breaking news
Justice Lingala Narasimha Reddy
-
మీ విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదు, ‘విద్యుత్’ కమిషన్ నుంచి వైదొలగండి.. జస్టిస్ నరసింహారెడ్డికి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రెస్ స్థలాన్ని కోర్టులకు ఇవ్వాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి సూచన హైదరాబాద్: ఖాళీగా ఉన్న చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ స్థలంలో కోర్టుల సముదాయాన్ని నిర్మిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లింగాల నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రెస్ స్థలాన్ని కోర్టులకోసం కేటాయించేలా ప్రభుత్వంతో చర్చించాలని అడ్వకేట్ జనరల్‌కు సూచించానని ఆయన తెలిపారు. ఈ సముదాయంలోకి జంటనగరాల పరిధిలోని అన్ని కోర్టులను తరలించాలని సూచించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో న్యాయశాఖ ఉద్యోగుల సొసైటీ ఆర్థికసాయంతో ఏర్పాటు చేసిన ‘ఈ-లైబ్రరీ’ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ఇరుకైన ప్రదేశాల్లో, అసౌకర్యాల మధ్య కోర్టులు పనిచేస్తున్నాయని, ఈ నేపథ్యంలో సువిశాలమైన ప్రెస్ స్థలాన్ని కేటాయిస్తే అన్ని వసతులతో కోర్టు కాంప్లెక్స్‌ను నిర్మించవచ్చని అన్నారు.