breaking news
Juggernaut
-
వివాదంలో హీరో ‘అనధికార’ బయోగ్రఫీ
ముంబై: బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా అనధికారికంగా విడుదలైన ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’ పుస్తక రచయిత, పబ్లిషర్స్‌పై సంజయ్ దత్ చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమతున్నారు. త్వరలోనే నిజమైన, అధికారిక బయోగ్రఫీ విడుదల అవుతుందని సంజయ్ దత్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. బాలీవుడ్స్ బాడ్ బాయ్స్ పుస్తక రచయిత యాస్సర్ ఉస్మాన్‌కు, పబ్లిషర్ జుగ్గర్నాట్కు నోటీసులు పంపారు. అలాగే వీరికి తాను తన బయోగ్రఫీ రాసేందుకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. పుస్తకంలో తాము ఎటువంటి సమాచారం జొప్పించలేదని, కేవలం పబ్లిక్ డొమైన్లో ఉన్న సమాచారం మాత్రమే ప్రచురించడానికి ఉపయోగించామని పబ్లిషర్ జుగ్గర్‌నాట్ తెలిపింది. గతంలో పత్రికల్లో ప్రచురితమైన సమాచారం, తాను ఇచ్చిన ఇంటర్వ్యూలు, 1990 దశకంలో గాసిప్ మ్యాగజైన్లు రాసిన ఊహాజనితమైన సమాచారం ఆధారంగా చేసుకుని పుస్తకం రాశారని, అందులో తప్పుడు సమాచారం ఉందని సంజయ్ పేర్కొన్నారు. ఈ విషయం తనను, తన కుటుంబసభ్యులకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. సునీల్ దత్, నర్గీస్ ఎలా, ఎప్పుడు కలిసి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సంజయ్ దత్ జననం, బోర్డింగ్ స్కూల్లోసంజయ్ దత్ జీవనం, తల్లి నర్గీస్ మరణం, సోదరి,తండ్రితో సంజయ్ బంధం, మాదక ద్రవ్యాలకు బానిస కావడం, వాటి నుంచి బయటపడటం, సంజయ్ పెళ్లి, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, ముంబై బాంబు పేలుళ్ల కేసు, ప్రస్తుతం సంజయ్ దత్ పరిస్థితి తదీతర విషయాలు ‘ది క్రేజీ అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ బాలీవుడ్స్ బాడ్ బాయ్’లో చర్చకు వచ్చాయి. -
మరో సంచలనానికి కన్హయ్య రెడీ
న్యూఢిల్లీ: జాతీయవాదం, స్వేచ్ఛవాదంపై జాతీయస్థాయిలో తీవ్రమైన చర్చకు కారకుడైన జేఎన్ యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడు. తనకెదురైన అనుభవాలను అక్షర బద్ధం చేయనున్నాడు. తన జీవితానుభవాలను పుస్తకంగా తీసుకురానున్నాడు. స్కూల్ నుంచి స్టూడెంట్ పాలిటిక్స్ దాకా సాగిన ప్రయాణం గురించి ఇందులో పొందుపరచనున్నాడు. బిహార్ నుంచి తీహార్ వరకు తన జీవితంలో జరిగిన ఘటనలను పుస్తకంలో రాయనున్నాడు. బిహార్ లో గడిచిన స్కూల్ జీవితం, విద్యార్థి రాజకీయాల్లో తాను పోషించిన పాత్ర, జాతిద్రోహంలో అరెస్ట్, జైలు నుంచి బయటివచ్చిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను పుస్తకంలో ప్రస్తావించనున్నాడు. ఈ పుస్తకానికి 'బిహార్ టు తీహార్' అని పేరు పెట్టాడు. 'వ్యక్తులను చంపగలరు కానీ వాళ్ల ఆశయాలను చంపలేరని భగత్ సింగ్ అన్నారు. మేం చేస్తున్న పోరాటం మమ్మల్ని ఎక్కడివరకు తీసుకెళుతుందో తెలియదు. కానీ మా ఆశయాలు పుస్తక రూపంలో చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నామ'ని 28 ఏళ్ల కన్హయ్య కుమార్ అన్నాడు. తరతరాలుగా భారతీయ సమాజంలో కొనసాగుతున్న వైరుధ్యాలను, యువత ఆశ-నిరాశలు, పోరాటాల గురించి రాస్తానని చెప్పాడు. అతడి పుస్తకాన్ని జాగర్ నట్ ప్రచురించనుంది.