కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య
వినుకొండ(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని కీర్తి థియేటర్ సమీపంలో రాజేశ్వరి(18) అనే వివాహిత శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజేశ్వరికి నాలుగు నెలల క్రితమే వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి అత్తింటి వేధింపులు ఎక్కువ కావడంతో మనస్థాపం చెందిన రాజేశ్వరి నాలుగు రోజులక్రితం పుట్టింటికి వచ్చింది.
శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.