప్రతిపాదనలో అక్కారం, మర్కూర్, కొండపోచమ్మ సాగర్, బొమ్మరాసిపేట, ఘన్పూర్.. మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్ చేయాలి. కానీ కొత్త డిజైన్‌లో మల్లన్నసాగర్, ఘన్‌పూర్‌ల వద్ద నీటిని పంపింగ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఒక కిలో లీటర్‌కు రూ.48 వరకు ఖర్చు అవుతుండగా, కొత్త ప్రాజెక్టు పూర్తయితే కేవలం రూ.4 ఖర్చవుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. -
కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్ రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్‌కు తరలించే కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ బుధవారం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ సరైన సమయంలో కాకపోవడం, పనులు ప్రారంభం కాకపోవడంతో కాంట్రాక్ట్ రద్దు చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుంది. అదే ఖర్చుతో.. గోదావరి ఫేజ్ 2 స్కీమ్ ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని జలమండలి అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. -
జల సిరి దిశగా మరో ముందడుగు
♦ రూ.7,600 కోట్లతో ‘గ్రేటర్’ చుట్టూ రెండు భారీ స్టోరేజీ ♦ రిజర్వాయర్ల నిర్మాణం వ్యాప్కోస్ సంస్థకు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ♦ రిజర్వాయర్ల నిర్మాణానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థ రుణం సాక్షి, హైదరాబాద్: మహానగర దాహార్తిని తీర్చేందుకు రెండు భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణంలో మరో ముందడుగు పడింది. నగర శివార్లలో నల్లగొండ జిల్లా దేవులమ్మనాగారం(మల్కాపూర్ పరిసరాలు), రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపూర్‌లలో ఇంటర్నేషనల్ లీడ్ అండ్ ఫైనాన్స్ సెక్యూర్డ్(ఐఎల్ అండ్ ఎఫ్ఎస్) సంస్థ నుంచి సేకరించనున్న రూ.7,600 కోట్ల రుణంతో భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం, ఔటర్ రింగు రోడ్డులోపలున్న గ్రామపంచాయతీల్లో నీటిసరఫరా వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. దీనిపై రూ.1.80 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించే బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు అప్పగించింది. గోదావరి జలాలతో కేశవాపూర్, కృష్ణా జలాలతో దేవులమ్మనాగారం రిజర్వాయర్లను నింపనున్నారు. ఈ రెండు భారీ రిజర్వాయర్లలో వర్షాకాలంలో నిల్వచేయనున్న 40 టీఎంసీల నీటిని విపత్కర పరిస్థితుల్లో ఏడాది పొడవునా నగర తాగునీటి అవసరాలకు వినియోగించవచ్చని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. రూ.1,960 కోట్లతో దేవులమ్మనాగారం మల్కాపూర్ సరిహద్దుల్లో రూ. 1,960 కోట్ల అంచనా వ్యయంతో దేవులమ్మనాగారం రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ జలాశయంలో పాలమూరు ఎత్తిపోతల, డిండి పథకం ద్వారా కొంతమార్గంలో పంపింగ్.. మరికొంత మార్గంలో గ్రావిటీ ద్వారా 20 టీఎంసీల జలాలను తరలించి నింపనున్నారు. రూ.1,660 కోట్లతో కేశవాపురం రిజర్వాయర్ శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1,660 కోట్ల అంచనా వ్యయంతో మరో రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ జలాశయంలో గోదావరి మం చినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వా రా తరలించనున్న నీటితో ఈ జలాశయాన్ని నింపే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.